హాజీపూర్: బీహార్ రాష్ట్రం లోని పట్టణం

హాజీపూర్ బీహార్ రాష్ట్రం, వైశాలి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.

ఇది తిర్హుత్ డివిజనులో భాగం. జనాభా పరంగా హాజీపూర్, బీహార్‌ రాష్ట్రం లోని పట్టణాల్లో 17 వ స్థానంలో ఉంది. పాట్నా తరువాత రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో రెండవ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.47 లక్షలు. అభివృద్ధి పరంగా బీహార్‌లోని 38 జిల్లాల్లో, వైశాలి జిల్లా 8 వ స్థానంలో ఉంది.

హాజీపూర్
పట్టణం
హాజీపూర్ పట్టణ చిత్రాలు
పైనుండి అపసవ్యదిశలో: హాజీపూర్ జంక్షను రైల్వేస్టేషను, పాత గండక్ వంతెన, సినీకృష్ణ మాల్, హోతల్ మేనేజిమెంట్ ఇన్‌స్టిట్యూట్ హోటల్ అనామిక, మహాత్మా గాంధీ సేతు, నాగేశ్వరనాథ దేవాలయం, సర్క్యూట్ హౌస్
బీహార్ పటంలో పట్టణ స్థానం
బీహార్ పటంలో పట్టణ స్థానం
హాజీపూర్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°41′N 85°13′E / 25.68°N 85.22°E / 25.68; 85.22
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల
డివిజనుతిర్హుత్
జిల్లావైశాలి
స్థాపనసా.శ. 1350
Named forహాజీ ఇల్యాస్ షా
Area
(2011)
 • Total19.64 km2 (7.58 sq mi)
Elevation
46 మీ (151 అ.)
Population
 (2011)
 • Total1,47,126
 • Density7,500/km2 (19,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Pincode(s)
84410X
టెలిఫోన్ కోడ్+91–6224
Vehicle registrationBR-31
అక్షరాస్యత (2011)79.26%
లింగ నిష్పత్తి1.0892 /
Website

హాజీపూర్ పట్టణం అరటి పంటకు ప్రసిద్ది చెందింది. ఇది బీహార్ రాజధాని పాట్నా నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇది, పాట్నా ప్రాంతాభివృద్ధి సంస్థ ప్రాంతంలో భాగం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనలలో ఒకటైన మహాత్మా గాంధీ సేతు (5.75 కి.మీ.) హాజీపూర్‌ను పాట్నాకు కలుపుతుంది. గంగా నది ఈ రెండు పట్టణాలను వేరు చేస్తోంది. గంగానది దక్షిణపు ఒడ్డున పాట్నా నగరం, ఉత్తరపు ఒడ్డున హాజీపూర్ పట్టణం ఉన్నాయి. దిఘా పూల్ అనే మరొక వంతెన కూడా ఉంది పాట్నాను గ్రేటర్ పాట్నాగా విస్తరించే ప్రణాళిక ప్రకారం హాజీపూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలను పాట్నాలో కలిపే అవకాశం ఉంది.

హాజీపూర్ పట్టణం 19.64 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. పట్టణాన్ని 39 వార్డులుగా విభజించారు. 1979 లో, బీహార్‌లోని ఆర్కియాలజీ, మ్యూజియం డైరెక్టరేట్ సంస్థ హాజిపూర్‌లో ఒక మ్యూజియంను స్థాపించింది.

భౌగోళికం, వాతావరణం

భౌగోళికం

1972 అక్టోబరు 12 న ముజఫర్‌పూర్ జిల్లా నుండి విడిపోయిన తరువాత హాజీపూర్, వైశాలి జిల్లాకు ముఖ్యపట్టణమైంది. ఇది 25°41′N 85°13′E / 25.68°N 85.22°E / 25.68; 85.22 నిర్దేశాంకాల వద్ద , సముద్ర మట్టం నుండి 46 మీటర్ల ఎత్తున ఉంది.

హాజీపూర్ పట్టణానికి పశ్చిమాన నారాయణి గండక్ నది, దక్షిణాన పవిత్ర గంగా నది ప్రవహిస్తున్నాయి. పట్టణంలో రైలు, రోడ్డు, జల రవాణా సౌకర్యాలున్నాయి. వీటిద్వారా పట్టణానికి జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రం,, దేశం లోని ఇఅతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. గంగా నది మీదుగా నిర్మించిన మహాత్మా గాంధీ సేతు (5,575 మీటర్ల పొడవు) పట్టణాన్ని రాష్ట్ర రాజధాని పాట్నాతో కలుపుతుంది, గండక్ మీదుగా మరో రైలు, రోడ్డు వంతెన సోనేపూర్‌తో కలుపుతుంది.

