కస్తూరి మురళీకృష్ణ: తెలుగు రచయిత

కస్తూరి మురళీకృష్ణ తెలుగు రచయిత.

విస్తృతమైన రచనా సంవిధానాల్లో[అస్పష్టంగా ఉంది], విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.

కస్తూరి మురళీకృష్ణ
కస్తూరి మురళీకృష్ణ: వ్యక్తిగత జీవితం, రచన రంగం, దృక్పథం
కస్తూరి మురళీకృష్ణ
జననంకస్తూరి మురళీకృష్ణ
10-01-65 /జనవరి 10, 1965
షక్కర్ నగర్, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా
ఇతర పేర్లునీలిమ, సూరజ్, లక్ష్మీలత, నీరజ్, శ్రీమాన్ సత్యవాది, పల్లవ్
వృత్తిరైల్వే ఉద్యోగి
ప్రసిద్ధితెలుగు రచయిత,తెలుగు సాహితీకారులు
మతంహిందూ
పిల్లలునాగసంధ్యాలక్ష్మీ
తండ్రికె. సూర్యనారాయణ రావు
తల్లికె. సత్యవతి
వెబ్‌సైటు
www.kasturimuralikrishna.com
కస్తూరి మురళీకృష్ణ: వ్యక్తిగత జీవితం, రచన రంగం, దృక్పథం
కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన పుస్తకాలు

వ్యక్తిగత జీవితం

మురళీకృష్ణ 1965 జనవరి 10 తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, శక్కర్ నగర్ గ్రామంలో కస్తూరి సూర్యనారాయణరావు, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం బోధన్, హైదరాబాదులలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి భూగర్భశాస్త్రంలో ఎం.ఎస్.సి, దూరవిద్య ద్వారా తత్త్వశాస్త్రంలో ఎం.ఎ., రష్యన్ భాషలో అడ్వాన్స్‌డ్ డిప్లమాలను సాధించాడు. వీరికి ప్రపంచ సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ వుంది. మురళీకృష్ణ తొలి రచన 1991 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన మృగతృష్ణ అనే కథ. ప్రస్తుతం ఈయన దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్నాడు.

రచన రంగం

తెలుగు సాహిత్యంలో ఉన్న వీలైనన్ని ప్రక్రియలలో రచనలు చేసారు.[అస్పష్టంగా ఉంది]విభిన్నాంశాలపై రచనలు చేస్తున్నాడు. ఈయన ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త, నవ్యవీక్లీ పత్రికలకు నవలలు కథలతోపాటు మరెన్నో శీర్షికలు వ్రాసాడు. అలాగే కాల్పనికేతర రచనలు కూడా చేసాడు. ఇవి కాక టివి స్స్రిప్టు రాస్తున్నాడు. అసిధార, అంతర్మధనం, మర్మయోగం, సౌశీల్య ద్రౌపది, శ్రీకృష్ణదేవరాయలు, పునఃసృష్టికి పురిటినొప్పులు, రోషనారా, ముస్సోలిని మొదలైన నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. జీవితం – జాతకం, 4 x 5, రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ కథలు, ఉజ్వల భారత మహోజ్వల గాథలు, క్రైమ్‌ స్టోరీస్ వంటి కథా సంపుటాలు వెలువరించాడు. రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు వంటి కథా సంకలనాలకు సహ సంపాదకుడుగా వ్యవహరించాడు. భారతీయ తత్వ చింతన, మన ప్రధాన మంత్రులు, మన ముఖ్య మంత్రులు , భారతీయ వ్యక్తిత్వ వికాసం, తీవ్రవాదం, పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్, అక్షరాంజలి, శైశవగీతి, నవల నుండి సినిమాకు, పాడుతా తీయగా మొదలైనవి పుస్తక రూపంలోకి వచ్చిన కాల్పనికేతర రచనలు. ఇవికాక, పలు పత్రికలలో పవర్ పాలిటిక్స్, సినీచిత్రాలు, సగటు మనిషి స్వగతం, వ్యంగ్యాస్త్రం, ప్రాచీన విజ్ఞానం, మ్యూజికల్ మ్యూజింగ్స్ వంటివి ఈయన రాసిన శీర్షికలు. కస్తూరి ప్రచురణలు అనే సంస్థను స్థాపించి ఉత్తమ సాహిత్యాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నాడు.

దృక్పథం

ఈయన రచనలపై, సాహిత్య దృక్పథంపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం కనిపిస్తుంది.[ఆధారం చూపాలి] తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలూ, విభాగాలలో రచనలు చేయాలనేది మురళీకృష్ణ సంకల్పం.[ఆధారం చూపాలి] ఈ క్రమంలోనే వైవిధ్యభరితమైన రచనలు చేశాడు.

