దినపత్రిక సాక్షి: తెలుగు వార్తా పత్రిక

సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది.

చరిత్ర

అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడింది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

తొలిదశలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రధాన సంపాదకుడు. సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై.పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం(2019) సంపాదకీయ సంచాలకుడుగా కె రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అమ్మకాలు, చదువరులు

    అమ్మకాలు

ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, పత్రిక సగటున 10,91,079 పత్రిక అమ్మకాలు కలిగివుంది. అంతకు ముందు అర్ధసంవత్సరపు గణాంకాలతో పోల్చితే 1.7% తగ్గుదల కనబడింది.

    చదువరులు

ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 30,86,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 85,98,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 4.7% పెరిగింది.

‌విమర్శలు

దినపత్రిక సాక్షి: చరిత్ర, అమ్మకాలు, చదువరులు, ‌విమర్శలు 
సాక్షి చిహ్నం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్మోహన రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల యాజమాన్యంలోని సంస్థ నియంత్రణలో పత్రిక వుండుటవలన పత్రిక నిప్షాక్షిత సందేహాస్పదం. ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.

ఇవికూడా చూడండి

  1. సాక్షి (ప్రసారమధ్యమ సమూహం)
  2. సాక్షి టివి
  3. సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

దినపత్రిక సాక్షి చరిత్రదినపత్రిక సాక్షి అమ్మకాలు, చదువరులుదినపత్రిక సాక్షి ‌విమర్శలుదినపత్రిక సాక్షి ఇవికూడా చూడండిదినపత్రిక సాక్షి మూలాలుదినపత్రిక సాక్షి బయటి లింకులుదినపత్రిక సాక్షి2008అమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలుగుమార్చి 24రంగు

🔥 Trending searches on Wiki తెలుగు:

వృశ్చిక రాశిసద్గురురాజమండ్రివృషభరాశిప్రియురాలు పిలిచిందిసింగిరెడ్డి నారాయణరెడ్డితెలుగుసామ్యూల్ F. B. మోర్స్ఎఱ్రాప్రగడసాక్షి (దినపత్రిక)తహశీల్దార్చతుర్వేదాలుతెలంగాణా సాయుధ పోరాటంపది ఆజ్ఞలుపాఠశాలప్రశ్న (జ్యోతిష శాస్త్రము)ఇంటి పేర్లుఅయ్యప్పకుండలేశ్వరస్వామి దేవాలయంరామాయణంముహమ్మద్ ప్రవక్తపూరీ జగన్నాథ దేవాలయంమహాసముద్రంఆటలమ్మవనపర్తిరచిన్ రవీంద్రచిరంజీవిలావణ్య త్రిపాఠిఆంధ్రప్రదేశ్ చరిత్రరామదాసుముంతాజ్ మహల్రాహువు జ్యోతిషంఅమరావతివిజయ్ (నటుడు)ప్రభాస్అక్కినేని నాగేశ్వరరావుఉమ్మెత్తమానవ శరీరముమేళకర్త రాగాలుఅక్కినేని అఖిల్నందమూరి తారక రామారావునల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిసుడిగాలి సుధీర్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థడిస్నీ+ హాట్‌స్టార్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఊరు పేరు భైరవకోనచార్మినార్బరాక్ ఒబామాఅటల్ బిహారీ వాజపేయిఇజ్రాయిల్ఆంధ్ర విశ్వవిద్యాలయంసచిన్ టెండుల్కర్జంగం కథలుయేసు శిష్యులుదానం నాగేందర్మేషరాశినానార్థాలుసంక్రాంతిసవర్ణదీర్ఘ సంధిగాయత్రీ మంత్రంమంగ్లీ (సత్యవతి)సామజవరగమనశోభన్ బాబుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంమాధవీ లతస్వాతి నక్షత్రముటి.జీవన్ రెడ్డిభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాతిరుపతిమాల (కులం)నిజాంచిలకమర్తి లక్ష్మీనరసింహంబైబిల్దగ్గుబాటి పురంధేశ్వరినరసింహ శతకముఅరవింద్ కేజ్రివాల్🡆 More