శీతోష్ణస్థితి

పట్టణం లోను, దాని చుట్టుపక్కలా ఉన్న లోని మైదాన ప్రాంతం అరటి, లిట్చి, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది. సెమీ ట్రాపికల్ రుతుపవన వాతావరణంలో పెరుగుతున్న మొక్కలతో, చెట్లతో ఈ ప్రాంతం పచ్చగా కనిపిస్తుంది. మే-జూన్ నెలలు వేడిగా ఉంటాయి. డిసెంబర్-జనవరి చల్లగా ఉంటాయి.

హాజీపూర్‌లో వాతావరణం వెచ్చగా, సమశీతోష్ణంగా ఉంటుంది. దీన్ని Csa గా కొప్పెన్, గీగర్ వర్గీకరించారు. ఇక్కడ ఉష్ణోగ్రత సగటు 25.8 °C. సగటు వార్షిక వర్షపాతం 993 మి.మీ. ఉంటుంది. 3 మి.మీ. వర్షపాతంతో డిసెంబరు అత్యంత పొడిగా ఉండే నెల. అత్యధిక వర్షపాతం ఉండే జూలై నెలలో 266 మి.మీ. వర్షపాతం ఉంటుంది. సంవత్సరంలో వెచ్చని నెల మే, సగటు ఉష్ణోగ్రత 32.2 °C. జనవరిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.1 °C.

శీతోష్ణస్థితి డేటా - Hajipur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
Source: Climate table (average high and low) and average precipitation

జనాభా

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
190121,398—    
191119,233−10.1%
192116,760−12.9%
193119,299+15.1%
194121,963+13.8%
195125,149+14.5%
196134,044+35.4%
197141,890+23.0%
198162,520+49.2%
199187,687+40.3%
20011,19,412+36.2%
20111,47,688+23.7%

సాంస్కృతికంగా, భాషాపరంగా, హాజీపూర్ పాట్నా మాదిరిగానే ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హాజీపూర్ పట్టణంలో 1,47,688 జనాభా ఉంది, వీరిలో పురుషులు 78,047, మహిళలు 69,641. అక్షరాస్యత 76.80%. ఇది జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 82.45%, స్త్రీ అక్షరాస్యత 70.47%. హాజీపూర్‌లో, జనాభాలో 14.15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. లింగ నిష్పత్తి 892 . ఇది జాతీయ సగటు 944 కంటే తక్కువ. పట్టణం లోని ప్రధాన భాష హిందీ.

హాజీపూర్‌లో మతం
హిందూ మతం
  
85.84%
ఇస్లాం
  
13.86%
క్రైస్తవం
  
0.13%
బౌద్ధం
  
0.04%
జైనమతం
  
0.01%
ఇతరాలు♦
  
0.00%
ఇతరాల్లో
సిక్కుమతం (0.02%) ఉంది.

పట్టణ ప్రముఖులు

రవాణా

హాజీపూర్ పట్టణంలో భారత రైల్వేలకు చెందిన తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.

హాజిపూర్ రైల్వే స్టేషన్ గుండా మూడు రైలు మార్గాలు పోతున్నాయి. ఇవి పట్టణాన్ని ముజఫర్‌పూర్, ఛప్రా, బరౌనిలతో కలుపుతాయి. గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్ (20503/20504), వైశాలి ఎక్స్‌ప్రెస్ (12553/12554), బీహార్ సంపార్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12565/12566), గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12203/12204), స్వతంత్ర సైనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (1256) లోహిత్ ఎక్స్‌ప్రెస్ (15651/15652), లిచ్చావి ఎక్స్‌ప్రెస్ (14005/14006), అరుణాచల్ ఎక్స్‌ప్రెస్ (22411/22412) రైళ్ళు ఈ మార్గం గుండా వెళ్తాయి.

  • ఈ పట్టణానికి ప్రధానంగా లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం, పాట్నా (PAT) సేవలు అందిస్తోంది.

