అమృతా ప్రీతం

అమృతా ప్రీతం వినండి (help·info) (1919 ఆగస్టు 31 - 2005 అక్టోబరు 31) భారతదేశపు రచయిత్రి.

ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది. ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి.

అమృతా ప్రీతం
అమృతా ప్రీతం
పుట్టిన తేదీ, స్థలం(1919-08-31)1919 ఆగస్టు 31
గుజ్రాన్‌వాలా, పంజాబ్ ప్రస్తుత పాకిస్తాన్ లోని రాష్ట్రము
మరణం2005 అక్టోబరు 31(2005-10-31) (వయసు 86)
ఢిల్లీ, భారత్
వృత్తినవలా రచయిత, కవయిత్రి, వ్యాస రచయిత
జాతీయతభారతీయురాలు
కాలం1936–2004
రచనా రంగంకవిత్వము , గద్య కావ్యము, జీవిత కథ
విషయంభారతదేశ విభజన, మహిళకు, కల
సాహిత్య ఉద్యమంమోహము-ప్రగతివాదం
గుర్తింపునిచ్చిన రచనలుపింజర్ (నవల)
ఆజ్ కె వారిస్ షా ను (కవిత)
సునేరే (కవిత)

ఆమె రాసిన పదునైన కవిత "ఆజ్ ఆఖాన్ వారిస్ షా ను" 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల "పింజర్" (బోను) (1950). దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర "ప్యూరో"ను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003 లో "పింజర్" చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది.

పూర్వపు బ్రిటిష్ ఇండియా 1947 లో భారతదేశం , పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలుగా విడిపోయినపుడు, ఆమె భారతదేశానికి వలస వచ్చింది. అయితే పాకిస్తాన్‌లో మోహన్ సింగ్, శివ్ కుమార్ బటాల్వి వంటి సమకాలీయులతో పోలిస్తే ఆమెకు ఉన్న ప్రజాదరణ ఆమె జీవితాంతమూ కొనసాగింది.

పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపబడింది. 1956లో ఆమె రాసిన "సనెహాడ్" (సందేశాలు) అనే గొప్ప కవితకు గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఈ పురస్కారాన్ని పొందిన మొదటి స్త్రీగా గుర్తింపబడింది. తరువాత ఆమె 1982లో "కాగజ్ తె కాన్వాస్" రచనకు గాను భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. 1969 లో పద్మశ్రీ పురస్కారాన్ని చివరకు 2004 లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరంఆమె భారత అత్యున్నత సాహితీ పురస్కారమైన సాహిత్య అకాడమీను అందుకున్నది. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను "ఇమ్మోర్టల్స్ ఆఫ్ లిటరేచర్" రచనకు అందుకుంది.

జీవిత చరిత్ర

నేపధ్యం

అమృతా ప్రీతం పూర్వపు పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్నది) లోని గుజ్రన్‌వాలాలో 1919 న "అమృత్ కౌర్"గా జన్మించింది. ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు, కవి , బ్రజ్ భాషా పండితుడైన కర్తార్ సింగ్ హిట్కరీకి ఏకైక కుమార్తె. ఆమె తండ్రి సాహితీ పత్రికకు సంపాదకునిగా కూడా సేవలనందించాడు. అదే విధంగా అతడు సిక్కు విశ్వాస బోధకుడు (ప్రచారక్) గా కూడా ఉండేవాడు. ఆమె పదకొండవ యేట తల్లిని కోల్పోయింది. తరువాత ఆమె తన తండ్రితో కలసి లాహోర్ వెళ్ళింది. 1947 లో భారతదేశానికి వలస వచ్చే వరకు ఆమె అక్కడే నివసించింది. తల్లి మరణంతో మీదపడ్ద బాధ్యతలతోను, ఆవరించిన ఒంటరితనంతోనూ ఆమె చిన్నతనంలోనే రచనలు చేయడం ప్రారంభించింది. ఆమె రాసిన కవితల మొదటి సంపుటి "అమృత లెహ్రా" 1936లో తన 16వ యేట ప్రచురితమయింది. అదే సంవత్సరం ఆమె పత్రికా సంపాదకుడైన ప్రీతం సింగ్ ను వివాహమాడింది. వివాహం అయిన పిదప ఆమె తన పేరును "అమృతా కౌర్" నుండి "అమృతా ప్రీతం"గా మార్చుకుంది. 1936 , 1943 మధ్యలో అరడజను కవితా సంపుటిలు వెలువడినాయి.

