హరే కృష్ణ మహతాబ్: భారత రాజకీయనేత

హరేకృష్ణ మహతాబ్, (1899 నవంబరు 21 - 1987 జనవరి 2) భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పేరుపొందిన వ్యక్తి.

ఇతను 1946 నుండి 1950 వరకు, తిరిగి 1956 నుండి 1961 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను "ఉత్కల్ కేశరి" అనే ముద్దుపేరుతో ప్రసిద్ధి చెందాడు.

హరేకృష్ణ మహతాబ్
ହରେକୃଷ୍ଣ ମହତାବ
హరే కృష్ణ మహతాబ్: జీవితం తొలిదశ, రాజకీయ జీవితం, మేధోపరమైన ప్రయత్నాలు
భారతదేశపు 2000 స్టాంప్‌పై మహతాబ్
మొదటి ఒడిశా ముఖ్యమంత్రి
In office
1956 అక్టోబరు 19 – 1961 ఫిబ్రవరి 25
గవర్నర్భీమ్ సేన్ సచార్
వై. ఎన్. సూక్తంకర్
అంతకు ముందు వారునబక్రుష్ణ చౌదరి
తరువాత వారుబిజయానంద్ పట్నాయక్
In office
1946 ఏప్రిల్ 23 – 1950 మే 12
గవర్నర్చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది
కైలాష్ నాథ్ కట్జూ
అసఫ్ అలీ
అంతకు ముందు వారుకార్యాలయం స్థాపన
తరువాత వారునబక్రుష్ణ చౌదరి
బొంబాయి గవర్నర్
In office
1955 మార్చి 2 – 1956 అక్టోబరు 14
ముఖ్యమంత్రిమొరార్జీ దేశాయ్
అంతకు ముందు వారుగిరిజా శంకర్ బాజ్‌పాయ్
తరువాత వారుప్రకాశ్
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
1952–1955
తరువాత వారునిత్యానంద్ కనుంగో
నియోజకవర్గంకటక్, ఒడిశా
In office
1962–1967
అంతకు ముందు వారుబాద్ కుమార్ ప్రతాప్ గంగాదేబ్
తరువాత వారుడి. ఎన్. దేబ్
నియోజకవర్గందేవగఢ్, ఒడిశా
పరిశ్రమలు, సరఫరా మంత్రి
In office
1950 మే 13 – 1950 డిసెంబరు 26
అంతకు ముందు వారుశ్యామ ప్రసాద్ ముఖర్జీ
తరువాత వారుఖాళీ
వ్యక్తిగత వివరాలు
జననం
హరేకృష్ణ మహతాబ్

(1899-11-21)1899 నవంబరు 21
అగర్పద, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1987 జనవరి 2(1987-01-02) (వయసు 87)
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఒరిస్సా జన కాంగ్రెస్
జనతా పార్టీ
జీవిత భాగస్వామిసుభద్ర మహతాబ్
సంతానంభర్తృహరి మహతాబ్
కళాశాలరావెన్షా కళాశాల
Writing career
భాషఒడియా, ఇంగ్లీష్
కాలంకలోనియల్/పోస్ట్ కలోనియల్ ఇండియా
రచనా రంగంచరిత్ర, జీవిత చరిత్రలు, విద్యా సిద్ధాంతాలు
విషయంsభారతీయ రాజకీయాలు, చరిత్ర
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు1900-1987

జీవితం తొలిదశ

హరేకృష్ణ మహతాబ్ ఒడిషా రాష్ట్రం, భద్రక్ జిల్లాలోని అగర్‌పడ్ గ్రామంలో జన్మించాడు.అతను ఒక కులీన ఖండాయత్ కుటుంబంలో కృష్ణ చరణ్ దాస్, తోపా దేబీ దంపతులకు జన్మించాడు. భద్రక్ పట్టణంలోని ఉన్నత పాఠశాల నుండి తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తరువాత, కటక్‌లోని రావెన్‌షా కశాశాలలో చేరాడు, కానీ 1921లో తన చదువును విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.

రాజకీయ జీవితం

1922లో, మహతాబ్ జైలు పాలయ్యాడు.దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను 1924 నుండి 1928 వరకు బాలసోర్ జిల్లా బోర్డు ఛైర్మనుగా పనిచేసాడు.అతను 1924లో బీహార్, ఒడిషా కౌన్సిల్ సభ్యుడయ్యాడు. అతను ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరి,1930లో మళ్లీ జైల్ పాలయ్యాడు. 1932లో పూరీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సభల కోసం కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఎన్నికయ్యాడు. పార్టీని నిషేధించినప్పుడు అతడిని నిర్బందంలోకి తీసుకున్నారు. 1934లో అతను అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగినఉద్యమంలో ఒడిశాలో మొదటిసారిగా తన పూర్వీకుల ఆలయాన్ని తెరచి అందరికీ ప్రవేశం కల్పించాడు.తరువాత అగర్‌పడ్ లో అతనుగాంధీ కర్మమందిరాన్ని ప్రారంభించాడు. అతను1930 నుండి 1931 వరకు, మళ్లీ 1937లో ఉత్కల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.1938లో సుభాష్ చంద్రబోస్ చేత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నామినేట్ అయ్యాడు.1938 నుండి1946 వరకు, మళ్లీ 1946 నుండి1950 వరకు కొనసాగాడు. అతను1938లో రాష్ట్ర ప్రజల విచారణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.సనద చట్టం రద్దు చేయాలని, పూర్వపు సంస్థానాలను ఒడిషా రాజ్యంలో విలీనం చేయాలని పాలకులకు సిఫారసు చేశాడు. అతను 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 నుండి 1945 వరకు జైలు శిక్ష అనుభవించాడు.

