మల్లిక: మొక్కల జాతి

మల్లిక (మల్లె) (వర్గీకరణ నామం: Jasminum /ˈjæsmɪnəm/) పొదల ప్రజాతికి చెందిన, ఆలివ్ కుటుంబానికి (ఒలకేసి) చెందిన తీగలా పెరిగి సువాసనలిచ్చే పూలు పూసే మొక్క.

ఉష్ణమండల, వెచ్చని ఉష్ణోగ్రతలు కలిగిన యూరేషియా, ఆస్ట్రేలియా, ఓసియానియా ప్రాంతాలలో పెరిగే సుమారు 200 జాతులు వున్నాయి. వేసవి రాగానే మల్లి మొగ్గల వాసన గుప్పు మంటుంది. ఇదే కుటుంబానికి చెందిన జాజి పూలు కూడా సువాసననిస్తాయి.

మల్లిక
మల్లిక: వివరణ, రకాలు, సాహిత్యంలో
Jasminum officinale—Common Jasmine
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Plantae
(unranked):
Angiosperms
(unranked):
(unranked):
Asterids
Order:
Lamiales
Family:
Oleaceae
Tribe:
Jasmineae
Genus:
Jasminum

Type species
Jasminum officinale
L.
Species

More than 200, see List of Jasminum species

Synonyms
  • Jacksonia hort. ex Schltdl
  • Jasminium Dumort.
  • Menodora Humb. & Bonpl.
  • Mogorium Juss.
  • Noldeanthus Knobl.
మల్లిక: వివరణ, రకాలు, సాహిత్యంలో
చెన్నైలో మల్లె మొగ్గ

వివరణ

ఈ మొక్క ఆకురార్చే మొక్కగాగానీ (శరదృతువులో) లేదా పచ్చగా గానీ (సంవత్సరమంతా) నిలువుగా ద్రాక్ష తీగల వలెనే పైకి ప్రాకి వ్యాపించి ఉంటుంది. దీని పుష్పాలు సుమారు 2.5 సెం.మీ (0.93 అంగుళాలు) వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇవి పసువు లేదా తెలుపు రంగులతో ఉంటాయి. కొన్ని పరిస్తితులలో అవి కొంచెం ఎరుపు రంగులో కూడా ఉంటాయి. ఈ పువ్వులు సైమోజ్ క్లస్టర్లలో మూడుపువ్వులుగా వ్యాపించి పుంటాయి. ప్రతీ పువ్వు సుమారు నాలుగు నుండి తొమ్మిది రేకులను కలిగి ఉంటుంది. మల్లెల్లో నలభై రకాలవరకు ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లెవంటివాటిని విరివిగా సాగుచేస్తుంటారు.

మల్లెలు మాఘ మాసంలో పూయటం మొదలుపెడతాయి. అందుకని వీటిని ‘మాఘ్యం’ అంటారు.

రకాలు

ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్‌ సంబక్‌ మాత్రమే. దీన్నే అరేబియన్‌ జాస్మిన్‌, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకులూ పరిమాణాన్ని బట్టి ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్‌ ఆఫ్‌ ఓర్లియాన్స్‌. వీటినే రేక మల్లె, గుండు మల్లె అంటారు. గుండుమల్లెలానే ఉంటాయికానీ వాటికన్నా కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేవే అరేబియన్‌ నైట్స్. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెల్నే బెల్లె ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. వీటినే మైసూర్‌ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్‌ ఇండియా ఎలాంగేటా అంటారు. చూడ్డానికి చిట్టి గులాబీల్లా ముద్దగా ఉండే రోజ్‌ జాస్మిన్‌ లేదా సెంటుమల్లె అనేది మరోరకం. ఇందులో రెండు రకాలు. గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ టస్కనీ, గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ సుప్రీమ్‌. పొడవాటి పొదగా పెరిగే ఈ రకాల్లో ఒకేచెట్టుకి ఒకే సమయంలో రకరకాల పరిమాణాల్లో పూలు పూస్తాయి. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజులపాటు చెట్టుకే ఉండి సుగంధాలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలుఅరలుగా అమరి ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్‌ మల్టీఫ్లోరమ్‌. మాఘ మల్లిక, స్టార్‌ జాస్మిన్‌ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పూసి మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తుంది.

సాహిత్యంలో

మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. వసంతర్తువు ముగిసి గ్రీష్మ ఋతువు ఆరంభమవుతున్న సంధి సమయంలో పూస్తాయి కనుక ‘వార్షికి’ అంటారని, గ్రీష్మంలో విర్రవీగిన మల్లెలు శీతాకాలాన్ని చూస్తే భీరువులైపోతాయి కనుక ‘శీతభీరువు’ అంటారనీ అమర కోశం చెబుతోంది.

