పారాచూట్

పారాచూట్ అనగా సాధారణంగా గొడుగు వంటి ఆకారం కలిగిన పరికరం, దీనితో ప్రజలు లేదా వస్తువులు నెమ్మదిగా, సురక్షితంగా గాలిలో తేలుతున్నట్లుగా చాలా ఎత్తుల నుండి, విమానం వంటి వాటి నుండి క్రిందకు దిగుతూ నేలకు చేరుకోవచ్చు.

ఈ పారాచూట్ పదం ఫ్రెంచ్ పదాలైన పారర్, చూటీ పదాల నుండి వచ్చింది, పారర్ అర్థం రక్షించడం, చూటీ అర్థం సురక్షితంగా, జాగ్రత్తగా పై నుంచి క్రిందికి జారుతూ పిల్లలు ఆడుకునే జారుడు బల్ల. పారాచూట్స్ పార్‌చూటింగ్ అనే క్రీడలో ఉపయోగిస్తున్నారు. దీని సృష్టికర్త లియోనార్డో డా విన్సీ ఒక రోజున మానవులు ఎగురగలరని నమ్మాడు.

పారాచూట్
Parachutes opening

పారాచూట్ అనునది తేలికైన గట్టిగా ఉన్న వస్త్రంతో తాయారుచేస్తారు. అనగా ఆ వస్త్రం వాస్తవానికి సిల్కుతో తయారు చెయబడినా ప్రస్తుతం సాధారణంగా నైలాన్ను వాడుతున్నారు. పరిస్థితులను బట్టి పారాచూట్ ప్రజలు, ఆహారం, పరికరాలు, స్పేస్ క్యాప్సూల్లు, బాంబులు. వంటి వివిధ వస్తువులను పై నుండి వాతావరణం గుండా నెమ్మదిగా క్రిందికి దించుటకు వాడుతారు.

డ్రోగ్ పారాచూట్లు నేలకు సమాంతాంగా పోవు వాహనాలకు ఋణ త్వరణం కల్గించి వాటి వేగాన్ని తగ్గించుటకు లేదా వాహనాలకు స్థిరత్వం అందించుటకు వాడుతారు.దీనిని స్పేస్ షటిల్ భూమిపైకి దిగినపుడు దాని వేగాన్ని క్రమంగా తగ్గించుటకు కూడా వాడుతారు. పారాచూట్ అను పదం ఫ్రెంచ్ పదం అయిన "పారాసెట్" నుండి వచ్చింది. వాస్తవానికి గ్రీకు భాషనుండి దీని అర్థము తీసుకుంటే "ప్రజెక్ట్ అగనిస్ట్" (వ్యతిరేక దిశలో ప్రక్షిప్తం చేయుట), "చూట్" అనునది ఫ్రెంచ్ పదము దీని అర్థము "ఫాల్" (స్వేచ్ఛా పతనం) . వాస్తవానికి పాచాచూట్ అనునది హైబ్రిడ్ (సంకర) పదం. ప్రెంచి వైమానికుడు ఫ్రాంకోయిస్ బ్లాంచర్డ్ (1753–1809) 1785 లో తెలిపిన ప్రకారం దీని అర్థం భాషా పరంగా "పతనానికి వ్యతిరేకంగా ప్రక్షిప్తం చేయుట".

