ఏంజెల్ జలపాతం

ఏంజెల్ జలపాతం (పెమోన్ భాషలో కెరెపాకుపై మేరు అంటే లోతైన ప్రదేశంతో ఉన్న జలపాతం, లేదా పరాకుపే వేనా, అంటే ఎత్తైన ప్రదేశం నుండి పడటం) వెనిజులాలోని ఒక జలపాతం .

అది ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం, 979 m (3,212 ft) ఎత్తు కలిగి, 807 m (2,648 ft) లోతు దూకేటటు వంటిది. ఆ జలపాతం కనైమా నేషనల్ పార్క్ (స్పానిష్: Parque Nacional Canaima) లోని ఔయాన్టెపుయ్ పర్వతపు అంచుల నుండి క్రిందకు పడుతుంది. ఇది వెనిజులా లోని బోలివార్ రాష్ట్రంలోని గ్రాణ్ సబానా ప్రాంతంలో ఉన్న ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.

ఏంజెల్ జలపాతం
Salto Ángel
Kerepakupai Vená
ఏంజెల్ జలపాతం
Angel Falls, Bolívar State, Venezuela
ఏంజెల్ జలపాతం is located in Venezuela
ఏంజెల్ జలపాతం
Location in Venezuela
ప్రదేశంAuyán-tepui, Canaima National Park, Bolívar State, Venezuela
అక్షాంశరేఖాంశాలు5°58′03″N 62°32′08″W / 5.96750°N 62.53556°W / 5.96750; -62.53556
రకంPlunges
మొత్తం ఎత్తు979 m (3,212 ft)
బిందువుల సంఖ్య2
పొడవైన బిందువు807 m (2,648 ft)
ప్రపంచములో ఎత్తువారిగా ర్యాంక్1st

ఆ జలపాతం ఎత్తు ఎంత ఎక్కువంటే, అది నేలకు చేరకముందే, నీటిలో ఎక్కువ భాగంఆవిరైపోయి లేక ఒక పలుచని పొగమంచువలె బలమైన గాలుల ద్వారా వీస్తుంది. ఆ జలపాతం క్రింది భాగం కెరెప్ నదికి నీరు అందించగా ఆ నీరు కరోవా నది యొక్క ఉపనది అయిన చురుణ్ నదిలోకి ప్రవహిస్తుంది.

ఎత్తైన ఆకారం 979 m (3,212 ft)లో ముఖ్య భాగమైన జలపాతం ఉన్నా కూడా అది నీరు దుమికే స్థలానికి దిగువలో ఉన్న దాదాపు 400 m (0.25 mi) లోని జారుడు ప్రవాహాలు, వేగవంతమైన ప్రవాహాలు, ఒక 30 m (98 ft) టాలుస్ వేగవంతమైన ప్రవాహాలు ఉంటాయి.

చరిత్ర

వ్యుత్పత్తి శాస్త్రం

ఇరవయ్యో శతాబ్దములో ఈ జలపాతం "ఏంజెల్ ఫాల్స్" అనే పేరుతో పిలవబడింది. జిమ్మీ ఏంజెల్ అనే ఒక అమెరికా దేశ ఏవియేటర్ తొలి సారిగా ఈ జలపాతం మీదగా ఒక విమానం నడిపాడు. అతని పేరు మీద ఈ జలపాతానికి ఏంజెల్ ఫాల్స్ అని పేరు పెట్టడం జరిగింది.

ఏంజెల్ యొక్క చితాభస్మాన్ని 1960 జూలై 2 జలపాతం మీదుగా అతని భార్య, కుమారులు, స్నేహితులు చల్లారు.

