మూన్ లైటింగ్

మూన్ లైటింగ్ (ఆంగ్లం: moonlighting) అనేది కార్పొరేట్‌ పరిభాషలో, తాము ఉద్యోగం చేస్తున్న సంస్థ‌ల‌కు తెలియ‌కుండా ఖాళీ స‌మ‌యాల్లో ఇత‌ర సంస్థ‌ల‌కూ ప‌నిచేయ‌డం.

ఈ స‌రికొత్త విధానం క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో వచ్చిన వ‌ర్క్ ఫ్రం హోం పధ్ధతి అమ‌లు నుండి మన దేశంలో పురుడుపోసుకుంది. అయితే కొన్ని కంపెనీలు మూన్‌ లైటింగ్‌ను ప్రోత్సహిస్తుంటే మరికొన్ని కంపెనీలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మూన్ లైటింగ్
క్యాబ్ డ్రైవర్ - ఒక సాధారణ సైడ్ జాబ్
మూన్ లైటింగ్
ఫుడ్ డెలివరీ - ఒక సాధారణ సైడ్ జాబ్

నేపధ్యం

ఒక వ్యక్తి తన ప్రాథమిక ఉద్యోగం నుండి వచ్చే ఆదాయం సరిపోనప్పుడో లేదా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలనే కోరికతోనో సైడ్ జాబ్‌లు చేయాల్సివస్తుంది. ఇది సాధారణ పని వేళల తర్వాత నిర్వహించబడుతుంది. సైడ్ జాబ్‌ అనేది పూర్తి-సమయం ఉద్యోగం, పార్ట్-టైమ్ కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ పని కావచ్చు. అనధికారికంగా ఈ విధానాన్ని మూన్‌లైటింగ్ అని పిలుస్తారు, సాధారణంగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సైడ్ జాబ్‌లను కూడా కలిగి ఉండవచ్చు.

అమెరికా లాంటి అభివృద్ధిచెందిన దేశాలలోసైతం వేతన స్తబ్దత కారణంగా సైడ్ జాబ్‌లు జనాదరణ పొందాయి. ఆదాయం జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా లేక దాదాపు సగం మంది అమెరికన్లు సైడ్ జాబ్ కలిగి ఉన్నారని నివేదికలున్నాయి, వీరిలో 43% పూర్తి-కాల కార్మికులు ఉన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 60 శాతం మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నారు, కారణం 43 శాతం మంది అద్దె ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థి రుణాలను చెల్లించడానికి సైడ్ జాబ్ అనేది ఒక సాధనం.

అలాగే ఒక వ్యక్తి ప్రాథమిక ఉద్యోగం ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది, సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకని వారు ఇష్టపడే సైడ్ జాబ్‌ను కొనసాగించవచ్చు,

పర్యవసానం

ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరొక సంస్థలో పనిచేయడంపై ఐటీ పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు మూన్ లైటింగ్ కు అంగీకరిస్తున్నాయి, టెక్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిపి గుర్నానీ వంటి వారు సైతం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇన్ఫోసిస్, విప్రో మాత్రం మూన్ లైటింగ్ పై సీరియస్ గా ఉన్నాయి.

తమ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తమ పోటీదారుల కోసం కూడా పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022 సెప్టెంబరు 21న ప్రకటించారు.

అదనపు ఆదాయం - పన్ను

ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతం ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది.

మూలాలు

Tags:

మూన్ లైటింగ్ నేపధ్యంమూన్ లైటింగ్ పర్యవసానంమూన్ లైటింగ్ అదనపు ఆదాయం - పన్నుమూన్ లైటింగ్ మూలాలుమూన్ లైటింగ్en:Work-at-home schemeకరోనా వైరస్ 2019

🔥 Trending searches on Wiki తెలుగు:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిలగ్నంబౌద్ధ మతంభీమా (2024 సినిమా)భగవద్గీతమానవ శరీరముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థరైతుబంధు పథకంఅన్నమయ్య జిల్లానవరసాలు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుబోడె రామచంద్ర యాదవ్భారతీయ రిజర్వ్ బ్యాంక్భారత రాజ్యాంగ ఆధికరణలుశార్దూల విక్రీడితముగౌతమ బుద్ధుడువృశ్చిక రాశిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకేతువు జ్యోతిషంశతభిష నక్షత్రముభారత రాజ్యాంగంస్వామి రంగనాథానందప్రజా రాజ్యం పార్టీదగ్గుబాటి వెంకటేష్సన్నాఫ్ సత్యమూర్తిరక్తంనీ మనసు నాకు తెలుసుపోలవరం ప్రాజెక్టుఎన్నికలుగోత్రాలుశ్రీలలిత (గాయని)భారతీయ స్టేట్ బ్యాంకుమేరీ ఆంటోనిట్టేశ్రీనివాస రామానుజన్హస్తప్రయోగంఉపద్రష్ట సునీతనూరు వరహాలుఎనుముల రేవంత్ రెడ్డిసన్ రైజర్స్ హైదరాబాద్రామరాజభూషణుడుసెక్యులరిజంతీన్మార్ సావిత్రి (జ్యోతి)శ్రీనాథుడుఅంగారకుడు (జ్యోతిషం)ఈసీ గంగిరెడ్డిచాట్‌జిపిటిటంగుటూరి సూర్యకుమారిAకుప్పం శాసనసభ నియోజకవర్గంగుంటూరుతెలుగు కవులు - బిరుదులునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిరఘురామ కృష్ణంరాజుత్రినాథ వ్రతకల్పంక్వినోవారేణూ దేశాయ్అయోధ్య రామమందిరంరైలుతాటివిభక్తిఆవుతోటపల్లి మధుమూలా నక్షత్రంమహాసముద్రంవై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు అక్షరాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్మీనాక్షి అమ్మవారి ఆలయంబారసాలఅయోధ్యనారా లోకేశ్రజాకార్ఢిల్లీ డేర్ డెవిల్స్అక్కినేని నాగ చైతన్యతెలుగు సినిమాలు డ, ఢపూర్వ ఫల్గుణి నక్షత్రము🡆 More