బాలాసోర్: ఒడిశా లోని పట్టణం

బాలాసోర్, ఒడిషా రాష్ట్రం లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

దీన్ని బాలేశ్వర అని కూడా అంటారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఉత్తరాన 194 కి.మీ. దూరం లోను, కోల్‌కతా నుండి 300 కి.మీ. దూరం లోనూ ఈ పట్టణం ఉంది. ఇది ఉత్తర ఒడిశా లోని అతిపెద్ద పట్టణం. ఇది చాందీపూర్ బీచ్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిని 'క్షిపణి నగరం' అని కూడా అంటారు. భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమపు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పట్టణానికి దక్షిణంగా 18 కి.మీ. దూరంలో ఉంది.

బాలాసోర్
బాలేశ్వర
పట్టణం
బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా
బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణాబాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా
పైనుండి; ఎడమ నుండి: క్షీరచోర గోపీనాథాలయం, చాందీపూర్ బీచి, DRDO ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజి
బాలాసోర్ is located in Odisha
బాలాసోర్
బాలాసోర్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 21°29′N 86°56′E / 21.49°N 86.93°E / 21.49; 86.93
దేశంబాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా India
రాష్ట్రంబాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా ఒడిశా
జిల్లాబాలాసోర్
Area
 • పట్టణం17.48 km2 (6.75 sq mi)
Elevation
16 మీ (52 అ.)
Population
 (2011)
 • పట్టణం1,44,373
 • RankIndia 409th, Odisha 7th
 • Density8,300/km2 (21,000/sq mi)
 • Metro
1,77,557
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
PIN
756001-756xxx
Telephone code06782
Vehicle registrationOD - 01(Previously OR - 01)
UN/LOCODEIN BLS

శీతోష్ణస్థితి

శీతోష్ణస్థితి డేటా - Balasore (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.6
(96.1)
38.7
(101.7)
41.6
(106.9)
45.0
(113.0)
46.7
(116.1)
46.1
(115.0)
39.9
(103.8)
36.7
(98.1)
36.2
(97.2)
36.1
(97.0)
34.8
(94.6)
33.6
(92.5)
46.7
(116.1)
సగటు అధిక °C (°F) 27.1
(80.8)
29.8
(85.6)
33.6
(92.5)
35.9
(96.6)
35.7
(96.3)
34.0
(93.2)
32.3
(90.1)
31.9
(89.4)
32.1
(89.8)
31.9
(89.4)
30.1
(86.2)
27.6
(81.7)
31.8
(89.2)
సగటు అల్ప °C (°F) 14.3
(57.7)
17.6
(63.7)
21.7
(71.1)
24.5
(76.1)
25.7
(78.3)
26.1
(79.0)
25.8
(78.4)
25.6
(78.1)
25.3
(77.5)
23.1
(73.6)
18.6
(65.5)
14.7
(58.5)
21.9
(71.4)
అత్యల్ప రికార్డు °C (°F) 7.2
(45.0)
6.7
(44.1)
11.7
(53.1)
16.6
(61.9)
18.4
(65.1)
20.0
(68.0)
20.0
(68.0)
21.3
(70.3)
20.3
(68.5)
15.5
(59.9)
8.9
(48.0)
6.7
(44.1)
6.7
(44.1)
సగటు వర్షపాతం mm (inches) 16.4
(0.65)
36.2
(1.43)
39.6
(1.56)
60.5
(2.38)
146.4
(5.76)
296.7
(11.68)
291.2
(11.46)
308.4
(12.14)
290.0
(11.42)
174.3
(6.86)
39.7
(1.56)
6.8
(0.27)
1,706.1
(67.17)
సగటు వర్షపాతపు రోజులు 1.1 2.0 2.3 4.2 7.2 10.9 13.7 15.3 11.8 6.0 1.6 0.4 76.4
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 63 62 64 69 71 75 78 80 80 76 70 65 71
Source: India Meteorological Department