సాల్టో ఏంజెల్ అనే సాధారణ స్పానిష్ పేరు, ఇది అతని ఇంటిపేరు నుండి వచ్చింది. 2009 లో వెనుజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన మైలురాయి అయిన ఈ ప్రదేశానికి స్వదేశీయుడి పేరు ఉండాలనే కారణంతో స్వదేశీ పదమైన "పెమోన్" అని పేరు పెట్టాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. దీని అర్థం "లోతైన ప్రదేశం గల జలపాతం" పేరు మార్పును వివరిస్తూ ఛావెజ్, "ఇది మాది, ఏంజెల్ అక్కడికి రాకముందే ....... ఇది స్వదేశీ భూమి" అని చెప్పినట్లు తెలిసింది. ఏదేమైనా అతను తరువాత పేరు మార్పును సవాలు చేయనని, కానీ "కేరెపాకుపై వేనే" పేరు వాడకాన్ని మాత్రమే సమర్థిస్తున్నట్లు చెప్పాడు.

అన్వేషణ

ఏంజెల్ జలపాతం 
వర్షాపాతం లేని ఋతువులో ఏంజల్ జలపాతం.

సర్ వాల్టర్ రాలే ఒక టేపుయ్ (టేబుల్ టాప్ పర్వతం) ని గూర్చి వివరించి ఉండవచ్చు. ఆయనే ఏంజెల్ ఫాల్స్‌ను చూసిన తొలి ఐరోపా వాసి అని కూడా చెప్పబడుతుంది. కాని ఇది నిజానికి ఇది చాలా సత్య దూరం. జలపాతాన్ని సందర్శించిన తొలి ఐరోపావాసి ఫెర్నాండో దే బెర్రియో అని కొందరు చరిత్రకారులు చెపుతున్నారు. అతను స్పెయిన్‌కు చెందిన 16వ, 17వ శతాబ్దాల నాటి అన్వేషకుడు, గవర్నర్. తరువాత, వాస్తవానికి ఈ జలపాతాన్ని 1912లో ఎర్నెస్టో సాన్చేజ్ లా క్రూజ్ అనే వెనిజూలా అన్వేషకుడు చూశాడు. కాని అతను ఆ సంగతిని ప్రచురించలేదు.

1933 నవంబరు 16న అమెరికా విమాన చోదకుడు జిమ్మీ ఏంజెల్, విలువైన ఖనిజాల కొరకు అన్వేషిస్తున్నపపుడు ఈ జలపాతం పై నుండి విమానంలో వెళ్ళే వరకు ఇది బయట ప్రపంచానికి తెలియదు.

1937 అక్టోబరు 9 న తిరిగి వస్తున్నప్పుడు, మెటల్ ఎయిర్ క్రాఫ్టు కార్పరేషన్ ఫ్లమింగో వారి మోనోప్లేన్ ఎల్ రియో కరోని; ని ఆయన తెపుయి (టేబుల్ టాప్ పర్వతం) పైన దింపడానికి ప్రయత్నించాడు. కాని ఆ చిత్తడినేలలో విమాన చక్రాలు దిగబడి చెడిపోయాయి. తరువాత అతను, అతనితో పాటు ఉన్న ముగ్గురు, అతని భార్యతో సహా, నడుచుకుంటూ తెపుయి నుంచి దిగవలసివచ్చింది. తిరిగి జనాల మధ్య రావడానికి వారికి 11 రోజులు పట్టింది కాని వారి సాహస వార్త వేగంగా వ్యాపించి, ఆ జలపాతానికి అతని గౌరవార్ధం, ఏంజెల్ ఫాల్స్ అనే పేరు పెట్టబడింది.

కార్డోనా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, అమెరికన్ ఏవియేటర్ జిమ్మీ ఏంజెల్ ఒక విలువైన ధాతువు మంచం కోసం వెతుకుతున్నప్పుడు 16 నవంబర్ 1933 న విమానంలో వారిపైకి వెళ్లే వరకు వారు బయటి ప్రపంచానికి తెలియదు.

ఏంజెల్ వదిలి వేసిన విమానం తెపుయి పైనే 33 ఏళ్ళు ఉండిపోయింది. తరువాత హెలికాప్టర్ సహాయంతో దానిని తొలగించారు. ఆ విమానం మారకేలోని ఏవియేషన్ మ్యూజియంలో పెట్టబడింది. ప్రస్తుతం అది సియుడాడ్ బోలివర్ విమానాశ్రయం ముందు బయట ప్రదర్శించబడుతుంది.

