విద్యున్నిరోధం, వాహకత్వం

విద్యున్నిరోధం అనేది విద్యుద్వాహకాల గుండా విద్యుత్తు ఎంత మేరకు అడ్డగించ బడుతోందో తెలిపే ఒక ప్రమాణం.

వాహకంలో, ఎలక్ట్రాన్ల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఆ వాహకపు నిరోధం అనవచ్చు. దీనికి వ్యతిరేకమైన లక్షణం విద్యుత్ వాహకత్వం. అంటే విద్యుత్ ఎంతమేరకు ప్రవహిస్తుందో తెలిపే ప్రమాణం. విద్యున్నిరోధానికి భౌతిక ఘర్షణ (రాపిడి వలన కలిగే నిరోధం) లాంటి లక్షణాలు ఉన్నాయి. విద్యున్నిరోధాన్ని ఓమ్ (Ω) లలో కొలిస్తే, విద్యుత్ వాహకత్వాన్ని సీమెన్స్లో కొలుస్తారు.

నిరోధకం
నిరోధకం

అన్ని వస్తువులు ఎంతో కొంత నిరోధాన్ని కలిగిఉంటాయి. కానీ సూపర్ కండక్టర్లు మాత్రం ప్రత్యేకమైనవి. వాటి నిరోధం సున్న.

పరిచయం

నిరోధాన్ని అర్థం చేసుకోవడానికి విద్యుత్ ప్రవాహాన్ని ఒక పైపు గుండా ప్రవహించే నీరులాగా ఊహించుకుందాం. వోల్టేజి తేడా అనేది పైపుగుండా నీటిని ప్రవహింపజేయడానికి అవసరమయ్యే పీడనం (ఒత్తిడి) లాంటిది. విద్యుత్ వాహకత్వం ఇచ్చిన పీడనానికి ఎంత ప్రవాహం జరిగింది అనే విషయాన్ని సూచిస్తే, నిరోధం మనకు కావాలసిన పరిమాణంలో ప్రవాహం ఉండాలంటే ఎంత ఒత్తిడికి గురిచేయాలనే విషయాన్ని సూచిస్తుంది.

రెండు వేర్వేరు మందాలున్న రాగితీగలు ఒకేలా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించవు. దీనికి కారణం విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణం ఆ వాహకం పొడవు, మందంపై ఆధారపడి ఉంటుంది.

ప్రమాణాలు

  • వాహక నిరోధానికి ప్రమాణం "ఓం" దీనిని గ్రీకు అక్షరం అయిన "Ω" (ఒమేగా) తో సూచిస్తారు. ఒక ఓం అనగా వోల్ట్ పెర్ మీటర్. అతి పెద్ద ప్రమాణాలు, చిన్న ప్రమాణాలుగా "మెగా ఓం", "మిల్లి ఓం" వంటివి వడుతారు.
  • ఒక మిల్లీ ఓం = 10−3Ω, ఒక మెగా ఓం = 103 Ω అవుతుంది.

వాహకత్వం

నిరోధం యొక్క విలోమాన్ని "వాహకత్వం" అంటారు. దీనిని "మో (mho) అనే ప్రమాణంతో సూచిస్తారు.

    వాహకత్వం = విద్యున్నిరోధం, వాహకత్వం 

కారణాలు

విద్యున్నిరోధం ఒక్కో పదార్థంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకి రాగితో పోల్చుకుంటే టెఫ్లాన్ అనే పదార్థంలో నిరోధం 1030 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత తేడా ఎందుకంటే లోహాలలో ఒకే చోట ఉండకుండా స్వేచ్ఛగా తిరిగే ఎలక్ట్రానులు ఎక్కువగా ఉంటాయి. అదే విద్యున్నిరోధక పదార్థాలలో అయితే ఈ ఎలక్ట్రాన్లు అణుసముదాయానికి దగ్గర్లో కేంద్రీకృతమై ఉంటాయి. వీటిని అక్కడ నుంచి ప్రవహింపజేయాలంటే (ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతికరేకంగా ప్రవహించేది విద్యుత్తు) ఎక్కువ శక్తి అవసరమౌతుంది. అదే నిరోధం. అర్ధ వాహకాలనేవి ఈ రెండింటి మధ్యలో ఉంటాయి.

నిరోధం ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది. అర్ధవాహకాలలో అయితే పదార్థం మీద కాంతి ప్రసరించడం వల్ల కూడా మారిపోతుంటుంది.

Tags:

విద్యున్నిరోధం, వాహకత్వం పరిచయంవిద్యున్నిరోధం, వాహకత్వం ప్రమాణాలువిద్యున్నిరోధం, వాహకత్వం వాహకత్వంవిద్యున్నిరోధం, వాహకత్వం కారణాలువిద్యున్నిరోధం, వాహకత్వంవిద్యుత్ వాహకాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగురువు (జ్యోతిషం)తట్టు2019 భారత సార్వత్రిక ఎన్నికలుమోదుగఆరణి శ్రీనివాసులుటి.జీవన్ రెడ్డిఅంబటి రాయుడుభారత ఆర్ధిక వ్యవస్థతెలుగు నాటకరంగంవాముపూర్వాభాద్ర నక్షత్రముజానంపల్లి రామేశ్వరరావుచంద్రయాన్-3యోనితొట్టెంపూడి గోపీచంద్అటల్ బిహారీ వాజపేయిఈనాడుఅమ్మల గన్నయమ్మ (పద్యం)మాధవీ లతఅయోధ్య రామమందిరంఅరటిభీమా (2024 సినిమా)ఒగ్గు కథమగధీర (సినిమా)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవై.యస్.అవినాష్‌రెడ్డిభారతదేశంఓం నమో వేంకటేశాయవేంకటేశ్వరుడువందే భారత్ ఎక్స్‌ప్రెస్తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్తెలుగు అక్షరాలుమానుషి చిల్లర్అష్ట దిక్కులుచిరుధాన్యంఅమరావతిభారత క్రికెట్ జట్టుగూగుల్నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్ఆకాశం నీ హద్దురానక్షత్రం (జ్యోతిషం)బాలకాండఇంటి పేర్లుఎన్నికలుఅన్నప్రాశనసూర్యకుమార్ యాదవ్భారత జాతీయ కాంగ్రెస్నువ్వు నేనుPHపంచారామాలువాతావరణంశ్రీదేవి (నటి)జె. చిత్తరంజన్ దాస్జూనియర్ ఎన్.టి.ఆర్జాతీయ ఆదాయంమకరరాశిప్రభాస్లవ్ స్టోరీ (2021 సినిమా)బమ్మెర పోతనసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅమెజాన్ (కంపెనీ)మధుమేహంభారతీయ స్టేట్ బ్యాంకుఉలవలుకిరణజన్య సంయోగ క్రియఅమ్మమహాభాగవతంనువ్వుల నూనె2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుయాగంటిశ్రీలీల (నటి)సుందర కాండసద్గురుజ్యేష్ట నక్షత్రంవృషభరాశిసంక్రాంతి🡆 More