జనాభా శాస్త్రం

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలాసోర్ పట్టణ ప్రాంత మొత్తం జనాభా 1,44,373, అందులో 73,721 మంది పురుషులు, 70,652 మంది స్త్రీలు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 14,773. బాలాసోర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 113,418, ఇది జనాభాలో 78.6%, పురుషులలో అక్షరాస్యత 81.7% కాగా, స్త్రీలలో ఇది 75.3%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 87.5%. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.0% కాగా, స్త్రీలలో ఇది 83.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 15,812, షెడ్యూల్డ్ తెగల జనాభా 9,291. 2011 నాటికి పట్టణంలో 30460 గృహాలు ఉన్నాయి

దర్శనీయ ప్రదేశాలు

బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా 
చాందీపూర్‌లోని అబ్దుల్ కలాం ద్వీపంలో క్షిపణి ప్రయోగం

చండీపూర్-ఆన్-సీ అనేది ఒక మైలు పొడవైన బీచ్‌ ఉన్న సముద్రతీర రిసార్టు. ఇది ఒక ప్రత్యేకమైన బీచ్ - అలలు నిర్ణీత వ్యవధిలో రోజుకు నాలుగు సార్లు మాత్రమే ఒడ్డుకు వస్తాయి. పట్టణం నుండి నైరుతి దిశలో 30 కిమీ దూరంలో పర్వతంపై పంచలింగేశ్వరాలయం ఉంది. అక్కడి శివలింగం, జలపాటం వెనుక, నీటిలో మునిగి ఉన్నందున కనిపించదు; దాన్ని తాకి అనుభూతి చెందుతారు. బాలాసోర్‌కు నైరుతి దిశలో సుమారు 33 కిమీ దూరంలో సంతరాగడియా పట్టణంలో కొండపై బిశ్వేశ్వర దేవాలయం ఉంది. పట్టణం నలువైపులా కొండలతో చుట్టబడి ఉంది. సమీపంలోని ఖులియా గ్రామం, ఆదివాసీల స్థావరం. బాలాసోర్‌కు ఆగ్నేయంగా దాదాపు 30 కిమీ దూరంలో ధమరా అనే ఓడరేవు ఉంది.

  • క్షీరచోర గోపీనాథ దేవాలయం, బాలాసోర్ పట్టణం నుండి 7 కి.మీ. దూరంలో రెమునా వద్ద ఉంది. కోణార్క సూర్య దేవాలయాన్ని నిర్మించిన రాజు లాంగూల నరసింహ దేవ దీన్ని నిర్మించాడు.
  • బిరంచినారాయణ దేవాలయం, పాలియా, అస్తదుర్గ, భూధార చండి ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ఆలయాలు.
  • రెమునా లోని జగన్నాథ ఆలయం ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఆలయం. దీని వాస్తుశిల్పం పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయంచే ప్రభావితమైంది.
బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా 
భూసందేశ్వర దేవాలయం
  • నీలగిరిలో జగన్నాథ దేవాలయం ఉంది ఇది ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ దేవాలయాలలో ఒకటి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర లను ఇక్కడ పూజిస్తారు. ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహిస్తారు.
  • పంచలింగేశ్వర దేవాలయం బాలేశ్వర నుండి 30 కి.మీ. దూరంలో ఉన్న పిక్నిక్ స్పాట్. పర్యాటకుల కోసం పంచలింగేశ్వరలో రాష్ట్ర పర్యాటక పంథా నివాస్ ఉంది. పంచలింగేశ్వరుని చుట్టూ కొండలు, అడవులు ఉన్నాయి.
బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా 
పంచలింగేశ్వర దేవాలయం
  • భుజాఖియా పీర్, నగరం నడిబొడ్డున ఉన్న సన్‌హాట్ వద్ద భుజాఖియా పీర్ అని పిలువబడే సూఫీ సెయింట్ ఆస్థానా షరీఫ్ హజ్రత్ పీర్ సమాధి.
  • బాబా భూసంధేశ్వర్ ఆలయం, ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. బాలాసోర్ నుండి 100 కి.మీ. దూరం లోని భోగరాయ్ గ్రామంలో ఉంది. ఇక్కడ 12 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న లింగం నల్ల గ్రానైట్‌పై చెక్కబడి ఉంటుంది. లింగం సగం మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సగం భూమిలో ఉంటుంది. లింగం వ్యాసం 12 అడుగులు ఉండి, మూడు భాగాలుగా ఉంటుంది. లింగం మధ్య భాగం అష్టభుజి ఆకారంలో ఉంటుంది. కొద్దిగా కుడివైపుకి వంగి ఉంటుంది.
  • మిత్రాపూర్ జగన్నాథ మందిరాన్ని ఒడిశాలోని రెండవ పూరీ దేవాలయంగా పిలుస్తారు. 