ఏంజెల్ జలపాతం 
ఏంజెల్ జలపాతం వైమానిక దృశ్యం

ఈ జలపాతానికి నీళ్ళు అందించే నదిని చేరుకున్న తొలి పాశ్చాత్య దేశస్తుడు, అలేక్సండ్ర్స్ లైమే అనే లాత్వియా అన్వేషకుడు. స్థానిక పెమోన్ జాతి వారు ఇతన్ని అలెజాండ్రో లైమేగా కూడా పిలుస్తారు. అతను ఆయన్-టెపుయిని 1955లో ఎక్కాడు. అదే సమయంలోనే అతను ఏంజెల్ విమానాన్ని కూడా చేరుకున్నాడు. అది విమానం కూలిన 18 సంవత్సరాల తరువాత జరిగింది. అతను జలపాతానికి నీరు అందించే ఆ నదికి గావ్జా అనే ఒక లాట్వియాలోని నది పేరు పెట్టాడు. కాని పెమోన్ వారి పేరైన కేరేప్ ఇప్పటికి ఎక్కువగా వాడబడుతుంది.

చురున్ నది నుంచి జలపాతానికి వెళ్ళే దారిని కనిపెట్టిన తొలి వ్యక్తి కూడా లైమే నే. ఆ దారిలోనే, జలపాతాన్ని ఫోటోలు తీయడానికి వీలుగా ఉండే ఒక స్థలం ఉంది. దానికి పేరు మిరడోర్ లైమే ("లైమే యొక్క వీక్షించే స్థలం" అని స్పానిష్ భాషలో అర్ధం) అని ఆయన గౌరవార్ధం పెట్టారు. ఈ మార్గాన్నే ప్రస్తుతం పర్యాటకులను ఇస్ల రటన్ క్యాంపు నుంచి తీసుకువెళ్ళడానికి వాడుతారు.

జలపాతం ఎత్తును అధికారపూర్వకంగా 1949లో అమెరికాకు చెందిన పాత్రికేయుడు రూథ్ రాబర్ట్సన్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటి సర్వేలో కనుగొన్నాడు. తొలిసారి విజయవంతంగా ఆయం తెపుయిని ఎక్కి జలపాతం పై భాగానికి వెళ్ళిన సంఘటన గురించి డేవిడ్ నాట్ రచించిన ఏంజల్స్ ఫోర్ అనే పుస్తకములో వివరించబడింది.

1949 మే 13 న అమెరికన్ జర్నలిస్ట్ రూత్ రాబర్ట్‌సన్ నిర్వహించిన యాత్ర ద్వారా జరిపిన సర్వే ద్వారా జలపాతం యొక్క అధికారిక ఎత్తు నిర్ణయించబడింది. 1949 ఏప్రిల్ 23 న ప్రారంభమైన రాబర్ట్‌సన్ యాత్ర కూడా జలపాతం అడుగుభాగంలోకి చేరింది. మొట్టమొదటిగా శిఖరం అధిరోహించే ప్రయత్నం 1968 లో తడిగా ఉన్న కాలంలో జరిగింది. జారే రాతి కారణంగా ఇది విఫలమైంది. 1969 లో పొడి వాతావరణం ఉన్న కాలంలో రెండో ప్రయత్నం జరిగింది. 120 metres (400 ft) వరకు చేరినా ఈ ప్రయత్నం విఫలమైంది. శిఖరంపైకి మొదటి అధిరోహణ 1971 జనవరి 13 న పూర్తయింది. అధిరోహకులు, అమెరికన్ పర్వతారోహకుడు, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ జార్జ్ బోగెల్ నేతృత్వంలోని 4 మంది వ్యక్తుల బృందం అధిరోహించడానికి తొమ్మిదిన్నర రోజులు, ర్యాప్పల్ చేయడానికి ఒకటిన్నర రోజులు అవసరం.