ప్రారంభ పునరుజ్జీవన రూపాలు

పారాచూట్ 
ప్రాచీన పారాచూట్ చిత్రణ, 1470 లో ఇటలీలో అనామక రచయిత ద్వారా

మొట్టమొదటి సారి పారాచూట్ యొక్క ఆధారం పునరుజ్జీవన కాలంలో లభించింది. ప్రాచీన పారాచూట్ యొక్క రూపం 1470 లలో ఇటలీ పునరుజ్జీవన కాలంలోని అనామక వ్రాతప్రతుల నుండి లభించాయి. ఈ అనామక రచయితలు చేసిన చిత్రణలో స్వేచ్ఛగా వ్రేలాడుతున్న వ్యక్తి ఒక శంఖు ఆకారపు పైకప్పు జత ఒక క్రాస్ బార్ ఫ్రేమ్ పట్టుకొని వ్రేలాడుతున్నట్లు ఉన్నవి. భద్రతా పరంగా నాలుగు పట్టీలు నాలుగు లోహపు కడ్డీలనుండి వచ్చి వాటిని నడుము బెల్టుకు అతికించబడినవి. పారాచూట్ యొక్క విస్తారమైన మెరుగుదల గూర్చి వేరొక గ్రంథంలో కూడా వివరించబడింది. ఈ డిజైన్ ప్రకారం వ్యక్తి తన చేతులతో రెండు బార్లు పట్టుకొని వాటికి పెద్ద వస్త్రం స్ట్రీమర్ల ద్వారా శక్తిని విభజించి తన వేగాన్ని తగ్గించుకొనే చిత్రం కూడా లభించింది. అదేవిధంగా పారాచూట్ యొక్క ఉపరితల వైశాల్యం బాగా తగ్గించుట ద్వారా గాలి యొక్క ఘర్షణ వలన కలిగిన నిరోధమును తగ్గించుట, చెక్కతో చేసిన ఆధారంతో నష్టాన్ని గణనీయంగా తగ్గించుటకు రూపకల్పన స్పష్టంగా ఉంది

కొంత కాలం తర్వాత లియొనార్డో డావిన్సీ 1485 లో వ్రాసిన గ్రంథం "కోడెక్స్ అట్లాంటికస్" (గ్రంథం-381వి) లో పారాచూట్ యొక్క చిత్రణ కలదు . ఈ చిత్రంలో వ్యక్తి యొక్క బరువుకు సరైన అనుపాతంలో పారాచూట్ రూపొందినట్లు ఉంది. లియోనార్డో చిత్రణ ప్రకారం చెక్కతో చేసిన ప్రేంతో కూడి శంకువు ఆకారం నుండి పిరమిడల్ ఆకారలో పారాచూట్ రూపొందించబడినట్లున్నది. ఇది ఇటాలియన్ సృష్టికర్త ప్రారంభ రూపకల్పన ప్రభావితం లేదో తెలియదు కానీ కానీ అతను పునరుజ్జీవన సాంకేతిక మధ్య విస్తృత మౌఖిక సమాచార మార్పిడి ద్వారా భావన గురించి తెలుసుకున్నారు. లియోనార్డో యొక్క పిరమిడ్ డిజైన్ యొక్క సాధ్యతను విజయవంతంగా 2000 లో బ్రిటన్ దేశస్తుడు ఆండ్రియన్ నికోలాస్ పరీక్షించారు. మరల 2008 లో వేరొక స్కై డ్రైవర్ కూడా పరీక్షించారు. సాంకేతిక చరిత్రకారుడు లిన్ వైట్ ప్రకారం ఈ శంక్వాకార, పిరమిడ్ నమూనాలు, ఆసియాలో మరింత విస్తృతమైన ప్రారంభ కళాత్మక హెచ్చుతగ్గుల కంటే దృఢమైనవి.

క్రొయేటియన్ ఆవిష్కర్త "ఫాస్టో వెరాంజియో" (1551–1617) కావిన్సీ యొక్క చిత్రాన్ని పరిశీలించి స్వంతంగా క్రొత్త రూపాన్ని అమలు చేశాడు. ఆయన చతురస్రాకార చట్రాన్ని ఉంచాడు కానీ పైకప్పును కొద్దిగా మార్చాడు. ఆయన పైకప్పును మరింత సమర్థవంతంగా ఋణ త్వరనం కలిగించుటకు తెరచాపలాంటి వస్త్రాన్ని ఉపయోగించి స్వేచ్ఛా పతనంలో అది ఉబ్బేటట్లు చేసాడు. ప్రసిద్ధ చారిత్రాత్మక ఆధారం వెనిస్ లోని సెయింట్ మార్క్స్ కాంపనైల్ లో లభించింది. దీనిలో "హోమో వోలాంస్" (ఎగిరే వ్యక్తి) అని చూచించబడింది. ఈ ఆధారం "మషీనే నోవే" (1615 లేదా 1616) అనే గ్రంథంలో విశదీకరింపబడింది. ఈ గ్రంథంలో అనేక యంత్రాలకు సంబంధించి సాంకేతిక భావనలు కలవు. 1617 లో వ్రాన్సిస్ తన 65 వ సంవత్సరంలో తీవ్రంగా జబ్బునపడినపుడు తాను రూపొందించిన పారాచూట్ ను పరీక్షించుటకు సెయింట్ కాంపనైల్ లో ఒక బ్రిడ్డి నుండి దూకినట్లు విస్తృతంగా నమ్మబడుతోంది.

