గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు

తెలుగువారికి అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ.కొత్తగా పంటలు చేతికొచ్చిన సందర్భంగా ఆనందంతో రైతులు జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తుంది కనుక దీన్ని రైతుల పండుగ అని అని పిలుస్తారు.పండగ మూడు రోజులు తెలుగు పల్లెలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.రకరకాల జానపద వినోద కళాకారులు వీధులు పండగ వాతావరణం కనిపిస్తోంది.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
గోదావరి జిల్లాల సంక్రాంతి లోగో
రకంహిందువుల పండుగ
ప్రాముఖ్యతసంక్రాంతి 3రోజుల పండుగ.
ముగింపు17 బుధవారం
2024 లో జరిపే తేదీఆదివారం, 14 జనవరి
ఉత్సవాలు
  • భోగి మంటలు,
  • కోడి పందాలు,
  • జాతరలు,
  • పిండి వంటలు,
  • అలంకరణలు,
  • ఇంటికి రావడం,
  • ఊరేగింపులు.
సంబంధిత పండుగ
ఆవృత్తిసంవత్సరం
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
డూడూ బసవన్న
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
అమలాపురంలో గంగిరెద్దులు

ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు కర్నాటక రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారుముఖ్యంగా గోదావరి జిల్లాల్లు అయిన తూర్పు,పశ్చిమలో సంప్రదాయ రీతిలో ఉంటాయి.సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఏటా బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
అమలాపురం సంక్రాంతి సంబరాల్లో పాఠశాలలో ఒక బాలుడు హరిదాసు వేషం

గోదావరి జిల్లా ప్రత్యేకత

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు 
సంక్రాంతి సంబరాల్లో అమలాపురంలో ముగ్గుల పోటీలు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు 
సంక్రాంతి రంగవల్లి

సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాలకు ప్రత్యేకత ఉంది.సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు.గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహించడం ఎన్నో వేల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇవి చట్టవిరుద్దమని తెలిసినా, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కోళ్ళ పందేలు మాత్రం ప్రతి ఏటా నిర్వహిస్తారు. పందేల పేరుతో కోట్లు చేతులు మారుతుంటాయి.సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలు ఆకర్షణగా నిలుస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం,కాకినాడ,రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు.పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం తణుకు ఆచంట, ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. భీమవరం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం, కోనసీమ వస్తుంటారు.

కోడిపందేలు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు 
గోదావరి జిల్లాల్లో కోడి పందానికి సిద్ధంగా ఉన్న పుంజు

సంక్రాంతి సందర్భంగా ఈ పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భీమవరం, అమలాపురం ప్రాంతాన్ని కోడిపందేల బెట్టింగ్ హబ్‌గా అభివర్ణిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగే కోడిపందేలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150 కోట్లు చేతులు మారుతుందని అంచనా.ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి సుమారు 250 కోట్ల రూపాయల మొత్తంలో పందేలు సాగుతాయన్నది ఆయన అంచనా.పందేలు నిర్వహించే ప్రాంతాన్ని బరి అంటారు. ఈ బరులు గోదావరి జిల్లాల్లోనే సుమారుగా 400 వరకూ ఏర్పాటవుతాయి.గోదావరి జిల్లాల్లో ఏటా సంక్రాంతి సందర్భంగా కోడిపందాల నిర్వహణే వృత్తిగా మార్చుకున్న వారు కూడా కొందరున్నారు.పందాలకు అనుగుణంగా కోళ్లను సిద్ధం చేయడం, వాటికి శిక్షణ, పందాల్లో కాళ్లకు కట్టే కత్తుల తయారీ లాంటి పనులనే ఉపాధిగా మార్చుకున్న కుటుంబాలు వందల్లో ఉన్నాయి.కోడిపందాల చట్టవిరుద్ధమని కోర్టులు చెపుతున్నాయి. పోలీసులు కూడా సంక్రాంతి ముందు వరకూ కోడిపందాల నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తారు. కానీ పండగ మూడు రోజులు యథేచ్ఛగా పందేలు జోరుగా జరుగుతాయి.

ఇతర జాతరలు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు 
జగ్గన్నతోట ప్రభల తీర్థం
  • కోనసీమ ప్రాంతంలో కనుమ రోజున జరిగే అరుదైన వేడుక ప్రభల తీర్థం. కోనసీమలో 120 గామ్రాల్లో నిర్వహించే ఈ ప్రభల తీర్థానికి పలు గ్రామాల నుంచి ప్రభలను యువకులు ఆయా తీర్థ జరిగే ప్రదేశాలు తీసుకువచ్చి ఆనందంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కోనసీమ ప్రాంతంలోని ఎటువంటి గుడిగోపురం లేకుండా జరిగే ఏకాదశ రుద్రుల కలయిక అంబాజీపేట మండలం మొసలపల్లి పరిధిలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం.ఈ ఉత్సవంలోకి మరో ప్రత్యేక ఆకర్షణగా గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి ప్రభలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు.ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
  • కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండురోజులపాటు ఈ వేడకలు ఇక్కడి ప్రజలు జరుపుతారు.12 ప్రభలు కొత్తపేట పురవీధుల్లో ఊరేగించి అనంతరం స్థానిక హైస్కూల్‌ మైదానంకు ప్రభలు తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చారు.ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది జనాలు తరలి వస్తారు.
  • భీమవరం గ్రామ దేవత మావుళ్లమ్మ సంబరాలు కూడా సంక్రాంతి సమయంలో ఉత్సాహంగా జరుగుతాయి.నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో అనేక భజనలు, నాటకాలు, ఆర్కెస్ట్రాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వంహించడమే కాక తెలుగు సినీ, నాటక రంగ ప్రముఖలను వారు అందించిన కళమ్మ తల్లి సేవలను గుర్తించి సన్మానాలు జరుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని నలుమూలలనుండి భక్తులు ఏటా లక్షల్లో వచ్చి అమ్మ వారి సేవలో తరిస్తారు.