ఆమె శృంగార కవయిత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ త్వరలో ఆమె శైలిని మార్చుకొని "ప్రగతిశీల రచయితల ఉద్యమం"లో భాగమయింది. దీని ప్రభావం రచనా సంపుటి "లోక్ పీడ్" (ప్రజల వేదన) (1944) లో చూడవచ్చు. ఇది 1943 లో బెంగాల్ కరువు తరువాత, యుద్ధం-దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బహిరంగంగా విమర్శించింది. ఆమె సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొని హృదయపూర్వకంగా తన సేవలనందించింది. భారత స్వాతంత్ర్యం తరువాత సామాజిక ఉద్యమకారుడు "గురు రాధాకృష్ణ" మొదటి జనతా గ్రంథాలయాన్ని ఢిల్లీకి తేవడానికి చొరవ తీసుకున్నాడు. ఇది "బల్రాజ్ సహానీ" , అరుణా అసఫ్ అలీ లచే ప్రారంభించబడింది. ఈ అధ్యయనా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీలోని క్లాక్ టవర్ వద్ద నడుపబడుతున్నది. ఆమె భారత విభజనకు ముందు లాహోర్ రేడియో స్టేషన్ లో పనిచేసింది.

ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, దేశవిభజనపై నిర్మించిన అజరామర చిత్రం "గరం హవా" దర్శకుడైన ఎం.ఎస్.సత్యు, అరుదైన రంగస్థల ప్రదర్శన 'ఏక్ థీ అమృతా' ద్వారా ఆమెకు రంగస్థల నివాళి అర్పించాడు.

వ్యక్తిగత జీవితం

1935లో లాహోర్ లోని అనార్కలీ బజార్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు "ప్రీతం సింగ్"తో అమృతా వివాహం జరిగింది. 1960లో ఆమె తన భర్తను విడిచిపెట్టింది. ఆమెకు కవి "సాహిర్ లూధియాన్వి"తో అవ్యక్త ప్రేమ ఉండేదని తెలిపింది. ఈ ప్రేమ కథ ఆమె ఆత్మకథ "రసీదీ టికెట్" (రెవెన్యూ స్టాంపు) లో చిత్రీకరించబడింది. వేరొక గాయకురాలు "సుధా మల్హోత్రా" సాహిర్ జీవితంలోనికి ప్రవేశించింది. ప్రఖ్యాత కళాకారుడు, రచయిత ఇమ్రోజ్ సాహచర్యం అమృతాకు ఓదార్పునిచ్చింది. వారిద్దరి జీవితం "అమృతా ఇమ్రోజ్: ఎ లవ్ స్టోరీ" ద్వారా పుస్తక రూపంలో ప్రచురింపబడింది. ఆమె 2005 అక్టోబరు 31 న అనారోగ్యంతో బాధపడుతూ నిద్రలో ఉన్నప్పుడు తన 86వ యేట న్యూఢిల్లీలో మరణించింది. ఆమెకు ఇమ్రోజ్ తో కుమార్తె (కందల), కుమారుడు (నవరాజ్ క్వాత్రా) కలిగారు. నవరాజ్ క్వాత్రా 2012లో చంపబడ్డాడు.

బ్రిటిష్ ఇండియా విభజన

1947 న భారత విభజన తరువాత జరిగిన హింసా కాండలో ఒక మిలియన్ హిదువులు, ముస్లింలు, సిక్కులు మరణించారు. అమృతా ప్రీతం తన 28వ యేట లాహోర్ నుండి ఢిల్లీకి వలస వెళ్లాలనుకున్నది. 1948లో డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె గర్భవతి. ఆమె "ఆజ్ అఖాన్ వారిస్ షా ను" (నేను వారిష్ షాను ఈరోజు అడుగుతున్నాను) అనే పేరుతో కవితను ఒక కాగితపు ముక్క మీద రాసి తన వేదనను వ్యక్తం చేసింది. విభజన తరువాత ఏర్పడిన భయానక వాతావరణంలో అత్యంత పదునైన జ్ఞాపకంగా ఈ కవిత ఆమెను సజీవంగా మార్చింది. ఈ కవిత సూఫీ కవి "వారిస్ షా"కు సంబోధిస్తూ ఉంటుంది. వారిస్ షా "హీర్ అండ్ రాంజా" అనే విషాద కవితను రాసాడు.

అమృతా ప్రీతం 1961 వరకు పంజాబీ సర్వీసులలో భాగంగా ఆల్‌ఇండియా రేడియోలో పనిచేసింది. 1960 లో విడాకుల తరువాత ఆమె పని మరింత స్పష్టంగా స్త్రీవాదమైంది. ఆమె కథలు, కవితలలో అనేకం ఆమెకు వివాహం విషాదకరమైన అనుభవాలను చిత్రీకరించబడ్డాయి. ఆమె రచనలలో అనేకమైనవి పంజాబీ, ఉర్దూ భాషల నుండి ఆంగ్లం, ఫ్రెంచ్, డానిష్, జపానీస్, మందరిన్, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి. వాటిలో "బ్లాక్ రోజ్", "రసిది టికెట్" అనే స్వీయ చరిత్రలు కూడా ఉన్నాయి.