పర్యాటక రంగం

ఏంజెల్ జలపాతం వెనిజులాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి, అయితే జలపాతానికి ఒక ప్రయాణం సంక్లిష్టమైన విషయం. జలపాతాలు ఏకాంత అడవిలో ఉన్నాయి. మైకేటియా విమానాశ్రయం లేదా ప్యూర్టో ఓర్డాజ్ లేదా సియుడాడ్ బోలివర్ నుండి ఒక విమానం కనైమా క్యాంప్‌కి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జలపాతం దిగువన నది పర్యటనలకు ప్రారంభ స్థానం. నదుల పర్యటనలు సాధారణంగా జూన్ నుండి డిసెంబరు వరకు జరుగుతాయి. నదులు పెమన్ గైడ్‌ల ఉపయోగం కోసం లోతుగా ఉంటాయి. పొడి కాలంలో (డిసెంబరు నుండి మార్చి వరకు), ఇతర నెలల కంటే తక్కువ నీరు కనిపిస్తుంది.

ఏంజెల్ జలపాతం 
View of Angel Falls and Auyantepui from Isla Raton camp

మూలాలు

బాహ్య లింకులు

ఏంజెల్ జలపాతం  Media related to Kerepakupai merú (category) at Wiki Commons

Tags:

ఏంజెల్ జలపాతం చరిత్రఏంజెల్ జలపాతం పర్యాటక రంగంఏంజెల్ జలపాతం మూలాలుఏంజెల్ జలపాతం బాహ్య లింకులుఏంజెల్ జలపాతంజలపాతంజలపాతముప్రపంచ వారసత్వ ప్రదేశంప్రపంచమువెనుజులా

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅనూరాధ నక్షత్రంరాహువు జ్యోతిషంసోరియాసిస్దేవులపల్లి కృష్ణశాస్త్రిసత్యనారాయణ వ్రతంశివుడుభారతదేశంవృషభరాశిభారత జాతీయపతాకంమంజీరా నదిఅవకాడోరామదాసుఉత్తర ఫల్గుణి నక్షత్రముఆంధ్రప్రదేశ్లలితా సహస్ర నామములు- 1-100వందే భారత్ ఎక్స్‌ప్రెస్గన్నేరు చెట్టుకేతిరెడ్డి పెద్దారెడ్డితెలంగాణ దళితబంధు పథకంపి.టి.ఉషనడుము నొప్పిఎఱ్రాప్రగడకర్ణుడుదశదిశలురక్తపోటుశిశోడియాఇంగువవై.యస్.అవినాష్‌రెడ్డితాజ్ మహల్విశాఖపట్నంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఢిల్లీ సల్తనత్తులారాశిధూర్జటిపాండ్య రాజవంశంగైనకాలజీపాములపర్తి వెంకట నరసింహారావుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుకాకతీయులుహరిద్వార్ఆంధ్రప్రదేశ్ చరిత్రపొట్టి శ్రీరాములుహర్షవర్థనుడుగంగా నదికంటి వెలుగులలిత కళలుతెల్లబట్టపశ్చిమ గోదావరి జిల్లాజమ్మి చెట్టుఆలివ్ నూనెనాయీ బ్రాహ్మణులుతెలంగాణ రైతుబీమా పథకంతెలంగాణ జిల్లాలుఅల్ప ఉమ్మనీరుబుధుడు (జ్యోతిషం)తెలుగు సినిమాలు 2023తెలుగునాట జానపద కళలుహనుమంతుడుమే దినోత్సవంఅంగారకుడు (జ్యోతిషం)ముహమ్మద్ ప్రవక్తశిబి చక్రవర్తితామర పువ్వుపిట్ట కథలుహెబియస్ కార్పస్మౌర్య సామ్రాజ్యంవిభక్తివావిలాల గోపాలకృష్ణయ్యక్వినోవాసర్వేపల్లి రాధాకృష్ణన్అభిమన్యుడుక్లోమముగర్భాశయమునువ్వొస్తానంటే నేనొద్దంటానాసీతాదేవిఘటోత్కచుడుబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలు🡆 More