విక్రమ్: సినీ నటుడు

విక్రమ్ (ఆంగ్లం: Vikram) దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు.

పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

విక్రమ్
విక్రమ్: వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, సినిమాలు
జననం1966
పరమకుడి, తమిళనాడు
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • వినోద్ రాజ్ (తండ్రి)

వ్యక్తిగత జీవితం

తమిళనాడు లోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆయన స్వస్థలం. ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులుండటం విశేషం. వారు చారుహాసన్, కమల్‌హాసన్, సుహాసిని. విక్రం తండ్రి వినోద్ రాజ్ పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. నృత్యరంగంలోనూ ఆయనకు గుర్తింపు ఉంది. 2017 డిసెంబరు 31 న మరణించాడు. ఆయన చదువుకున్నది యార్కాడ్ లో. చెన్నై లోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి బీఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాడు. ఎంబీఏ కూడా అక్కడే చదివాడు.

విక్రమ్ కు ఆ అవార్డు రావడం వెనుక ఇరవయ్యేళ్ళ నిర్విరామమైన కృషి ఉంది. చదువుకోసం చెన్నైలో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు పిచ్చిగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. కరాటే, ఈత పోటీల్లో ప్రథముడిగా నిలిచేవాడు. గిటార్, పియానో వాయించడం నేర్చుకున్నాడు. తరచూ నాటకాల్లో నటించేవాడు. వాటిలో చాలా భాగం ఆంగ్ల నాటకాలే. విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ చివరకు ఇంజనీరుగా స్థిరపడ్డారు.

ఇష్టాలు

విక్రమ్ కు బైక్ మీద స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.

సినిమాలు

తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్. హీరోగా చేసిన చిరునవ్వుల వరమిస్తావా అనే సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.

  1. అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
  2. చిరునవ్వుల వరమిస్తావా (1993)
  3. బంగారు కుటుంబం (1994)
  4. ఆడాళ్ళా మజాకా (1995)
  5. అక్కా బాగున్నావా (1996)
  6. 9 నెలలు (2000)
  7. శివపుత్రుడు (2003)
  8. అపరిచితుడు (2005)
  9. మజా
  10. మల్లన్న
  11. రావణ్ (2010)
  12. నాన్న (2011)
  13. తాండవం(సినిమా)
  14. 10 (2017)
  15. మిస్టర్ కేకే (2019)
  16. మహాన్ (2022)
  17. కోబ్రా (2022)
  18. ధ్రువ నక్షత్రం (2023)

మూలాలు

Tags:

విక్రమ్ వ్యక్తిగత జీవితంవిక్రమ్ ఇష్టాలువిక్రమ్ సినిమాలువిక్రమ్ మూలాలువిక్రమ్ఆంగ్లంశివ పుత్రుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాశ్రీకాళహస్తిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసురేఖా వాణితెలుగు సంవత్సరాలుఉలవలుఅల్లు అర్జున్వేంకటేశ్వరుడుశక్తిపీఠాలుటిల్లు స్క్వేర్మదర్ థెరీసాతెలుగు నెలలుసీతా రామంపరశురామ్ (దర్శకుడు)గాయత్రీ మంత్రంఘట్టమనేని కృష్ణగురువు (జ్యోతిషం)రాజోలు శాసనసభ నియోజకవర్గంమహాభారతంఎయిడ్స్ఈసీ గంగిరెడ్డితొలిప్రేమమహేంద్రసింగ్ ధోనిగ్లోబల్ వార్మింగ్సజ్జల రామకృష్ణా రెడ్డిశ్రీరామనవమిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామోదుగడీజే టిల్లుతామర వ్యాధినవగ్రహాలు జ్యోతిషంమాధవీ లతఈనాడువిజయనగరంగజేంద్ర మోక్షందేవుడుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారేవతి నక్షత్రంబాబు మోహన్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుటి. పద్మారావు గౌడ్పటిక బెల్లంఎఱ్రాప్రగడఇంటి పేర్లుకొమర్రాజు వెంకట లక్ష్మణరావుభారతదేశంలో సెక్యులరిజంకీర్తి రెడ్డివందే భారత్ ఎక్స్‌ప్రెస్గొట్టిపాటి నరసయ్యసోరియాసిస్అంగన్వాడి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఎవడే సుబ్రహ్మణ్యంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుదానం నాగేందర్ఆప్రికాట్వినోద్ కాంబ్లీకామాక్షి భాస్కర్లసౌర కుటుంబంరక్త పింజరిమేషరాశిమొదటి ప్రపంచ యుద్ధంగైనకాలజీకుతుబ్ షాహీ సమాధులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులులగ్నంరకుల్ ప్రీత్ సింగ్అక్కినేని నాగ చైతన్యదాశరథి రంగాచార్యమొదటి పేజీమధుమేహంనాగ్ అశ్విన్గరుడ పురాణంభారత ఆర్ధిక వ్యవస్థభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాతెలుగు పత్రికలు2024 భారత సార్వత్రిక ఎన్నికలు🡆 More