ఆమె రాసిన పుస్తకాలలో "ధరతీ సాగర్ సిప్పియాన్" 1965లో "కాదంబరి" సినిమాగా తీయబడింది. తరువాత "ఉనా ది కహానీ' కథను "డక్కు" అనే చిత్రంగా 1976లో బసు భట్టాచార్య దర్శకత్వంలో నిర్మించారు.

ఆమె రాసిన నవల "పింజర్" (1970) ఆ కాలంలో బాధపడుతున్న మహిళల సంక్షోభంతో పాటు విభజన అల్లర్ల కథను వివరిస్తుంది. మానవత్వ అంశాల కారణంగా ఈ కథ చంద్ర ప్రకాష్ ద్వివేదీ చే సినిమాగా నిర్మించబడి హిందీసినిమా పురస్కారాలను అందుకుంది. ఈ పుస్తకంలో అమృతా రెండు దేశాల ప్రజల బాధను చిత్రీకరించింది.

ఆమె అనేక సంవత్సరాల పాటు పంజాబ్ భాషలోని సాహితీ మాసపత్రిక "నాగమణి"కి సంపాదకత్వం వహించింది. దానిని ఇమ్రోజ్ తో కలసి 33 సంవత్సరాలు నడిపింది. విభజన తర్వాత ఆమె హిందీలో కూడా చాలా కాలం పాటు రాసింది. తరువాత జీవితంలో ఆమె ఓషో భాషకు మారి, ఓషో అనేక పుస్తకాలకు పరిచయాలను వ్రాసింది. వాటిలో "ఏక్ ఓంకార్ సత్నం" కూడా ఉంది. ఆమె ఆధ్యాత్మిక ఇతివృత్తాలపై కూడా రచనలను చేసింది. వాటిలో "కాల్ చేతన" , "అగ్యాత్ కా నిమంత్రణ్" ఉన్నాయి. ఆమె "కలా గులాబ్" (నలుపు గులాబీ" (1968), రసిది టికెట్ (రెవెన్యూ స్టాంపు) (1976), అక్షారోణ్ కె సాయీ (పదాన నీడలు) వంటి స్వీయ చరిత్రలను రాసింది.

అభినందన

ఆమె పంజాబ్ రత్న పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. ఆమె అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చే ఈ పురస్కారాన్ని అందుకున్నది. ఆమె 1956లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొంది అది పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమెకు భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం 1982లో లభించింది. ఆమెకు 1969లో పద్మశ్రీ పురస్కారం, 2004లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, పద్మవిభూషణ్ పురస్కారం లభించాయి. డిల్లీ విశ్వవిద్యాలయం(1973), జబల్‌పూర్ విశ్వవిద్యాలయం (1973), విశ్వభారతి (1987) లతో పాటు అనేక విశ్వవిద్యాలయాలనుండి ఆమెకు డి.లిట్, గౌరవ డిగ్రీలు లభించాయి.

ఆమెకు అంతర్జాతీయ వాప్ట్‌సరోవ్ పురస్కారాన్ని రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా 1979లో ప్రదానం చేసింది. 1987 లో ఫ్రెంచ్ ప్రభుత్వం గ్వారా డిగ్రీ ఆఫ్ ఆపీసర్ డెన్స్, ఆడ్రే డెస్ ఆర్ట్స్ ఎత్ డెస్ లెటర్స్ (ఆపీసర్) అనే పురస్కారాలు అందజేయబడ్డాయి. ఆమె 1986-92 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. ఆమె జీవిత చరమాంకంలో పాకిస్థాన్ పంజాబి అకాడమీచే పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె "బడే దినోం కే బాద్ మేరే మాలికె కో మేరీ యాద్ ఆయీ" (చాలా రోజుల తరువాత నా మాతృభూమి నన్ను గుర్తించింది) అని తెలిపింది.

వారసత్వం

2007లో "అమృతా గుల్జార్ చే చెప్పబడింది" (అమృతా రిసైటెట్ బై గుల్జార్) అనే పేరుతో ఆడియో ఆల్బం ప్రముఖ గాయకుడు "గుల్జార్" చే విడుదల అయినది. అమృతా ప్రీతం కవితలను గుల్జార్ అందులో పాడాడు.

గ్రంథములు

ఆమె 6 దశాబ్దాల జీవితంలో 28 నవలలు, 18 గద్య రచనలు, 5 లఘు కథలు, 16 ఇతర గద్య అంశాలను రాసింది.

