భారత-పాకిస్తాన్ సరిహద్దు

భారత-పాకిస్తాన్ సరిహద్దు, భారతదేశం, పాకిస్తాన్‌లను వేరుచేసే అంతర్జాతీయ సరిహద్దు.

ఈ సరిహద్దుకు ఉత్తర కొసన నియంత్రణ రేఖ ఉంది. ఇది కాశ్మీర్‌ను పాక ఆక్రమిత కాశ్మీర్ నుండి వేరు చేస్తుంది. సరిహద్దుకు దక్షిణ చివరలో సర్ క్రీక్ ఉంది, ఇది గుజరాత్ రాష్ట్రానికి, పాకిస్తానీ రాష్ట్రమైన సింధ్ కు మధ్య రాన్ ఆఫ్ కచ్‌లోని ఒక ఉప్పు కయ్య.

భారత-పాకిస్తాన్ సరిహద్దు
భారత-పాకిస్తాన్ సరిహద్దు
అంతరిక్షం నుండి భారత-పాకిస్తాన్ సరిహద్దు
లక్షణాలు
పక్షాలుభారత-పాకిస్తాన్ సరిహద్దు India భారత-పాకిస్తాన్ సరిహద్దు Pakistan
పొడవు3,323 kilometres (2,065 mi)
History
ఏర్పాటు1947 ఆగస్టు 17
భారతదేశ విభజన లో భాగంగా సిరిల్ రాడ్‌క్లిఫ్ సృష్టించిన రాడ్‌క్లిఫ్ రేఖ
ప్రస్తుత రూపు1972 జూలై 2
సిమ్లా ఒడంబడిక లో అంగీకరించిన విధంగా నియంత్రణ రేఖ గుర్తింపు
ఒడంబడికలుకరాచీ ఒప్పందం (1949), సిమ్లా ఒడంబడిక (1972)
గమనికలునియంత్రణ రేఖ కాశ్మీరును, పాక్ ఆక్రమిత కాశ్మీరును విభజిస్తూ సాగుతుంది. కాశ్మీరు సమస్య కారణంగా అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులో భాగం కాదు.

తొలుత 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో రాడ్‌క్లిఫ్ లైన్ ఆధారంగా ఈ సరిహద్దును గుర్తించారు. ఈ సరిహద్దు, ప్రధానమైన పట్టణ ప్రాంతాల నుండి నిర్జనమైన ఎడారుల వరకు అనేక రకాల భూభాగాల గుండా వెళుతుంది. రెండు దేశాలకూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొద్దికాలానికే భారతదేశం-పాకిస్తాన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ఇది అనేక సరిహద్దు సైనిక ప్రతిష్టంభనలకు, పూర్తి స్థాయి యుద్ధాలకూ వేదికగా నిలిచింది. PBS ఇచ్చిన గణాంకాల ప్రకారం, ఈ సరిహద్దు మొత్తం పొడవు 3,323 kilometres (2,065 mi). 2011లో ఫారిన్ పాలసీ పత్రికలో రాసిన ఒక కథనం ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ సరిహద్దులలో ఇది ఒకటి. భారతదేశం ఈ సరిహద్దు వెంట సుమారు 50,000 దీప స్తంభాలపై 1క్వ్వ్,50,000 ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసింది. ఈ కారణంగా రాత్రి సమయంలో, భారత-పాకిస్తాన్ సరిహద్దు అంతరిక్షం నుండి స్పష్టంగా కనిపిస్తుంది.

విభాగం వ్యత్యాసం

భారత-పాకిస్తాన్ సరిహద్దు 
కాశ్మీర్ ప్రాంతం మ్యాపు. భారత పాకిస్తాన్ల మధ్య కార్యకాలిక సరిహద్దు, నియంత్రణ రేఖను చూపుతుంది

రెండు దేశాల మధ్య, గుజరాత్/సింధ్ నుండి మొదలయ్యే సరిహద్దు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దుగా ఉంది. నియంత్రణ రేఖకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు లేదు. 1947 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత కాశ్మీర్‌ఉ పాక్ ఆక్రమిత కాశ్మీరు గాను, కాశ్మీరు గానూ విభజించబడింది. 1949 లో ఐరాస మధ్యవర్తిత్వంలో వెలసిన కాల్పుల విరమణ రేఖ, రెండు ప్రాంతాల మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేసింది. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత దీన్ని నియంత్రణ రేఖగా మార్చారు.

