గోళ్ళమూడి రత్నమ్మ

గోళ్ళమూడి రత్నమ్మ స్వాతంత్ర్య సమర యోధురాలు.

గోళ్ళమూడి రత్నమ్మ
జననం1886
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలు
తండ్రివాసిరెడ్డి సాంబయ్య,
తల్లిపార్వతమ్మ

బాల్యం, విద్య

గోళ్ళమూడి రత్నమ్మ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలు గ్రామములో ఒక సంపన్న కర్షక కుటుంబములో వాసిరెడ్డి సాంబయ్య, పార్వతమ్మ దంపతులకు 1886లో జన్మించింది. బాల్యంలో చదువు పట్ల అమిత శ్రద్ధ చూపింది. ఆనాడు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. అదీగాక వాసిరెడ్డి వారింట్లో ఘోషా పద్ధతి ఉండేది. అయినా తల్లిదండ్రులు రత్నమ్మ చదువుకోడానికి సహకరించారు.

స్వాతంత్ర పోరాటం లో

1921లో మహాత్మా గాంధీ స్వరాజ్య యాత్ర చేస్తూ చేబ్రోలు వచ్చాడు. గాంధీజీ ఉపన్యాసాలు విన్న తను కూడా దేశసేవలో నిమగ్నమవ్వాలనుకుంది. రాట్నం వడకడం, నూలు తయారు చేయడం, ఖాదీ ధరించడం మొదలు పెట్టింది. 1928లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు వెళ్ళింది. 1930లో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొంది. ఈమెను విప్లవ వనితగా భావించి బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి పలు నేరాలు ఆరోపించారు. ఆరు నెలల కారాగార శిక్ష వేశారు. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వల్ల జైలు నుండి విడుదలై, తన ప్రచార కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేసింది.

1932లో శాసనోల్లంఘనం, పికెటింగ్ కారణంగా ఆమెను అరెస్ట్ చేసి వదిలారు. మళ్ళీ కొంత మంది స్త్రీలతో కలిసి సత్యాగ్రహం చేసింది. పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపి ఆరు నెలలు కఠిన కారగార శిక్ష విధించారు. ఆంధ్ర మహిళా సభ 1935లో గుంటూరులో జరిగింది. ఈ సభకు రత్నమ్మ అధ్యక్షత వహించింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం వారు రత్నమ్మను మహిళా దళాధిపతులకు ప్రధాన నేతగా నియమించారు. రత్నమ్మ మహిళలను కూడగట్టుకొని ఎలా శాసనధిక్కారం చేయగలదో గ్రహించిన ప్రభుత్వం ఆమెను మరలా అరెస్ట్ చేసి పది నెలలు జైలు శిక్ష విధించింది.

1936లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరు జిల్లా బోర్డుకు అత్యధిక మెజారీటీతో గెలిచింది. 1939లో పొన్నూరు నియోజకవర్గం నుండి గుంటూరు జిల్లా బోర్డుకు గెలుపొంది పార్టీ గౌరవం కాపాడింది. 1939లో చేబ్రోలులో మహిళా గ్రంథాలయం స్థాపించింది. అలాగే 1940లో స్త్రీలకు ప్రత్యేకముగా హిందీ విద్యాలయం స్థాపించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమములో మరలా అరెస్ట్ అయ్యింది. 1944 జనవరి 26న స్వతంత్రదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. 1945లో చేబ్రోలులో ఆంధ్రరాష్ట్ర మహిళా రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

షాబాజ్ అహ్మద్అశోకుడురాజంపేటఇంటి పేర్లుసామజవరగమనవిచిత్ర దాంపత్యంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంమహామృత్యుంజయ మంత్రంకుటుంబంరాయలసీమవడ్డీతెలంగాణ రాష్ట్ర సమితిబొడ్రాయితెలుగు సినిమాలు 2024తోట త్రిమూర్తులుభద్రాచలంఉత్తర ఫల్గుణి నక్షత్రముభారత జాతీయ మానవ హక్కుల కమిషన్నాగార్జునసాగర్మంజుమ్మెల్ బాయ్స్జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థమహమ్మద్ సిరాజ్లోక్‌సభదూదేకులసీ.ఎం.రమేష్సాలార్ ‌జంగ్ మ్యూజియంవిరాట పర్వము ప్రథమాశ్వాసముఘట్టమనేని కృష్ణఆతుకూరి మొల్లఅంగుళంరమణ మహర్షివినాయక చవితిసజ్జల రామకృష్ణా రెడ్డికర్కాటకరాశితెలుగు సినిమాల జాబితాతీన్మార్ సావిత్రి (జ్యోతి)బొత్స సత్యనారాయణపెరిక క్షత్రియులురాహుల్ గాంధీకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)వృశ్చిక రాశి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివరలక్ష్మి శరత్ కుమార్దానం నాగేందర్కుంభరాశికస్తూరి రంగ రంగా (పాట)హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఎయిడ్స్కమల్ హాసన్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాతాటి ముంజలురామప్ప దేవాలయంఅనూరాధ నక్షత్రంఉపనయనముపుష్యమి నక్షత్రమువిశ్వబ్రాహ్మణఅక్కినేని నాగ చైతన్యనువ్వొస్తానంటే నేనొద్దంటానాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభారతదేశంలో కోడి పందాలుయానిమల్ (2023 సినిమా)నామనక్షత్రముపచ్చకామెర్లుక్రిమినల్ (సినిమా)ఐడెన్ మార్క్‌రమ్సంస్కృతంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాశివుడురాజంపేట శాసనసభ నియోజకవర్గంనందమూరి తారక రామారావుసన్నాఫ్ సత్యమూర్తిపెళ్ళిపది ఆజ్ఞలుగొట్టిపాటి రవి కుమార్తిరుమల🡆 More