ఆగమం

భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు.

భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.

రకాలు

వైష్ణవ ఆగమము లలో రెండు రకాలు ఉన్నాయి.

  1. వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము'.
  2. గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'.

వైఖానస ఆగమం: శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

పాంచరాత్ర ఆగమం: పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.

పూజలు

నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆ సాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

తామర పువ్వుపురుష లైంగికతసెక్యులరిజంసత్య సాయి బాబాప్రకాష్ రాజ్కుంభరాశికె. విజయ భాస్కర్భారతీయ జనతా పార్టీశివుడుభారత జీవిత బీమా సంస్థయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీబంగారంబమ్మెర పోతనభారత రాజ్యాంగ పరిషత్అనుపమ పరమేశ్వరన్జోల పాటలునరసింహ శతకముగురువు (జ్యోతిషం)అల్లు అర్జున్నర్మదా నదితెలుగు సినిమాలు 2023వై.యస్.అవినాష్‌రెడ్డిసంధివినాయక చవితికృతి శెట్టిశాసనసభ సభ్యుడుటి. పద్మారావు గౌడ్సవర్ణదీర్ఘ సంధిసూర్య నమస్కారాలుసచిన్ టెండుల్కర్బ్రాహ్మణ గోత్రాల జాబితాడొక్కా మాణిక్యవరప్రసాద్ఎవడే సుబ్రహ్మణ్యంమృణాల్ ఠాకూర్నామనక్షత్రముశాసన మండలిచాళుక్యులుమూర్ఛలు (ఫిట్స్)అచ్చులువృశ్చిక రాశితరుణ్ కుమార్భీమా (2024 సినిమా)అంగచూషణవై.యస్. రాజశేఖరరెడ్డిభారతీయ రిజర్వ్ బ్యాంక్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాక్వినోవారాహుల్ గాంధీనిర్వహణసూర్యుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగూగుల్వినాయకుడుబుగ్గన రాజేంద్రనాథ్రవితేజమియా ఖలీఫామీనరాశిహోమియోపతీ వైద్య విధానంబెంగళూరుఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ఊరు పేరు భైరవకోన2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపంచభూతలింగ క్షేత్రాలుయోగి ఆదిత్యనాథ్సాహిత్యంమృగశిర నక్షత్రమురాశి (నటి)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరామ్ చ​రణ్ తేజఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామానవ హక్కులుభారతదేశంలో సెక్యులరిజంహైపర్ ఆదినవగ్రహాలుకర్నూలుఅర్జునుడుపెమ్మసాని నాయకులు🡆 More