భారత ఆధీనంలో ఉన్న కాశ్మీరుకు, పాకిస్తాన్ రాష్ట్రమైన పంజాబ్ కూ మధ్య ఉన్న సరిహద్దును ఐరాస, అధికారికంగా "వర్కింగ్ బౌండరీ" అని పిలుస్తుంది. భారతదేశం దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది.

ఉత్తరం నుండి దక్షిణానికి భారత-పాకిస్తాన్ సరిహద్దులోని విభాగాలు:

  1. నియంత్రణ రేఖ (LoC) : కాశ్మీరుకు, పాక్ ఆక్రమిత కాశ్మీరుకూ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు. దీని ప్రస్తుత రూపాన్ని 1972 సిమ్లా ఒప్పందం తర్వాత గీసారు.
  2. వర్కింగ్ సరిహద్దు: పాకిస్థాన్‌ లోని పంజాబ్‌ను భారత-అధీనం లోని జమ్మూ కాశ్మీర్ నుండి వేరు చేస్తుంది. ఐరాస దీన్ని వర్కింగు సరిహద్దుగా సూచించింది; పాకిస్తానీ పంజాబ్‌ను పాకిస్తాన్‌లో భాగంగా ఇరు పక్షాలూ గుర్తించగా, జమ్మూ కాశ్మీర్ మాత్రం (భారతదేశంలో ఉంది, కానీ పాకిస్తాన్ తనదంటోంది) వివాదాస్పద భూభాగం గానే ఉంది.
  3. అంతర్జాతీయ సరిహద్దు (IB): రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ల మధ్య గుర్తించబడిన సరిహద్దు రేఖ. అంతర్జాతీయంగా ఇరుపక్షాలూ దీన్ని గుర్తించాయి. 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం భారత విభజన సమయంలో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ ఈ సరిహద్దును గీసాడు.

సరిహద్దును దాటే చోట్లు

  • ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు (ICP) కలిగిన సరిహద్దు దాటే స్థలాలు :
    • భారత, పాకిస్తాన్ల మధ్య వాఘా - అట్టారి అత్యంత ప్రసిద్ధమైన, ప్రముఖమైన సరిహద్దు దాటే స్థలం. వాఘా-అట్టారి సరిహద్దు వేడుకల కారణంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఇది అమృత్‌సర్ నుండి 32 కిలోమీటర్లు, లాహోర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    • మునబావో : రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో రైల్వే స్టేషను ఉంది. భారత, పాకిస్తాన్లను కలిపే థార్ ఎక్స్‌ప్రెస్ ఈ స్టేషను గుండా పోతుంది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ స్థలాన్ని మూసేసారు. 2006 ఫిబ్రవరిలో దీన్ని తిరిగి ప్రారంభించారు. అప్పటి నుండి థార్ ఎక్స్‌ప్రెస్, జోధ్‌పూర్‌లోని భగత్ కీ కోఠి నుండి పాకిస్తాన్‌లోని కరాచీకి నడుస్తోంది.
  • ఇతర దాటే స్థలాలు
    • గండా సింగ్ వాలా సరిహద్దు, కసూర్ జిల్లా (పాకిస్తాన్ వైపు) / హుస్సేనివాలా సరిహద్దు, పంజాబ్ (భారతదేశం వైపు)
    • సులైమాంకి, పంజాబ్ (పాకిస్తాన్ వైపు) / ఫజిల్కా సరిహద్దు, ఒకారా జిల్లా (భారతదేశం వైపు)
    • లోంగేవాలా (మూసివేసారు)

సరిహద్దు వేడుకలు

భారత-పాకిస్తాన్ సరిహద్దు 
వాఘా సరిహద్దు వేడుక, 2015.

