తులారాశి: రామ్

తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు.

తులారాశి వారి గుణగణాలు

జీవితములో ప్రారంభములో ఎదురైన అపజయాలకు క్రుంగి పోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పారు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడములో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యొగ, వ్యాపార, వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్థులని అభివృద్ధి చేస్తారు. అనువంశికముగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళా, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయములో అదృష్టము కలసి వస్తుంది. జీవితములో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంముగా నిలుస్తారు. బంధు వర్గముతొ విభేదాలు దీర్ఘ కాలము కొనసాగుతాయి. ఏ విషయములో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురుకి మాత్రము అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్ధతులు పొవు. అత్మీయులతో విబెధాలు వస్తాయి. గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్ధశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది. జీవితములో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకము ఔతారు. వైరి వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చెయ్యక స్వజనుల అసమ్మతికి తగిన కాణనము కనుగొనడములో విఫలము ఔతారు. ఉన్నత స్థానములో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలౌతాయి. ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితములో ప్రాధాన్యత సంతరించికోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వాచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్ర మైఢ్యమి కాలములో జాగ్రత్త వహించడము మంచిది. ప్రజాబలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి.దీపావళి నాడు చేసే లక్ష్మీ పుజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకెతిక పరిజ్ఞానము, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యములో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు.

గ్యాలరీ

తులారాశి కొన్ని జ్యోతిష విషయాలు

రాశి చక్రంలో ఈ రాశి ఏడవది. ఈ రాశిని పురుష రాశి గాను, విషమ రాశిగానూ, క్రూర రాశిగానూ, అశుభరాశి గానూ, చర రాశిగానూ, బేసి రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం వాయు తత్వం, శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, జాతి వైశ్యజాతి, అధిపతి శుక్రుడు. సూర్యుడు ఈ ర్శిలో నీచ స్థితిని పొందుతాడు. ఉదయం శీర్షోదయం, పాదజల తత్వం, జీవులు మానవులు, దిక్కులు పడమర, వర్ణం నీల వర్ణం, పరిమాణం దీర్ఘం, ప్రకృతి వాత ప్రకృతి, సంతానం అల్పం.

  • నిరయన రవి ప్రవేశం సెప్టంబర్ పదహేను.
  • ఈ రాశిలో పది డిగ్రీలలో రవి నీచను పొందుతాడు.
  • ఈ రాశిలో ఇరవై డిగ్రీలలో శని పరమోచ్ఛను పొందుతాడు.
  • ఈ రాశి వారి వృత్తులు వ్యాపారం, న్యాయశాలలు, భోజన శాలలు.
  • ఈ రాశి ప్రదేశములు పట్టాణములు, దుకాణములు.
  • ఈ రాశివారికి అనారోగ్య సూచన ఏడు, ఎనిమిది, పన్నెండు, ఇరవై.
  • ఈ రాశి వారి గుణగణాలు సుఖములు అనుభవించుట, సమాజంలో గుర్తింపు, పెద్దల ఎడ గౌరవం, సమాజంలో గుర్తింపు, పాండిత్యం, కళాభిమానం, కళత్రం మీద అభిమానం, ద్వికళత్రం, దానగుణం, వ్యాపారం చేసి ధనార్జన మొదలైన ప్రత్యేక గుణాలు.
  • జాతీయంగా అన్నవరం అరకు, అస్కా, అంబికాపుర్, అజంఘర్, బొబ్బిలి, భవాని, పాట్నా, బొలంగీర్, చీపురుపల్లె, ధోల్ పురు, ఘాజీ పురు, గోపల్ గంజ్, గోరఖ్ పూర్,

ఇచ్ఛాపురం, కోరాపుట్, నర్సీ పట్నం, నరసరావు పేట, పిఠాపురం, పాడేరు, పాతపట్నం, పురాబానీ, పార్వతీపురం, పదం పూర్, పర్లాకిమిడి, పులాబానీ, రూర్స్ గూడా, రాయఘర్, శృంగవరపుకోట, సాలూరు, సోంపేట, తుని, విశాఖపట్నం, తుని, సంబల్ పూర్, శృంగరపు కోట, సుందరఘర్, విజయనగరం, వారణాశి మొదలనవి ఈ రాశి ప్రదేశాలు.

  • అంతర్జాతీయంగా అర్జెంటీనా, చైనా, బత్మా, ఫ్రాంక్ ఫర్ట్, లిబియా, వియన్నా, పోర్చ్ గల్, విసోనియా, సవోల్ ఈ రాశి ప్రదేశాలు.
  • హెర్నియా, వరబీజం, కీళ్ళవాతం నడుము నొప్పికి తులారాశి కారకత్వం వహిస్తుంది.

వనరులు

Tags:

తులారాశి వారి గుణగణాలుతులారాశి గ్యాలరీతులారాశి

🔥 Trending searches on Wiki తెలుగు:

ముదిరాజ్ (కులం)చతుర్యుగాలునానార్థాలుసుందర కాండరజాకార్పూరీ జగన్నాథ దేవాలయంకెనడాకె. అన్నామలైవారాహితిరుపతివిద్యనీతి ఆయోగ్రాశి (నటి)క్రిక్‌బజ్కొల్లేరు సరస్సుసర్వే సత్యనారాయణజే.సీ. ప్రభాకర రెడ్డివర్షం (సినిమా)భారత రాజ్యాంగంహనుమంతుడుకొబ్బరిరవీంద్రనాథ్ ఠాగూర్కర్ణుడుసూర్య (నటుడు)ఎయిడ్స్జూనియర్ ఎన్.టి.ఆర్రుక్మిణి (సినిమా)భారతదేశ సరిహద్దులుబాలకాండదశదిశలుగురుడుసర్పిశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంవేంకటేశ్వరుడుభారత జాతీయ చిహ్నంషాబాజ్ అహ్మద్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితారఘురామ కృష్ణంరాజుఆవుపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపిత్తాశయముబ్రహ్మంగారి కాలజ్ఞానంరమణ మహర్షిLవిజయవాడపాడ్కాస్ట్శాసనసభజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాబి.ఎఫ్ స్కిన్నర్వై.యస్. రాజశేఖరరెడ్డిబలి చక్రవర్తిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుజాతీయములుసౌందర్యనానాజాతి సమితిరాయప్రోలు సుబ్బారావుసప్తర్షులుతులారాశికన్యారాశియువరాజ్ సింగ్మిథాలి రాజ్రావి చెట్టుతెలుగు సినిమాలు డ, ఢపాలకొండ శాసనసభ నియోజకవర్గంసిద్ధు జొన్నలగడ్డరామప్ప దేవాలయంఅంగుళంఆవేశం (1994 సినిమా)యతిరతన్ టాటాకీర్తి సురేష్తమన్నా భాటియాభారత జాతీయ మానవ హక్కుల కమిషన్సంధ్యావందనంగరుడ పురాణం🡆 More