దక్షిణార్ధగోళం

భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భూభాగమే దక్షిణార్ధగోళం.

ఐదు ఖండాల భాగాలు (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు (హిందూదక్షిణ అట్లాంటిక్దక్షిణ మహా సముద్రందక్షిణ పసిఫిక్) ఓషియానియా లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.

దక్షిణార్ధగోళం
పసుపు రంగులో దక్షిణార్ధగోళం - అంటార్కిటికాను చూపించలేదు
దక్షిణార్ధగోళం
దక్షిణ ధ్రువం పై నుండి దక్షిణార్ధగోళం
దక్షిణార్ధగోళం
"ఉషుయా, ప్రపంచానికి చివర" అనే పురాణంతో పోస్టర్. అర్జెంటీనాలోని ఉషుయా ప్రపంచంలో అత్యంత దక్షిణ కొసన ఉన్న నగరం.

భూపరిభ్రమణ తలం నుండి భూమి అక్షం వంగి ఉన్న కారణంగా దక్షిణార్థగోళంలో వేసవికాలం డిసెంబరు నుండి మార్చి వరకు, శీతాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకూ ఉంటాయి. క్యాలెండరు సంవత్సరానికి, సెప్టెంబరు 22 / 23 తేదీన వసంత విషువత్తు, మార్చి 20 / 21 న శరద్ విషువత్తు తటస్థిస్తాయి. దక్షిణ ధ్రువం దక్షిణార్థగోళానికి మధ్యలో ఉంటుంది. 

లక్షణాలు

దక్షిణార్థగోళంలోని శీతోష్ణస్థితులు, అదే ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న ఉత్తరార్థగోళంలోని ప్రాంతాలతో పోలిస్తే తక్కువ తీవ్రంగా ఉంటాయి. అయితే అంటార్కిటికాలో మాత్రం, ఆర్కిటిక్ కంటే చలి తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం, దక్షిణార్థగోళంలో నేల కంటే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.

దక్షిణార్ధగోళం 
న్యూజీలాండ్ లో కనిపించే అరోరా ఆస్ట్రాలిస్

దక్షిణార్ధగోళంలో సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ఉత్తరం గుండా ప్రయణిస్తాడు. మకరరేఖకు, భూమధ్య రేఖకూ మధ్య ప్రాంతంలో సూర్యుడు నడినెత్తినగానీ కొద్దిగా దక్షిణంగా గానీ ఉంటాడు. సూర్యుడి కారణంగా ఏర్పడిన నీడలు అపసవ్యదిశలో తిరుగుతూంటాయి. నీడగడియారంలో గంటలు అపసవ్యదిశలో పెరుగుతూంటాయి. మకరరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం నుండి సూర్యగ్రహణాలను పరిశీలిస్తే, సూర్యుడి నేపథ్యంలో చంద్రుడు ఎడమ నుండి కుడికి కదులుతూ కనిపిస్తాడు. ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి చూస్తే, చంద్రుడు కుడి నుండి ఎడమకు కదులుతూ కనిపిస్తాడు.

కొరియోలిస్ దృగ్విషయం కారణంగా దక్షిణార్ధగోళంలో తుపానులు సవ్యదిశలో తిరుగుతూంటాయి.

దక్షిణార్ధగోళంలోని సమశీతోష్ణ ప్రాంతం దాదాపు పూర్తిగా సముద్రమే. ఈ ప్రాంతంలో ఉరుగ్వేలెసోతోస్వాజీల్యాండ్న్యూజీలాండ్చిలీలో చాలా భాగం, అర్జంటైనాపరాగ్వేలో కొంత భాగం, బ్రెజిల్నమీబియా, బోట్స్‌వానా, మొజాంబిక్, మడగాస్కర్ ఉన్నాయి.

జనాభా

దక్షిణార్థగోళంలో 80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది భూమ్మీది మొత్తం జనాభాలో 11% మాత్రమే. ఇక్కడ నేల చాలా తక్కువ ఉండడమే దీనికి కారణం.

ఖండాలు

మూలాలు

Tags:

దక్షిణార్ధగోళం లక్షణాలుదక్షిణార్ధగోళం జనాభాదక్షిణార్ధగోళం ఖండాలుదక్షిణార్ధగోళం మూలాలుదక్షిణార్ధగోళంఅట్లాంటిక్ మహాసముద్రంఓషియానియాదక్షిణ మహాసముద్రంపసిఫిక్ మహాసముద్రంభూమధ్య రేఖహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

పడమటి కనుమలుకోణార్క సూర్య దేవాలయంజ్యేష్ట నక్షత్రంఆనందవర్ధనుడుఖోరాన్తెలుగు కవులు - బిరుదులుప్రాకృతిక వ్యవసాయంతెలుగు నాటకంరౌద్రం రణం రుధిరంసుమతీ శతకముఅజర్‌బైజాన్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవిశ్వబ్రాహ్మణమార్చి 28పుష్పంమంచు విష్ణుఉప రాష్ట్రపతిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావసంత ఋతువురామాయణంరక్తహీనతకల్వకుంట్ల కవితపుష్యమి నక్షత్రముహెపటైటిస్‌-బిభారత స్వాతంత్ర్యోద్యమంకుమ్మరి (కులం)కాళేశ్వరం ఎత్తిపోతల పథకంవిష్ణువు వేయి నామములు- 1-1000భారతదేశంభౌతిక శాస్త్రంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురాశిపురుష లైంగికతచిరంజీవి నటించిన సినిమాల జాబితాజీమెయిల్గోధుమతెలంగాణ నదులు, ఉపనదులుమఖ నక్షత్రముఆతుకూరి మొల్లఫ్లిప్‌కార్ట్మహారాష్ట్రఇస్లాం మతంతమలపాకువిద్యుత్తుకర్ణాటక యుద్ధాలువీర్యంఇత్తడిభారత రాష్ట్రపతులు - జాబితారోహిణి నక్షత్రంపల్నాటి యుద్ధంభారతదేశంలో విద్యఆపిల్భారతదేశ ఎన్నికల వ్యవస్థమసూదచిత్తూరు నాగయ్యకల్పనా చావ్లానవరసాలుతాజ్ మహల్సంధ్యారాణి (నటి)జనాభారాధిక శరత్‌కుమార్మకరరాశిసలేశ్వరంఇందిరా గాంధీఆటవెలదిభీష్ముడువడ్రంగిసిరివెన్నెల సీతారామశాస్త్రిగజేంద్ర మోక్షంపసుపు గణపతి పూజఇన్‌స్టాగ్రామ్జాతీయములుమొదటి పేజీచార్మినార్తెలుగు నెలలుసత్యనారాయణ వ్రతంకలబంద🡆 More