బొమ్మకంటి సత్యనారాయణ రావు

బొమ్మకంటి సత్యనారాయణ రావు (1916, ఆగస్టు 7 - 1984, ఆగస్టు 22) తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.

తెలంగాణ సాయుధ పోరాటంలో మధిర ప్రాంతంలో పోరాటానికి నాయకత్వం వహించిన ముఖ్య నాయకులలో బొమ్మకంటి సత్యనారాయణ రావు ఒకరు. పోరాటంలో పాల్గొని కీలకమైన పాత్ర పోసించిన బొమ్మకంటి, ఆ తర్వాతికాలంలో మధిర శాసనసభ నియోజకవర్గం నుండి 1957 నుండి 1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

బొమ్మకంటి సత్యనారాయణ రావు
మాజీ శాసనసభ సభ్యుడు
In office
1957-1962
తరువాత వారుదుగ్గినేని వెంకయ్య
నియోజకవర్గంమధిర శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1916-08-07)1916 ఆగస్టు 7
బోనకల్లు, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణం1984 ఆగస్టు 22(1984-08-22) (వయసు 68)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుపట్టాభిరామారావు - వెంకట్రామమ్మ

జననం, విద్య

బొమ్మకంటి సత్యనారాయణ రావు 1916, ఆగస్టు 7న పట్టాభిరామారావు - వెంకట్రామమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, బోనకల్లు గ్రామంలో జన్మించాడు. కాళోజీ నారాయణరావు, దేవులపల్లి రామానుజరావు, మాటేటి రామప్ప ఐఏఎస్ (రిటైర్డ్) తదితరులతో కలిసి వరంగల్‌లో మెట్రిక్యులేషన్ చదివాడు.

ఉద్యోగం

మెట్రిక్యులేషన్ తర్వాత వరంగల్‌లోని సుబేదారి కార్యాలయంలో పనిచేశాడు. నిజాం ప్రభుత్వంలో భాగంగా 1943-44లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

సాయుధ పోరాటం

రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మధిర పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల క్యాంపులు నిర్వహించడంతోపాటు వారిని తిప్పికొట్టేందుకు అనక గ్రామాలను ఏకం చేశాడు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో షోలాపూర్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రథమ సమావేశంలో మాడపాటి హనుమంతారావు, జమలాపురం కేశవరావులతోపాటు బొమ్మకంటి కూడా పాల్గొన్నాడు. 1948 ఆగస్టులో తన స్వగ్రామం బోనకల్లులో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అజ్ఞాతవాసం ప్రారంభించాడు. సరిహద్దు చుట్టూ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు.

రాజకీయ జీవితం

వరంగల్, ఖమ్మం జిల్లాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ వ్యవస్థాపకుడిగా పనిచేశాడు. 1954 జనవరి 17న హైదరాబాదు రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షునిగా కూడా పోటీచేసాడు. బొమ్మకంటి ఎమ్మెల్యే మాత్రమే కాగలిగినా దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు. బొమ్మకంటి రాష్ట్రంలో తొలిసారిగా బోనకల్, మధిర అసెంబ్లీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్లాట్లు, భూములు కేటాయించాడు. ఖమ్మం జిల్లా ఏర్పాటుకు ముఖ్యపాత్ర పోషించాడు.

ఉమ్మడి వరంగల్ & పనిచేశాడు. ఖమ్మంలో శ్రీరామ , భక్త గెంటాల నారాయణ రావు డిగ్రీ కళాశాలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ కేంద్రాలను నిర్వహించాడు. 1951లో తెలంగాణలో భూదాన్ పాదయాత్ర సందర్భంగా ఆచార్య వినోబా భావేతో కలిసి పర్యటించాడు. 1954లో బొమ్మకల్లు గ్రామ సమగ్రాభివృద్ధికి గ్రామపెద్దలతో కూడిన గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరు కాలనీల నిర్మాణాలు (ప్రతి లబ్ధిదారునికి 10 సెంట్ల స్థలంతో సుమారు 275 ఇళ్లు), తాగునీటి బావులు (ఓపెన్‌ బావులు) తవ్వడం, గ్రామ రోడ్లు వేయడం తదితర పనులను చేపట్టాడు.

రచనలు

బొమ్మకంటి రాసిన స్వాతంత్ర్య సమరయోధుల క్లుప్తమైన చరిత్రను, "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం" శీర్షికతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక "ఆంధ్ర ప్రదేశ్" ప్రచురించింది.

మరణం

బొమ్మకంటి సత్యనారాయణ రావు 1984, ఆగస్టు 22న మరణించాడు.

మూలాలు

Tags:

బొమ్మకంటి సత్యనారాయణ రావు జననం, విద్యబొమ్మకంటి సత్యనారాయణ రావు ఉద్యోగంబొమ్మకంటి సత్యనారాయణ రావు సాయుధ పోరాటంబొమ్మకంటి సత్యనారాయణ రావు రాజకీయ జీవితంబొమ్మకంటి సత్యనారాయణ రావు రచనలుబొమ్మకంటి సత్యనారాయణ రావు మరణంబొమ్మకంటి సత్యనారాయణ రావు మూలాలుబొమ్మకంటి సత్యనారాయణ రావు19161984ఆగస్టు 22ఆగస్టు 7తెలంగాణా సాయుధ పోరాటంమధిర శాసనసభ నియోజకవర్గంరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలులోక్‌సభభారత జాతీయపతాకంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డినరసింహావతారందేవులపల్లి కృష్ణశాస్త్రిపూజిత పొన్నాడజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుగిలక (హెర్నియా)శివుడునిజాంశ్రవణ నక్షత్రముప్రియురాలు పిలిచిందిషిర్డీ సాయిబాబాఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్రణభేరిపొడుపు కథలుమొటిమదశదిశలుబైబిల్ గ్రంధములో సందేహాలుతెలంగాణ మండలాలునర్మదా నదిపురుష లైంగికతశిశోడియాదాశరథి కృష్ణమాచార్యబలంగర్భాశయముభీష్ముడురమణ మహర్షిశతభిష నక్షత్రముగుంటకలగరసంధితీన్మార్ మల్లన్నబసవేశ్వరుడుభారతదేశంమఖ నక్షత్రముభారతీయ శిక్షాస్మృతిమదర్ థెరీసాభారతదేశ చరిత్రనాగార్జునసాగర్అశ్వని నక్షత్రముకన్యకా పరమేశ్వరిదశరథుడుప్రభాస్మీనరాశిసుభాష్ చంద్రబోస్ఆలివ్ నూనెపద్మ అవార్డులు 2023నోటి పుండురజాకార్లుమిషన్ భగీరథరబీ పంటమానవ పరిణామంతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంరామోజీరావుఅధిక ఉమ్మనీరుతెలంగాణ ఉన్నత న్యాయస్థానంజ్వరంవారాహిసంగీతంనిఖత్ జరీన్దసరాతెలుగు వ్యాకరణంకృతి శెట్టిదక్ష నగార్కర్వీర్యంకూచిపూడి నృత్యంభారత జాతీయగీతంఇందిరా గాంధీకమ్మపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఅక్బర్గవర్నరుమహాభాగవతంతాటిశకుంతలప్రజాస్వామ్యం🡆 More