రేవతి నక్షత్రం

రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు.

ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి, సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

రేవతి నక్షత్రం
రేవతీ నక్షత్రాన్ని చూపే మీన రాశి చిత్రం

నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
రేవతి బుధుడు దేవ పురుష ఏనుగు విప్ప అంత్య నెమలి పూషణుడు మీనం

రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ
సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం
విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం
ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం
సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం
మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం
అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

రేవతీనక్షత్రము నవాంశ

  • 1వ పాదము - ధనసురాశి.
  • 2వ పాదము - మకరరాశి.
  • 3వ పాదము - కుంభరాశి.
  • 4వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

రేవతి నక్షత్రము ప్రాశస్త్యము

Tags:

రేవతి నక్షత్రం రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలురేవతి నక్షత్రం రేవతీనక్షత్రము నవాంశరేవతి నక్షత్రం చిత్ర మాలికరేవతి నక్షత్రం ఇతర వనరులురేవతి నక్షత్రం రేవతి నక్షత్రము ప్రాశస్త్యమురేవతి నక్షత్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిప్రజా రాజ్యం పార్టీమృగశిర నక్షత్రముగీతా కృష్ణలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅల్లు అర్జున్నాగార్జునసాగర్కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంచెల్లమెల్ల సుగుణ కుమారిసుహాసినిలోక్‌సభసుందర కాండఈస్టర్స్త్రీసమాచార హక్కుస్వామి వివేకానందకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఇందుకూరి సునీల్ వర్మఇంటి పేర్లుఉలవలుకాకతీయుల శాసనాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలవ్ స్టోరీ (2021 సినిమా)యవలువ్యవసాయంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతెలుగు పదాలుతూర్పు కాపుకొణతాల రామకృష్ణగోదావరిఆలివ్ నూనెవనపర్తిఇజ్రాయిల్సుమేరు నాగరికతపక్షము2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు సాహిత్యంవై.ఎస్.వివేకానందరెడ్డిఅండాశయముశివుడుప్రభుదేవాభారత జాతీయ చిహ్నంవర్షంవైరస్ఐక్యరాజ్య సమితివిష్ణువు వేయి నామములు- 1-1000జానంపల్లి రామేశ్వరరావుగైనకాలజీమహామృత్యుంజయ మంత్రంరాగులుఅనిష్ప సంఖ్యదగ్గుబాటి పురంధేశ్వరిచతుర్వేదాలుసూర్యకుమార్ యాదవ్గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిఉస్మానియా విశ్వవిద్యాలయంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)విజయశాంతిసత్యనారాయణ వ్రతంసుఖేశ్ చంద్రశేఖర్రామదాసుప్రకటనశకుంతలశతక సాహిత్యముభారతీయ స్టేట్ బ్యాంకుపన్నుచైనాపూర్వ ఫల్గుణి నక్షత్రముఅమృత అయ్యర్జాన్వీ క‌పూర్ఉత్పలమాలఆతుకూరి మొల్లభారతీయ తపాలా వ్యవస్థమన్నెంలో మొనగాడుహనుమంతుడుజ్యోతీరావ్ ఫులేగోల్కొండమొఘల్ సామ్రాజ్యం🡆 More