మహతాబ్ 1946 ఏప్రిల్ 23 నుండి1950 మే 12 వరకు ఒడిశా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను 1950 నుండి1952 వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిగా,1952లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. అతను 1955 నుండి 1956 వరకు బొంబాయి గవర్నర్‌గా వ్యవహరించాడు. 1956లో గవర్నర్ పదవికి రాజీనామాచేసి, మళ్లీ 1956 నుండి 1960 వరకు ఒడిశా ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, పూర్వపు రాచరిక రాష్ట్రాల విలీనం, సమైక్యత, రాజధానిని కటక్ నుండి భువనేశ్వర్‌కు మార్చడం, బహుళ ప్రయోజన హీరాకుడ్ డ్యాం మంజూరు నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను 1962లో అంగుల్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.1966లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.1966లో, అతను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఒరిస్సా జన కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాడు. అతను 1967, 1971,1974లో ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. అత్వసర పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు 1976లో జైలుపాలయ్యాడు.

మేధోపరమైన ప్రయత్నాలు

అతను ప్రజాతంత్ర ప్రచార సమితి స్థాపకుడు.1923లో బాలసోర్‌లో వారపత్రిక ప్రజాతంత్రను ప్రారంభించాడు. తరువాత అది రోజువారీ ప్రజాతంత్ర పత్రికగా మారింది. జనాకర్ అనే మాసపత్రిక ఆవిర్భావం నుండి దానికి అతను ప్రధాన సంపాదకులుగా ఉన్నాడు.అతను ది ఈస్టర్న్ టైమ్స్‌ అనే ఆంగ్ల వారపత్రిక కూడా ప్రచురించాడు. దానికి అతను ముఖ్య ఎడిటరుగా పనిచేసాడు. అతను 1983లో తన రచన గావ్ మజ్లిస్ మూడవ వాల్యూంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు.

అవార్డులు, గౌరవాలు

అతను ఒరిస్సా సాహిత్య అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీకి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాడు.గౌరవ డి. లిట్ ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి, సాగర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. ఒడిషా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, ఒడిషా స్టేట్ పబ్లిక్ అత్యున్నత లైబ్రరీ సిస్టమ్ అతని పేరును హరేకృష్ణ మహతాబ్ స్టేట్ లైబ్రరీగా పేర్కొనబడింది.ఇది1959లో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మూడు ఎకరాల ప్రాంగణంతో స్థాపించబడింది

ప్రస్తావనలు

వెలుపలి లంకెలు

Tags:

హరే కృష్ణ మహతాబ్ జీవితం తొలిదశహరే కృష్ణ మహతాబ్ రాజకీయ జీవితంహరే కృష్ణ మహతాబ్ మేధోపరమైన ప్రయత్నాలుహరే కృష్ణ మహతాబ్ అవార్డులు, గౌరవాలుహరే కృష్ణ మహతాబ్ ప్రస్తావనలుహరే కృష్ణ మహతాబ్ వెలుపలి లంకెలుహరే కృష్ణ మహతాబ్ఒడిషాభారత జాతీయ కాంగ్రెస్భారత స్వాతంత్ర్యోద్యమం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగురజాడ అప్పారావుఆశ్లేష నక్షత్రముపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుమొదటి ప్రపంచ యుద్ధంఆంధ్రప్రదేశ్ చరిత్రమలబద్దకంఇండియన్ ప్రీమియర్ లీగ్సచిన్ టెండుల్కర్తహశీల్దార్సౌరవ్ గంగూలీఅంగుళంతెలంగాణదగ్గుబాటి పురంధేశ్వరిఖండంక్లోమముపార్వతితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅధిక ఉమ్మనీరునువ్వొస్తానంటే నేనొద్దంటానాతొలిప్రేమమహాభాగవతంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకుక్కచదరంగం (ఆట)అనంత బాబు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసెక్యులరిజంఆరోగ్యంకల్వకుంట్ల కవితసామెతల జాబితాజనసేన పార్టీశుక్రాచార్యుడుశ్రవణ నక్షత్రముకామసూత్రజయలలిత (నటి)వంగా గీతరోహిణి నక్షత్రంకర్కాటకరాశికూరఇంగువకాళోజీ నారాయణరావుకర్ణాటకసౌర కుటుంబంరవితేజశ్రీరామనవమిపురుష లైంగికతనల్లారి కిరణ్ కుమార్ రెడ్డితెలంగాణ ప్రభుత్వ పథకాలుపమేలా సత్పతిసూర్య నమస్కారాలుఉండి శాసనసభ నియోజకవర్గంశ్రీ చక్రంబంగారంఉస్మానియా విశ్వవిద్యాలయంభారతదేశ చరిత్రనువ్వులురావి చెట్టుఉత్తరాషాఢ నక్షత్రముప్రశాంతి నిలయంక్రియ (వ్యాకరణం)మహామృత్యుంజయ మంత్రంవింధ్య విశాఖ మేడపాటివై.యస్.రాజారెడ్డివెల్లలచెరువు రజినీకాంత్తోటపల్లి మధుఇంటర్మీడియట్ విద్యఅక్కినేని నాగార్జునజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షహార్సిలీ హిల్స్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవ్యవసాయంతెలుగునాట జానపద కళలుకోదండ రామాలయం, ఒంటిమిట్టభారతీయ జనతా పార్టీ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థటీవీ9 - తెలుగుగ్లోబల్ వార్మింగ్🡆 More