మరికొన్ని చారిత్రాత్మక ఆధారాల ప్రకారం 30 సంవత్సరముల తర్వాత లండన్ లోని రాయల్ సొసైటి సెక్రెటరీ "జాన్ వికిన్స్" 1648 లో వ్రాసిన పుస్తకం "మేధమెటికల్ మేజిక్స్"లో ఎగిరే వ్యక్తుల గురించి వ్రాయబడినవి . ఆయన వ్రాసిన గ్రంథంలో ఎగురుట గురించి వ్రాయబడినది కానీ పారాచూట్ గూర్చి వ్రాయబడలేదు. ఆయన "ఫాస్ట్ వ్రాన్సిస్" గూర్చిగానీ, పారాచూట్ జంప్ గూర్చి గానీ, 1617 లో జరిగే ఏ సంఘటనను గూర్చి వ్రాయలేదు. ఆయన గాలిలో ఎగురుట గూర్చి వ్రాత ప్రతులేవీ లభించలేవనీ సందేహాన్ని వెలిబుచ్చాడు

ఇతర ప్రచురణలు ప్రకారం 1100 లలో చైనా దేశంలో పాచాచూట్ వినియోగం గురించి ఉంది. 1797 లో ఫ్రాన్స్ దేశస్తుడైన జాక్వెస్ గార్నెరిన్ మొదటి నవీన స్కైడైవింగ్ ప్రారంభింనినట్లు తన ప్రయోగాలు, ప్రజా ప్రదర్శనలు తెలుస్తుంది.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

పారాచూట్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

పారాచూట్ ప్రారంభ పునరుజ్జీవన రూపాలుపారాచూట్ ఇవి కూడా చూడండిపారాచూట్ చిత్రమాలికపారాచూట్ మూలాలుపారాచూట్ ఇతర లింకులుపారాచూట్గొడుగువిమానం

🔥 Trending searches on Wiki తెలుగు:

కాళోజీ నారాయణరావుసరోజినీ నాయుడుఅబ్యూజామఖ నక్షత్రముఅన్నమయ్యశక్తిపీఠాలునీతి ఆయోగ్పల్లెల్లో కులవృత్తులురాగులుజైన మతంఆంధ్రప్రదేశ్జాతీయ రహదారి 44 (భారతదేశం)ఘట్టమనేని మహేశ్ ‌బాబువినాయక్ దామోదర్ సావర్కర్విడదల రజినిగురువు (జ్యోతిషం)ట్యూబెక్టమీభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థచేతబడిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆయుష్మాన్ భారత్వేయి శుభములు కలుగు నీకువేముల ప్ర‌శాంత్ రెడ్డికపిల్ సిబల్మెదడుపొడుపు కథలువిద్యుత్తుతెలుగు జర్నలిజంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారతీ తీర్థఉండవల్లి శ్రీదేవిసమాచార హక్కుఅశ్వని నక్షత్రముబొల్లితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శ్రీ కృష్ణుడుభారతదేశంమాల (కులం)రక్తంఅండాశయముకర్కాటకరాశిఆరుద్ర నక్షత్రముభారత ప్రధానమంత్రులుజొన్నఆర్యవైశ్య కుల జాబితాతెలుగు కులాలుదళితులుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుసోషలిజంతెలుగు అక్షరాలుగోదావరిఘంటసాల వెంకటేశ్వరరావుశ్రీకాళహస్తివృశ్చిక రాశిదేశ భాషలందు తెలుగు లెస్సజాతీయ సమైక్యతఎర్రచందనంరష్యాయూరీ గగారిన్అగ్నిపర్వతంనెట్‌ఫ్లిక్స్చంద్రబోస్ (రచయిత)గోపరాజు సమరంవాతావరణంఆదిరెడ్డి భవానిదత్తాత్రేయనిఖత్ జరీన్హిందూధర్మంసముద్రఖనియేసు శిష్యులుఆఫ్రికాతెలంగాణకు హరితహారంచరవాణి (సెల్ ఫోన్)కాళిదాసుతెనాలి రామకృష్ణుడుఉగాదిభారత స్వాతంత్ర్యోద్యమంనామనక్షత్రముజనాభా🡆 More