అలమేలుమంగా వేంకటేశ్వర శతకము

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము తాళ్ళపాక అన్నమయ్య రచించిన శతకము.

ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి అలమేలు మంగ ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పేర్కొన్నారు.

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము
శతక కర్త అన్నమయ్య

కవి ఇందులో మల్లెలవంటి ఉత్పలమాల, చంపకమాల పద్యాలతో తల్లివంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా భక్తి, శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.

ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ నిడదవోలు వెంకటరావు రచించారు.

ప్రారంభం

ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా

త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱున్

జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ

మూసినముత్యమై యురము ముంగిట జెంగట వేంకటేశ్వరా !

ఉదాహరణలు

చ. కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ

పలుకులతేనెలన్ విభుని బట్టము గట్టితి నీదుకౌగిటన్

వలదని చెప్పినన్ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ

కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !

ఉ. చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికిం

జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్

జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుదీగ లా

క్రిక్కిరిగుబ్బలే పసిడికిన్న రకాయలు వేంకటేశ్వరా !

ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్

కానిక లిచ్చినాడ వట కౌగిట నాయలమేలుమంగకున్

మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబున గౌగిలించి నీ

పానుపుమీది చేత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా !

ముగింపు

ఉ. అమ్మకు దాళ్ళపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పెగో

కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకున్

నెమ్మది నీవు చేకొని యనేకయగంబుల్ బ్రహ్మకల్పముల్

సమ్మది మంది వర్థిలను జవ్వన లీలల వేంకటేశ్వరా !

మూలాలు

Tags:

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము ప్రారంభంఅలమేలుమంగా వేంకటేశ్వర శతకము ఉదాహరణలుఅలమేలుమంగా వేంకటేశ్వర శతకము ముగింపుఅలమేలుమంగా వేంకటేశ్వర శతకము మూలాలుఅలమేలుమంగా వేంకటేశ్వర శతకముఅలమేలు మంగతాళ్ళపాక అన్నమయ్యవేటూరి ప్రభాకర శాస్త్రిశతకము

🔥 Trending searches on Wiki తెలుగు:

కృష్ణవంశీజరాయువుభీమ్స్ సిసిరోలియోరమణ మహర్షిభారతీయ జనతా పార్టీవచన కవితశాసన మండలినామవాచకం (తెలుగు వ్యాకరణం)రాజ్యసభతెలుగునాట జానపద కళలుఎం. ఎం. కీరవాణికాకునూరి అప్పకవివాల్మీకిజూనియర్ ఎన్.టి.ఆర్కేతువు జ్యోతిషందృశ్యం 2భరణి నక్షత్రముపుట్టపర్తి నారాయణాచార్యులుపొడుపు కథలుతెలంగాణ జిల్లాలుహైదరాబాదు చరిత్రవిష్ణువు వేయి నామములు- 1-1000నోబెల్ బహుమతిఉసిరిలోక్‌సభ స్పీకర్సంధిరాజ్యాంగంగ్లోబల్ వార్మింగ్వేమనశతభిష నక్షత్రముభారత రాజ్యాంగ పీఠికతెలుగు పత్రికలుసంభోగంమకరరాశివసంత ఋతువువేయి శుభములు కలుగు నీకుసమతామూర్తిబోయరంజాన్అగ్నిపర్వతంరామాయణంలో స్త్రీ పాత్రలుఅంగారకుడువిడదల రజినిప్రధాన సంఖ్యఅమరావతికుటుంబంపరశురాముడుశుక్రుడుప్రియురాలు పిలిచిందిమశూచిపాండవులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకండ్లకలకఇంటి పేర్లుశతక సాహిత్యముమంచు మనోజ్ కుమార్ఎండోమెట్రియమ్క్వినోవాసర్దార్ వల్లభభాయి పటేల్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుభూగర్భ జలంసమ్మక్క సారక్క జాతరపొంగూరు నారాయణపూర్వ ఫల్గుణి నక్షత్రమువ్యతిరేక పదాల జాబితావయ్యారిభామ (కలుపుమొక్క)తెలుగు భాష చరిత్రపంచతంత్రంకపిల్ సిబల్ఉగాదిమహాభారతంఆయాసంవందే భారత్ ఎక్స్‌ప్రెస్కాకతీయుల శాసనాలుఉబ్బసముమంగళసూత్రందాశరథి కృష్ణమాచార్యసురేఖా వాణి🡆 More