భద్రక్: ఒడిశా లోని పట్టణం

భద్రక్ ఒడిషా రాష్ట్రం భద్రక్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.

పురాణాల ప్రకారం, పట్టణానికి ఈ పేరు సలాండి నది ఒడ్డున ఉన్న భద్రకాళి దేవి నుండి వచ్చింది.

భద్రక్
—  పట్టణం  —
[[File:
భద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణా
భద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణాభద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణా
భద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణా
పైన, ఎడమ నుండి: పట్టణ దృశ్యం, ధంరా రేవు, అఖండలమణి ఆలయం, రైల్వే స్టేషను
|250px|none|alt=|]]
భద్రక్ is located in Odisha
భద్రక్
భద్రక్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం భద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణా India
రాష్ట్రం భద్రక్: చరిత్ర, జనాభా వివరాలు, రవాణా ఒడిశా
జిల్లా భద్రక్
జనాభా (2011)
 - మొత్తం 107,369
Population rank India 456th, Odisha 9th
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 756100

చరిత్ర

పురాణాల ప్రకారం, భద్రక్ అనే పేరు భద్రకాళి దేవి నుండి వచ్చింది. ఈ ఆలయం పట్టణ నైరుతి శివార్లలో ఉంది.

ఒడిశా సముద్ర, వ్యవసాయ పురోభివృద్ధికి, వ్యాపార వాణిజ్యాల వృద్ధికీ భద్రక్ చేసిన తోడ్పాటు చరిత్రలో భాగం. మొఘల్ కాలంలో భద్రక్, బెంగాల్ నవాబుల కింద ఒక సుబా లేదా ప్రావిన్సుగా ఉండేది. మొఘలుల సామ్రాజ్యం క్షీణించినప్పుడు, ఈ ప్రాంతం కనికా, నాంపో, అగరపడ అనే సంస్థానాలుగా విడిపోయింది.వీటిని క్షత్రియ ప్రభువులు పాలించేవారు.

1804 జూన్‌లో బ్రిటిష్ వారు ఒడిశాను ఆక్రమించిన తరువాత, భద్రక్, కటక్‌లో ఒక పరిపాలనా విభాగంగా ఉండేది. 1828లో, బాలాసోర్‌ను ప్రత్యేక జిల్లాగా చేసినప్పుడు, భద్రక్‌ను అందులో ఒక సబ్-డివిజనుగా చేసారు. కానీ మున్సిఫ్ కోర్టు 1901 వరకు జాజ్‌పూర్‌లో ఉండేది.

జాతీయ పోరాట కాలంలో భద్రక్ ముందంజలో ఉండేది. 1920లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాడు. 1921 మార్చిలో గాంధీ, భద్రక్‌ సందర్శించాడు. 1922లో అతను కనికా తిరుగుబాటును ప్రారంభించాడు. బ్రిటిష్ దళాలు అణచివేయడానికి ప్రయత్నించాయి; కానీ చివరికి కౌలుదారుల ఉద్యమం కనికాకు చెందిన చక్రధర్ బెహరా నాయకత్వంలో విజయం సాధించింది.

1930లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైనప్పుడు భద్రక్ కూడా ఉప్పు చట్టాన్ని ధిక్కరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. ఈ ఉద్యమంలో హరేకృష్ణ మహతాబ్ పాత్ర భద్రక్‌లో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగమైంది. 1934లో మళ్లీ భద్రక్‌ సందర్శించిన గాంధీ, మహతాబ్ నివాసంలో ఉండి, జింబరన్ ఆశ్రమంలో (నుసాహి, ఆశ్రమం, గరద్‌పూర్) హరిజన్ కార్మికుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సమయంలోనే ఈరామ్‌కు చెందిన బంచనిధి మొహంతి తన దేశభక్తి గీతాల ద్వారా ప్రజలలో జాతీయ చైతన్యాన్ని రూపొందించడం, ఉత్తేజపరిచడం జరిగింది.

