శశికళ కకొడ్కర్

శశికళ కకొడ్కర్ (1935 జనవరి 7– 28 అక్టొబరు 2016), గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి (మరాఠీలో అక్క అని అర్ధం) అని పిలుస్తారు. గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె.  గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ.

మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా చేశారామె.

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం

1935 జనవరి 7న గోవాలోని పెర్నెంలో జన్మించారు శశికళ. ఆమె తల్లిదండ్రులు దయానంద్, సునందాబాయ్ బండోడ్కర్ లకు ఈమె తొలి సంతానం. ఆమె తోబుట్టువులు ఉషా వెంగుర్లెకర్, క్రాంతి రావు, జ్యోతి బండోడ్కర్, సిద్ధార్ధ్ బండోడ్కర్. ఆమె జన్మించే నాటికి గోవా పోర్చ్యుగీస్ పాలనలో ఉంది.

ముష్తిఫంద్ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన శశికళ, పనజీలోని పీపుల్స్ హైస్కూలులో మెట్రిక్యులేషన్ చదివారు. ఆమె 11వ ఏట గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని, పోర్చ్యుగీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శశికళ. ఈ కారణంగా పోలీసుల లాఠీచార్జికి కూడా గురయ్యారామె. ధర్వాడ్ లోని కర్ణాటక్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఆమె. అందులో మానవ, సామాజిక శాస్త్రాలు, చరిత్ర ఆమె సబ్జెక్టులు. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ఎం.ఎ చదివారు శశికళ.

1963లో, గోవా, డామన్ అండ డయూ ప్రాంతాలకు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో శశికళ తండ్రి దయానంద్ బండోడ్కర్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1963లోనే ఆమె గురుదత్ కకొడ్కర్ ను వివాహం చేసుకున్నారు. 1968లో గురుదత్ బండోడ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. ఆమె యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లలో ఆమె సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

మూలాలు

Tags:

గోవా

🔥 Trending searches on Wiki తెలుగు:

వంగ‌ల‌పూడి అనితఖాదర్‌వలిమంచు లక్ష్మిఉభయచరముగ్యాస్ ట్రబుల్తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపార్వతిఆల్కహాలుఅభిజ్ఞాన శాకుంతలముభారతదేశ పంచవర్ష ప్రణాళికలుజాకిర్ హుసేన్అధిక ఉమ్మనీరుకన్నడ ప్రభాకర్బారసాలదొడ్డి కొమరయ్యతెలంగాణ ఉద్యమంగుమ్మడి నర్సయ్యభారత రాజ్యాంగ సవరణల జాబితామహారాష్ట్రతెలుగు సినిమాల జాబితాఅక్బర్హస్త నక్షత్రముకన్యారాశిపంచారామాలుభారతీ తీర్థనెల్లూరుసంధ్యారాణి (నటి)బ్రాహ్మణులుక్విట్ ఇండియా ఉద్యమంకొఱ్ఱలువ్యతిరేక పదాల జాబితాభారతదేశంలో మహిళలుతెలుగు శాసనాలుకృత్తిక నక్షత్రముబాలచంద్రుడు (పలనాటి)విభక్తిజీ20సంక్రాంతితెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంనువ్వు నాకు నచ్చావ్తీన్మార్ మల్లన్నరోహిణి నక్షత్రంచైనానువ్వు లేక నేను లేనుబలి చక్రవర్తిచేపనెల్లూరు చరిత్రపూర్వాభాద్ర నక్షత్రముపూర్వాషాఢ నక్షత్రముతులారాశినరేంద్ర మోదీకృష్ణ గాడి వీర ప్రేమ గాథభారత స్వాతంత్ర్యోద్యమంపురుష లైంగికతఛందస్సుశైలజారెడ్డి అల్లుడుపెళ్ళిరాజమండ్రిపిట్ట కథలుమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముమంచు విష్ణువాయు కాలుష్యంరాధ (నటి)గైనకాలజీఇన్‌స్టాగ్రామ్జీవన నైపుణ్యంవంతెనకె.విశ్వనాథ్వేంకటేశ్వరుడుమీనాఅచ్చులుకులంసుభాష్ చంద్రబోస్నీటి కాలుష్యంక్షయవ్యాధి చికిత్సజాతీయములుకల్వకుంట్ల చంద్రశేఖరరావుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు🡆 More