సరిహద్దును దాటే కింది ప్రదేశాలలో బీటింగ్ రిట్రీట్ జెండా వేడుకలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు రెండు దేశాల సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇవి ప్రజలకు పర్యాటక ఆకర్షణలుగా మారాయి. వీటిని చూసేందుకు ప్రత్యేక అనుమతి లేదా టిక్కెట్ అవసరం లేదు. కింది వేడుక స్థలాలు ఉన్నాయి (ఉత్తరం నుండి దక్షిణానికి):

వాగా-అట్టారీ సరిహద్దు వేడుక

వాగా గ్రామంలో జెండా అవతరణ కార్యక్రమం ప్రతి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు భారతదేశం (సరిహద్దు భద్రతా దళం), పాకిస్తాన్ (పాకిస్తాన్ రేంజర్స్) ల సరిహద్దు దళాలు నిర్వహిస్తాయి. ఇది 1959 నుండి వస్తున్న సంప్రదాయం. సరిహద్దు కాపలాదార్లు బిగ్గరగా చేసే అరుపుల రూపంలో రెండు వైపుల నుండి యుద్ధ పిలుపులతో వేడుక ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఒక పద్ధతి ప్రకారం కాళ్ళను ఎత్తుగా లేపి గాల్లోకి తన్నడం, తొక్కడం, నాట్య పూర్వకమైన కదలికలూ ఉంటాయి. ఈ సమయంలో ప్రత్యర్థి దళాలు ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటాయి. జెండాలను అవనతం చేయడంతో పాటు హెడ్ గార్డులు పరస్పరం కరచాలనం చేసుకోవడంతో కార్యక్రమం ముగుస్తుంది. ప్రేక్షకులందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడతారు. ఈ ఆచారం అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సౌభ్రాతృత్వానికీ, అలాగే శత్రుత్వానికీ ఇది ప్రతీక. దీపావళి, ఈద్‌ల సందర్భంగా ఇరు దళాలు ప్రత్యర్థికి స్వీట్లు పంచుతాయి. అయితే 2016, 2018 లలో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో BSF అలా పంచలేదు. 2014 వాఘా సరిహద్దు ఆత్మాహుతి దాడిలో 60 మంది మరణించారు, 110 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి శాంతియుత వాతావరణంలో ఇది ఒక దుస్సంఘటన. 2019 భారత-పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం (పిఎఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ విమానాన్ని కూల్చివేసి, అతన్ని బందీగా పట్టుకుని, ఆ తరువాత అతన్ని తిరిగి భారతదేశానికి అప్పగించినప్పుడు కూడా దీన్ని రద్దు చేసారు.

భారతదేశం (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), పాకిస్తాన్ (పాకిస్తాన్ రేంజర్లు) నిర్వహించే ఇలాంటి సరిహద్దు వేడుకలు ఫజిల్కా (భారతదేశం వైపు) / సులైమాంకి సరిహద్దు వద్ద, హుస్సేనివాలా పంజాబ్ (భారతదేశం వైపు) / గండా సింగ్ వాలా సరిహద్దు వద్ద, కసూర్ జిల్లా (పాకిస్తాన్ వైపు) వద్ద జరుగుతాయి. ఈ ఆచారాలకు ప్రధానంగా స్థానిక గ్రామస్తులు హాజరవుతారు. పర్యాటకులు చాలా తక్కువ మంది ఉంటారు. 