    నవలలు
  • పింజర్
  • డాక్టర్ దేవ్
  • కోరే కాగజ్, ఉంచాస్ దిన్
  • ధరతీ, సాగర్ ఔర్ సీపియన్
  • రంగ్ కా పట్టా
  • డిల్లీ కీ గలియా
  • తేరవాన్ సూరజ్
  • యాత్రి
  • జీలవాటన్ (1968)
  • హదత్త్ కా జిందగీనామా
    స్వీయ చరిత్రలు
  • బ్లాక్ రోజ్ (1968)
  • రసిది టికెట్ (1976)
  • షాడోస్ ఆఫ్ వర్డ్స్ (2004)

లఘు కథలు

  • కహానియా జో కహానియా నహీ
  • కహానియోం కె ఆంగన్ మె
  • స్టెంచ్ ఆఫ్ కిరొసిన్
    కవితలు సంకలనాలు
  • అమృత్ లహరే (1936)
  • జీయుందా జీవన్ (1939)
  • ట్రెల్ ధోతే ఫూల్ (1942)
  • ఓ గీతన్ వాలియా (1942)
  • బద్లాం దే లాలి (1943)
  • సంజ్ దే లాలి (1943)
  • లోక్ పీర (1944)
  • పత్తర్ గీతే (1946)
  • పంజాబ్ దీ ఆవాజ్ (1952)
  • సునేహదే (1955) –సాహిత్య అకాడమీ పురస్కారం
  • అశోకా చేటి (1957)
  • కస్తూరి (1957)
  • నగ్మని (1964)
  • ఈక్ సీ అనితా (1964)
  • చక్ నంబర్ చట్టీ (1964)
  • ఉనిజా దిన్ (49 రోజులు) (1979)
  • కాగజ్ తే కాన్వాస్ (1981)- భారతీయ జ్ఞానపీఠ్
  • చుని హుయీ కవితాయే
  • ఏక్ బాత్
    సాహిత్య పత్రిక
  • నాగమణి, మాస పత్రిక

మూలాలు

బయటి లింకులు

    వీడియో లింకులు


Tags:

అమృతా ప్రీతం జీవిత చరిత్రఅమృతా ప్రీతం బ్రిటిష్ ఇండియా విభజనఅమృతా ప్రీతం అభినందనఅమృతా ప్రీతం గ్రంథములుఅమృతా ప్రీతం మూలాలుఅమృతా ప్రీతం ఇతర పఠనాలుఅమృతా ప్రీతం బయటి లింకులుఅమృతా ప్రీతంAbout this soundAmrita Pritam pronunciation.oggదస్త్రం:Amrita Pritam pronunciation.oggపంజాబీ భాషహిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

గొంతునొప్పిసీతాపతి చలో తిరుపతికేంద్రపాలిత ప్రాంతంహనుమంతుడుబాల కార్మికులువిశాఖ నక్షత్రముతెలంగాణ ప్రభుత్వ పథకాలుబలి చక్రవర్తిసమ్మక్క సారక్క జాతరఆశ్లేష నక్షత్రముయునైటెడ్ కింగ్‌డమ్ఎయిడ్స్భారత రాజ్యాంగ సవరణల జాబితాలోక్‌సభ స్పీకర్వాస్తు శాస్త్రంఅండాశయముసమంతతెలంగాణ ఉద్యమంపంచతంత్రంకూచిపూడి నృత్యంఅనుష్క శెట్టిమంజీరా నదిడొక్కా సీతమ్మమంచు మోహన్ బాబురావణాసురగర్భాశయముపాండ్య రాజవంశంవిశ్వనాథ సత్యనారాయణజాషువారాం చరణ్ తేజసర్పంచిభారతీయ నాట్యంరజియా సుల్తానాబాబర్విద్యుత్తుశ్రవణ నక్షత్రముభగవద్గీతఆదిపురుష్రామావతారముధనిష్ఠ నక్షత్రముభారత స్వాతంత్ర్యోద్యమంఇండుపుతెలుగు పదాలునారా చంద్రబాబునాయుడుచంద్రుడు జ్యోతిషంసురభి బాలసరస్వతితెలంగాణా బీసీ కులాల జాబితాఅల్లు అర్జున్గ్రామ పంచాయతీదాశరథి రంగాచార్యపచ్చకామెర్లుపొట్టి శ్రీరాములుకందుకూరి వీరేశలింగం పంతులుతెలుగునాట జానపద కళలుడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంవాల్మీకిమిథునరాశిభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుబలరాముడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డియోగి ఆదిత్యనాథ్బంగారు బుల్లోడువిజయశాంతికుమ్మరి (కులం)తెలంగాణ రాష్ట్ర సమితిఏప్రిల్భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుతెలంగాణ మండలాలుభారత ఆర్ధిక వ్యవస్థతెలుగు సినిమాలు డ, ఢతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిచాకలి ఐలమ్మఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీజోరుగా హుషారుగాబమ్మెర పోతనమంతెన సత్యనారాయణ రాజు🡆 More