నిషేధం

జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం 1960 ను అమలు చేసినప్పటి నుండి భారతదేశంలో కోడిపందాలు చట్టవిరుద్ధం. 2015 లో భారత అత్యున్నత న్యాయస్థానం,, 2016 లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కోడిపందాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వాలకు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2018 జనవరిలో సుప్రీం కోర్ట్ కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతించింది. నిషేధం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు ఇప్పటికీ జరగుతున్నాయి. దీనిలో పందాల మొత్తం 2019లో ₹ 900 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్రంలో పందాలకు 200,000 కోడిపుంజులు వాడుతున్నట్లుగా అంచనా వేశారు. కోడి పందాల అడ్డుకునేందుకు పందే నిర్వహించే చోట పోలీసుల దాడులు చేస్తున్నారు.కానీ సంక్రాంతి సంప్రదాయం కాబట్టి ఆడి తీరతామని అంటున్నారు.పండుగ సమయంలో కోడి పందాలు కాకుండా, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు.ఫంక్షన్ హాల్స్, తోటలు వంటి ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తే వాటి యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.2022లో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు ఉపయోగించే సుమారు 9 వేల 600 కోడికత్తులను పోలీసులు సీజ్ చేశారు.

అశ్లీల నృత్యాలు

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.పెద్ద ఎత్తున కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల మొదలై అర్ధరాత్రి దాటేసరికి అశ్లీల నృత్యాలు గా మారుతాయి.గ్రామాలలో అడ్డుఅదుపు లేకుండా అర్థరాత్రి యధేచ్చగా అశ్లీల నృత్యాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ప్రయాణ సౌకర్యాలు

పల్లెలో ఉండే ప్రజలు జీవన ఉపాధి కోసం పట్నాలు వెళ్ళిపోతూ ఉంటారు.సంక్రాంతి పండుగకు సొంత వాళ్లకు తిరిగి వస్తారు.సంక్రాంతి సంబరాలకు వచ్చేవారికోసం డిసెంబర్ మధ్య నుంచే భీమవరం,అమలాపురం,కాకినాడ,రాజమహేంద్రవరం బస్సు రిజ్వేషన్లు,హోటళ్లకు రిజర్వేషన్లు మొదలవుతాయి.సంక్రాంతి సమయంలో సరదాగా గడపడానికి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ,తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అమలాపురం, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం ,నరసాపురం ప్రాంతాలకు సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుస్తాయి.దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు గోదావరి జిల్లా ప్రత్యేకతగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు కోడిపందేలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు ఇతర జాతరలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు నిషేధంగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు అశ్లీల నృత్యాలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు ప్రయాణ సౌకర్యాలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు మూలాలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు వెలుపలి లంకెలుగోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలుతెలుగుసంక్రాంతి

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంలో కోడి పందాలుబాపట్ల శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ప్రకృతి - వికృతిఛత్రపతి (సినిమా)శ్రీకాకుళం జిల్లాట్యూబెక్టమీఅనుష్క శెట్టికన్నెగంటి బ్రహ్మానందంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాభగవద్గీతకొండా సురేఖసంక్రాంతిఇన్‌స్టాగ్రామ్తెలుగు సినిమాల జాబితావై.యస్.అవినాష్‌రెడ్డిఅష్టదిగ్గజములుపార్లమెంటు సభ్యుడులలితా సహస్ర నామములు- 1-100అడాల్ఫ్ హిట్లర్చిలుకూరు బాలాజీ దేవాలయంరావి చెట్టుజాతిరత్నాలు (2021 సినిమా)అమ్మఆ ఒక్కటీ అడక్కుA2024 భారత సార్వత్రిక ఎన్నికలువర్షిణికొణతాల రామకృష్ణసావిత్రి (నటి)శుక్రుడుపవన్ కళ్యాణ్నాన్నకు ప్రేమతోమలేరియాసింహరాశినువ్వు నేనుసున్తీసదాసరస్వతిఏనుగు లక్ష్మణ కవిమండల ప్రజాపరిషత్అజిత్ అగార్కర్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపూనమ్ కౌర్ఉజ్జయిని శక్తిపీఠ దేవాలయంసింధు లోయ నాగరికతకన్యారాశిఅన్నమయ్యస్టాక్ మార్కెట్నందమూరి బాలకృష్ణఅంగారకుడు (జ్యోతిషం)పరశురాముడునమ్రతా శిరోద్కర్రాశి సింగ్పుష్ప -2త్రిఫల చూర్ణంగోత్రాలునక్షత్రం (జ్యోతిషం)భారతదేశ ఎన్నికల వ్యవస్థఆది శంకరాచార్యులుజామీ లివర్ముద్రగడ పద్మనాభంఅనంతపురంతెలంగాణ గవర్నర్ల జాబితావేయి స్తంభాల గుడిచేతబడిగాయత్రీ మంత్రంభారత రాజ్యాంగ పరిషత్వట్టివేరుగోవిందుడు అందరివాడేలేవాల్మీకినీరురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంగ్లోబల్ వార్మింగ్దసరానల్లేరుసొర కాయతెలుగు సినిమాలు డ, ఢ🡆 More