రోడ్లు

జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా హాజీపూర్ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. పట్టణం గుండా వెళ్ళే ప్రధాన రహదారులు:

  • నుజాతీయ రహదారి 19 పట్టణాన్ని ఛప్రాతో కలుపుతుంది, ఇది యుపిలోని ఘాజిపూర్ పట్టణం వరకూ పోతుంది. జాతీయ రహదారి 19 పాట్నా నుండి మొదలై గయా, బోధగయల రాష్ట్ర రహదారి ద్వారా కలుపుతుంది.
  • జాతీయ రహదారి 77 ముజఫర్పూర్, సీతామఢీ ల ద్వారా సోన్‌బర్సా (నేపాల్ సరిహద్దు) హాజీపూర్ లను కలుపుతుంది
  • కచ్చి దర్గా-బిదుపూర్ వంతెన బీహార్ లోని పెద్ద ప్రాజెక్టు. ఈ వంతెన రెండు ప్రధాన జాతీయ రహదార్లు 103, 30 లను కలుపుతుంది. ఈ వంతెన పూర్తయిన తర్వాత భారతదేశంలో అతి పొడవైన వంతెన అవుతుంది.
  • జాతీయ రహదారి 103 హాజీపూర్ నుండి ప్రారంభమై, జందాహా ద్వారా ముస్రీ ఘరారీ (సమస్తిపూర్) వద్ద జాతీయ రహదారి 28A లో కలుస్తుంది.
  • రాష్ట్ర రహదారి 74 హాజీపూర్‌ను వైశాలిలోని లాల్‌గంజ్‌తో కలుపుతుంది.
  • రాష్ట్ర రహదారి 49 హాజీపూర్‌ను మహువా, తాజ్‌పూర్, సమస్తిపూర్‌తో కలుపుతుంది.
  • రాష్ట్ర రహదారి 93 హాజీపూర్‌ను మోహీదున్ పట్టణ్‌లోని మహ్నార్‌తో కలుపుతుంది.

మూలాలు


Tags:

హాజీపూర్ భౌగోళికం, వాతావరణంహాజీపూర్ జనాభాహాజీపూర్ పట్టణ ప్రముఖులుహాజీపూర్ రవాణాహాజీపూర్ మూలాలుహాజీపూర్బీహార్వైశాలి జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

లగ్నంవరుణ్ తేజ్శ్రీశైలం (శ్రీశైలం మండలం)తులారాశిసంపన్న శ్రేణిమాయాబజార్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంనాని (నటుడు)కాకతీయుల శాసనాలుటి.జీవన్ రెడ్డిసద్గురుపార్వతిఆలివ్ నూనెతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఘట్టమనేని మహేశ్ ‌బాబుపాముఊర్వశి (నటి)డిస్నీ+ హాట్‌స్టార్విశాఖ నక్షత్రముకెఫిన్ఆరూరి రమేష్పొట్టి శ్రీరాములుప్రభుదేవాటైఫాయిడ్ఎస్. శంకర్వృషణంఅవకాడోశ్రీముఖిఅంగచూషణకొల్లేరు సరస్సుతెలంగాణా సాయుధ పోరాటంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురక్తపోటుధర్మవరం శాసనసభ నియోజకవర్గంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాలలితా సహస్రనామ స్తోత్రంసప్త చిరంజీవులుశివ కార్తీకేయన్బౌద్ధ మతంనవరసాలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణభారతదేశంలో బ్రిటిషు పాలనసుమేరు నాగరికతనీతా అంబానీపన్ను (ఆర్థిక వ్యవస్థ)జ్యోతిషంసమ్మక్క సారక్క జాతరపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాచాకలి ఐలమ్మసుఖేశ్ చంద్రశేఖర్అదితిరావు హైదరీఉస్మానియా విశ్వవిద్యాలయంరౌద్రం రణం రుధిరంసాయిపల్లవిఓటుసమంతగజేంద్ర మోక్షంలవ్ స్టోరీ (2021 సినిమా)రైతుజి.ఆర్. గోపినాథ్షాజహాన్ప్రియమణిభగవద్గీతఅశ్వని నాచప్పఅశోకుడుఅమెజాన్ (కంపెనీ)వింధ్య విశాఖ మేడపాటిఅల్లసాని పెద్దనసందీప్ కిషన్గాంధీవందేమాతరంభావ కవిత్వంభారత క్రికెట్ జట్టుఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంపూర్వాషాఢ నక్షత్రముభారత రాజ్యాంగ సవరణల జాబితా🡆 More