బహుమతులు, పురస్కారాలు

నవలలు

  1. అంతర్యాగం
  2. రోషనార
  3. ముస్సోలిని
  4. అసిధార
  5. అంతర్మధనం
  6. మర్మయోగం
  7. సౌశీల్య ద్రౌపది
  8. పునఃసృష్టికి పురిటి నొప్పులు
  9. శ్రీకృష్ణ దేవరాయలు

సంపుటాలు/సంకలనాలు

  1. జీవితం – జాతకం
  2. 4 x 5
  3. కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు
  4. రియల్ స్టోరీస్
  5. సైన్స్ ఫిక్షన్ కథలు
  6. ఆ అరగంట చాలు (తెలుగులో భయానక కథల తొలి సంపుటి)
  7. ఉజ్వల భారత మహోజ్వల గాథలు
  8. క్రైమ్‌ స్టోరీస్ (డిటెక్టివ్ శరత్ పరిశోధన కథలు)
  9. భారతీయ ప్రేమకథామాలిక
  10. రైలు కథలు (సహ సంపాదకత్వం)
  11. దేశభక్తి కథలు (సహ సంపాదకత్వం)
  12. క్రీడా కథ (సహ సంపాదకత్వం)
  13. కులం కథ (సహ సంపాదకత్వం)
  14. తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు (సహ సంపాదకత్వం)

సినిమా సంబంధ రచనలు

  1. పాడుతా తీయగా
  2. కమర్షియల్ క్లాసిక్స్
  3. నవల నుంచి సినిమా వరకు

కాల్పనికేతర రచనలు

  1. భారతీయ తత్వ చింతన
  2. మన ప్రధాన మంత్రులు
  3. మన ముఖ్య మంత్రులు
  4. 1857-మనం మరవ కూడని మహా యుద్ధం
  5. భారతీయ వ్యక్తిత్వ వికాసం
  6. తీవ్రవాదం
  7. పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్
  8. అక్షరాంజలి
  9. ప్రాచీన విజ్ఞానం
  10. నీలమతపురాణం

శీర్షికలు

  1. పవర్ పాలిటిక్స్
  2. సినీ సిత్రాలు
  3. సగటుమనిషి స్వగతం
  4. పాడుతా తీయగా
  5. ఏదయినా ఏమయినా
  6. కథాసాగరమథనం
  7. మ్యూజికల్ మ్యూజింగ్స్
  8. సంపూర్ణ జాతక కథలు
  9. కశ్మీర రాజతరంగిణి

మూలాలు

బయటి లింకులు

Tags:

కస్తూరి మురళీకృష్ణ వ్యక్తిగత జీవితంకస్తూరి మురళీకృష్ణ రచన రంగంకస్తూరి మురళీకృష్ణ దృక్పథంకస్తూరి మురళీకృష్ణ బహుమతులు, పురస్కారాలుకస్తూరి మురళీకృష్ణ నవలలుకస్తూరి మురళీకృష్ణ సంపుటాలుసంకలనాలుకస్తూరి మురళీకృష్ణ సినిమా సంబంధ రచనలుకస్తూరి మురళీకృష్ణ కాల్పనికేతర రచనలుకస్తూరి మురళీకృష్ణ శీర్షికలుకస్తూరి మురళీకృష్ణ మూలాలుకస్తూరి మురళీకృష్ణ బయటి లింకులుకస్తూరి మురళీకృష్ణతెలుగు

🔥 Trending searches on Wiki తెలుగు:

బైబిల్ఆల్ఫోన్సో మామిడి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుభగవద్గీతగైనకాలజీభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలున్యుమోనియావై.యస్. రాజశేఖరరెడ్డిబాదామిజవహర్ నవోదయ విద్యాలయంకిలారి ఆనంద్ పాల్ఆవర్తన పట్టికఉష్ణోగ్రతవరల్డ్ ఫేమస్ లవర్పాలకొండ శాసనసభ నియోజకవర్గంశ్రీకాళహస్తిఅమిత్ షాసప్త చిరంజీవులువంగా గీతడిస్నీ+ హాట్‌స్టార్విరాట్ కోహ్లివినాయక చవితిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకొబ్బరికుండలేశ్వరస్వామి దేవాలయంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అనుష్క శర్మనువ్వు నాకు నచ్చావ్పర్యావరణంవిడాకులునీతి ఆయోగ్చిరంజీవి నటించిన సినిమాల జాబితాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్వంకాయముదిరాజ్ (కులం)ఉస్మానియా విశ్వవిద్యాలయంధనూరాశిపి.సుశీలబైండ్లనవలా సాహిత్యముపరశురాముడుకల్వకుంట్ల చంద్రశేఖరరావుబమ్మెర పోతనజాంబవంతుడుచిరుధాన్యంశ్రీ కృష్ణుడుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిభూమా అఖిల ప్రియశాతవాహనులుదసరాశివుడునితిన్గౌతమ బుద్ధుడువై.యస్.భారతిఅంగుళంతెలుగు నాటకరంగంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుబొత్స సత్యనారాయణజాతిరత్నాలు (2021 సినిమా)భారత జాతీయ కాంగ్రెస్త్రిష కృష్ణన్కొణతాల రామకృష్ణవాస్తు శాస్త్రంయతిభారత ఎన్నికల కమిషనుదశరథుడుఇండియన్ ప్రీమియర్ లీగ్లలిత కళలురమణ మహర్షిరోహిత్ శర్మఅమర్ సింగ్ చంకీలారైలుభీమసేనుడుగున్న మామిడి కొమ్మమీదఆర్యవైశ్య కుల జాబితాబి.ఎఫ్ స్కిన్నర్రామదాసు🡆 More