జనాభా వివరాలు

2011 జనగణన ప్రకారం, భద్రక్ జనాభా 1, 07,463. ఇందులో పురుషులు 51% (55,090 మంది), స్త్రీలు 49% (52,373 మంది). పట్టణంలో అక్షరాస్యత 79.49%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83.99% కాగా, స్త్రీలలో ఇది 74.77%. జనాభాలో 12% (13,138) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

రవాణా

భద్రక్ పట్టణం నుండి ఒడిషా రాష్ట్రం లోని పట్టణాలు, దేశం లోని ఇతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. ఈ పట్టణం జాతీయ రహదారి 16 పై, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఈశాన్యంగా 130 కి.మీ. దూరంలో ఉంది.

భద్రక్ పట్టణంలో మూడు బస్ స్టేషన్లు ఉన్నాయి, కటక్, భువనేశ్వర్, బాలాసోర్, కలకత్తాల నుండి తరచుగా బస్సులు ఉన్నాయి. 

భద్రక్ రైల్వే స్టేషను పట్టణ కేంద్రం నుండి 3 కి.మీ. దూరంలో ఉన్న చరంప వద్ద ఉంది.

సమీప విమానాశ్రయం 135 కి.మీ. దూరం లోని భువనేశ్వర్‌లో ఉన్న బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం.

శీతోష్ణస్థితి

శీతోష్ణస్థితి డేటా - Bhadrak, Odisha
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27.2
(81.0)
30.0
(86.0)
34.3
(93.7)
36.9
(98.4)
37.1
(98.8)
34.6
(94.3)
31.4
(88.5)
31.3
(88.3)
31.5
(88.7)
30.5
(86.9)
28.9
(84.0)
27.0
(80.6)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 14.4
(57.9)
17.1
(62.8)
21.4
(70.5)
24.9
(76.8)
26.7
(80.1)
26.3
(79.3)
25.7
(78.3)
25.9
(78.6)
25.6
(78.1)
23.4
(74.1)
18.0
(64.4)
14.3
(57.7)
22.0
(71.6)
సగటు వర్షపాతం mm (inches) 13
(0.5)
31
(1.2)
34
(1.3)
45
(1.8)
85
(3.3)
212
(8.3)
306
(12.0)
326
(12.8)
273
(10.7)
161
(6.3)
38
(1.5)
6
(0.2)
1,530
(59.9)
Source: en.climate-data.org

మూలాలు

Tags:

భద్రక్ చరిత్రభద్రక్ జనాభా వివరాలుభద్రక్ రవాణాభద్రక్ శీతోష్ణస్థితిభద్రక్ మూలాలుభద్రక్ఒడిశాభద్రకాళిభద్రక్ జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

అగ్నిపర్వతంహరికథమహారాష్ట్రక్లోమముపాల్కురికి సోమనాథుడుకురుక్షేత్ర సంగ్రామందావీదుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిభూమి యాజమాన్యంసజ్జలుఅంగచూషణకృష్ణ గాడి వీర ప్రేమ గాథరాగులుజయలలిత (నటి)హిమాలయాలునక్షత్రం (జ్యోతిషం)శుక్లమువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిషేర్ మార్కెట్కాలేయంతోట చంద్రశేఖర్మంగ్లీ (సత్యవతి)సంధ్యారాణి (నటి)తెలంగాణ పల్లె ప్రగతి పథకంపొంగూరు నారాయణఅశ్వని నక్షత్రముఉబ్బసముశివాత్మికఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంజీవన నైపుణ్యంఅంగన్వాడిచైనాచిత్త నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాయూట్యూబ్మొదటి పేజీమిషన్ భగీరథసింగిరెడ్డి నారాయణరెడ్డిదొడ్డి కొమరయ్యరష్యాఅజర్‌బైజాన్భారత ఎన్నికల కమిషనుకర్ణాటక యుద్ధాలురాజమండ్రికన్నెమనసులునిజాంమలబద్దకంభాషా భాగాలువికలాంగులుసలేశ్వరంపది ఆజ్ఞలుకరక్కాయరక్తపోటుప్రాణాయామంరామాయణంనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)కపిల్ సిబల్ఆస్ట్రేలియాతెలంగాణ రాష్ట్ర సమితిధూర్జటిమశూచిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుకుక్కహరిత విప్లవంతిరుమల శ్రీవారి మెట్టుశ్రీకాళహస్తితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థటెలిగ్రామ్గైనకాలజీమఖ నక్షత్రముమీనాఅకాడమీ పురస్కారాలుసంధ్యావందనంరమ్యకృష్ణఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుదృశ్యం 2దురద🡆 More