సినిమాలలో

సినిమాలు

పాటలు

  • మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)
  • ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమనీ (సుఖదుఃఖాలు)
  • మల్లెపూల వాన జల్లుల్లోన (వినోదం)
  • మల్లియలారా మాలికలారా (నిర్దోషి)
  • మల్లె తీగవంటిది మగువ జీవితం (మీనా)
  • మల్లె పందిరి నీడలోన జాబిల్లి (మాయదారి మల్లిగాడు)
  • సిరిమల్లె నీవే విరి జల్లు తావే (పంతులమ్మ)
  • మల్లెలు పూచే వెన్నెల కాచే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామాయణం)
  • మరుమల్లియ కన్న తెల్లనిది మకరందం కన్నా తీయనిది (మల్లెపూవు)
  • తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు)
  • మల్లెపూల మారాణికి (అమరజీవి)
  • సిరిమల్లె పువ్వల్లే నవ్వు (జ్యోతి)
  • మధుమాస వేళలో మరుమల్లె తోటలో (అందమె ఆనందం)
  • మల్లె కన్న తెల్లన మా సీత మనసు (ఓ సీత కథ)

వైద్యంలో

  • అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే చలవనిస్తాయి.
  • తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
  • కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది.
  • మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.
  • మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వాడతారు.

కొన్ని జాతులు

  • Jasminum abyssinicum Hochst. ex DC. – అడవి మల్లి (Forest jasmine)
  • Jasminum adenophyllum Wall. – Pinwheel Jasmine, Bluegrape jasmine, Princess jasmine, Che vang, Lai la co tuyen
  • Jasminum dichotomum Vahl – Gold Coast Jasmine
  • Jasminum didymum (indigenous to Samoa Islands)
  • Jasminum grandiflorum L. – Spanish Jasmine, Royal Jasmine, Catalonian Jasmine
  • Jasminum humile L. – Italian Yellow Jasmine
  • Jasminum lanceolarium Roxb.
  • Jasminum mesnyi Hance – Japanese Jasmine, Primrose Jasmine, Yellow Jasmine
  • Jasminum multiflorum Hance – భారతీయ మల్లి (Indian Jasmine), Winter Jasmine
  • Jasminum nervosum Lour.
  • Jasminum odoratissimum L. – పసుపు మల్లి (Yellow Jasmine)
  • Jasminum officinale L. – సాధారణ మల్లి (Common Jasmine), Poet's Jasmine, jasmine, jessamine
  • Jasminum parkeri Dunn – పొట్టి మల్లి (Dwarf Jasmine)
  • Jasminum polyanthum Franch.
  • Jasminum sambac (L.) Aiton – అరేబియా మల్లి (Arabian Jasmine)
  • Jasminum sinense Hemsl.
  • Jasminum urophyllum Hemsl.

మూలాలు

ఇతర లింకులు

Tags:

మల్లిక వివరణమల్లిక రకాలుమల్లిక సాహిత్యంలోమల్లిక సినిమాలలోమల్లిక వైద్యంలోమల్లిక కొన్ని జాతులుమల్లిక మూలాలుమల్లిక ఇతర లింకులుమల్లిక

🔥 Trending searches on Wiki తెలుగు:

పెంచల కోనమొదటి ప్రపంచ యుద్ధంజాతీయములుట్రాన్స్‌ఫార్మర్తిరుమల చరిత్రహస్త నక్షత్రముతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంనిఖత్ జరీన్తెలుగు శాసనాలుజ్యోతీరావ్ ఫులేబెల్లి లలితఅక్షరమాలతీన్మార్ మల్లన్నకాంచనపెద్దమనుషుల ఒప్పందంకుంభమేళామహానందిసామెతలునెల్లూరుచాగంటి కోటేశ్వరరావుతొట్టెంపూడి గోపీచంద్చిరంజీవి నటించిన సినిమాల జాబితావాతావరణంమంగ్లీ (సత్యవతి)నరసింహావతారంశ్రీశ్రీ రచనల జాబితాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకుక్కతెలంగాణ జాతరలుమండల ప్రజాపరిషత్నువ్వు లేక నేను లేనుసుభాష్ చంద్రబోస్కురుక్షేత్ర సంగ్రామంమా ఊరి పొలిమేరమిషన్ ఇంపాజిబుల్శోభితా ధూళిపాళ్లభారతదేశంలో మహిళలుకాసర్ల శ్యామ్రోహిణి నక్షత్రంరైతుబంధు పథకంకలబందఉత్తర ఫల్గుణి నక్షత్రముదక్ష నగార్కర్కోడి రామ్మూర్తి నాయుడువిరూపాక్ష దేవాలయం, హంపిఅనసూయ భరధ్వాజ్పద్మ అవార్డులు 2023ద్రౌపదివిరాట్ కోహ్లిఎర్ర రక్త కణంజాతీయ రహదారి 44 (భారతదేశం)హెబియస్ కార్పస్త్రినాథ వ్రతకల్పంఅశ్వగంధమానవ శరీరముబలంవిడదల రజినిభారత సైనిక దళంసౌందర్యలహరియోగి ఆదిత్యనాథ్ఆరుద్ర నక్షత్రముఆలివ్ నూనెఆపిల్రంజాన్ఉసిరిఢిల్లీ సల్తనత్గవర్నరుచీకటి గదిలో చితక్కొట్టుడునెట్‌ఫ్లిక్స్పందిరి గురువునువ్వు నేనుజవహర్ నవోదయ విద్యాలయంచాకలిమోదుగకస్తూరి రంగ రంగా (పాట)సంయుక్త మీనన్భారత కేంద్ర బడ్జెట్ 2023 - 24గ్రామ రెవిన్యూ అధికారి🡆 More