చిత్ర మాలిక

భారత-పాకిస్తాన్ సరిహద్దు 
"బాబా చమిలియల్ మేళా" జమ్మూ నుండి 45 కి.మీ. దూరంలో గల రామగఢ్ వద్ద జరిగే వేడుక. భారత పాకిస్తానీయులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
"బాబా చమిలియల్ మేళా" జమ్మూ నుండి 45 కి.మీ. దూరంలో గల రామగఢ్ వద్ద జరిగే వేడుక. భారత పాకిస్తానీయులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
వాగా వద్ద జరిగే వేడుక - పాకిస్తాన్ వైపు నుండి
వాగా వద్ద జరిగే వేడుక - పాకిస్తాన్ వైపు నుండి 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
అంతరిక్షం నుండి లైట్ల వెలుతురులో భారత పాక్ సరిహద్దు
అంతరిక్షం నుండి లైట్ల వెలుతురులో భారత పాక్ సరిహద్దు 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
పాత జాతీయ రహదారి 1 పై వాగా వద్ద సరిహద్దు దాటేందుకు వేచి ఉన్న లారీలు
పాత జాతీయ రహదారి 1 పై వాగా వద్ద సరిహద్దు దాటేందుకు వేచి ఉన్న లారీలు 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
వాగా వద్ద కాపలా ఉన్న పాకిస్తానీ రేంజర్లు
వాగా వద్ద కాపలా ఉన్న పాకిస్తానీ రేంజర్లు 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
సైనిక వేడుకలో భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా సైనికులు - 2010
సైనిక వేడుకలో భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా సైనికులు - 2010 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
రాణ్ ఆఫ్ కచ్ వద్ద భారత పాక్ సరిహద్దు
రాణ్ ఆఫ్ కచ్ వద్ద భారత పాక్ సరిహద్దు 
భారత-పాకిస్తాన్ సరిహద్దు 
వాగా వద్ద భారత పాక్ సరిహద్దు, 2017
వాగా వద్ద భారత పాక్ సరిహద్దు, 2017 

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

భారత-పాకిస్తాన్ సరిహద్దు విభాగం వ్యత్యాసంభారత-పాకిస్తాన్ సరిహద్దు సరిహద్దును దాటే చోట్లుభారత-పాకిస్తాన్ సరిహద్దు సరిహద్దు వేడుకలుభారత-పాకిస్తాన్ సరిహద్దు చిత్ర మాలికభారత-పాకిస్తాన్ సరిహద్దు ఇవి కూడా చూడండిభారత-పాకిస్తాన్ సరిహద్దు మూలాలుభారత-పాకిస్తాన్ సరిహద్దుగుజరాత్నియంత్రణ రేఖపాకిస్తాన్భారతదేశంసర్ క్రీక్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాజాంబవంతుడుద్విగు సమాసముచాట్‌జిపిటిహైపర్ ఆదిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపచ్చకామెర్లువ్యాసుడుస్వామి రంగనాథానందభారత సైనిక దళంఅశ్వని నక్షత్రముఛత్రపతి శివాజీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురోజా సెల్వమణినవరసాలుఅగ్నికులక్షత్రియులుఇండియన్ ప్రీమియర్ లీగ్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డివిశాఖపట్నంమా తెలుగు తల్లికి మల్లె పూదండఅభిమన్యుడువిశాఖ నక్షత్రమునోటాసంభోగంనవరత్నాలుమొదటి ప్రపంచ యుద్ధం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుస్త్రీఅక్కినేని నాగ చైతన్యఏప్రిల్ 25బంగారంవేమన శతకముహైదరాబాదుఆశ్లేష నక్షత్రముమొదటి పేజీభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిLవిజయసాయి రెడ్డిబ్రహ్మంగారి కాలజ్ఞానంశ్రీవిష్ణు (నటుడు)రుద్రమ దేవిసుమతీ శతకముమహాభారతంనిర్వహణభారత జాతీయ చిహ్నంశామ్ పిట్రోడారమణ మహర్షిశ్యామశాస్త్రిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానానార్థాలునాగార్జునసాగర్విద్యుత్తుఓం భీమ్ బుష్అంగారకుడు (జ్యోతిషం)అనిఖా సురేంద్రన్బుధుడు (జ్యోతిషం)సీతాదేవిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకాలుష్యంతెలుగు కులాలుబాదామిఆటలమ్మనారా లోకేశ్బలి చక్రవర్తిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాలు 2024ఆర్టికల్ 370 రద్దుఇక్ష్వాకులుభారతీయ స్టేట్ బ్యాంకుతెలుగు అక్షరాలుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంనవధాన్యాలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువిభక్తిదానం నాగేందర్తోటపల్లి మధుదగ్గుబాటి పురంధేశ్వరిభారత ఆర్ధిక వ్యవస్థ🡆 More