రవాణా

బాలాసోర్: శీతోష్ణస్థితి, జనాభా శాస్త్రం, రవాణా 
బాలాసోర్ రైల్వే స్టేషన్

వైమానిక

సమీప విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం. ఇది బాలాసోర్ నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం బాలాసోర్ నుండి 254 కి.మీ. దూరంలో ఉంది.

రైలు

బాలాసోర్ రైల్వే స్టేషను సౌత్ ఈస్టర్న్ రైల్వేలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న ఒక ముఖ్యమైన స్టేషను. కోల్‌కతా నుండి దాదాపు 254 కి.మీ., భువనేశ్వర్‌ నుండి 206 కి.మీ. దూరంలో ఉంది. బాలాసోర్ సమీపంలోని రూప్సా నుండి బారిపడాకు ఒక మార్గం ప్రారంభమవుతుంది. బాలాసోర్ నుండి భువనేశ్వర్, కోల్‌కతా, న్యూఢిల్లీ, చెన్నై, గౌహతి, బెంగళూరు, పూరి, ఎర్నాకులంలకు తదితర నగరాలకు రైళ్ళున్నాయి.

త్రోవ

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 18 బాలాసోర్ గుండా వెళుతున్నాయి. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన జాతీయ రహదారి 16, చెన్నై నుండి కోల్‌కతా వెళ్తుంది. నగరం లోపల రవాణాలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు ఉంటాయి. 2017 ఆగస్టు 15 న బాలాసోర్‌లో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. బస్ టెర్మినస్ సహదేవ్ ఖుంటా వద్ద ఉంది. ప్రతిరోజూ వేలాది ప్రైవేట్ బస్సులు వందలాది గమ్యస్థానాలకు తిరుగుతాయి. అనేక విలాసవంతమైన AC బస్సులు ప్రతిరోజూ భువనేశ్వర్, కోల్‌కతా తదితర నగరాలకు తిరుగుతాయి.

బాలాసోర్ అనేక ఇంజనీరింగ్ కళాశాలలతో ఉత్తర ఒడిశాలోని ప్రధాన విద్యా కేంద్రంగా ఉంది. ఈ పట్టణానికి చెందిన ప్రఖ్యాత నవలా రచయిత ఫకీర్ మోహన్ సేనాపతి పేరు మీద ప్రసిద్ధ ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం ఉంది. 2018 సంవత్సరంలో దీన్ని స్థాపించారు.

సాంకేతిక కళాశాలలు/సంస్థలు

  • అకాడమీ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
  • బాలాసోర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
  • సత్యసాయి ఇంజినీరింగ్ కళాశాల
  • విజయాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

విశ్వవిద్యాలయాలు/కళాశాలలు

  • బాలాసోర్ లా కళాశాల
  • ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
  • ఫకీర్ మోహన్ యూనివర్సిటీ
  • సాగర్ కాలేజ్ ఆఫ్ సైన్స్

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

బాలాసోర్ శీతోష్ణస్థితిబాలాసోర్ జనాభా శాస్త్రంబాలాసోర్ రవాణాబాలాసోర్ ఇవి కూడా చూడండిబాలాసోర్ మూలాలుబాలాసోర్ఒడిశాచాందీపూర్భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమంభుబనేశ్వర్

🔥 Trending searches on Wiki తెలుగు:

బాలకాండఅంజలి (నటి)మా తెలుగు తల్లికి మల్లె పూదండసంధ్యావందనంమిథాలి రాజ్డి. కె. అరుణతెలుగు నాటకరంగంగుంటూరుదశరథుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితాబెల్లంశ్రీముఖిచంద్రుడు జ్యోతిషంకమ్మగాయత్రీ మంత్రంపది ఆజ్ఞలుఉపనయనముడీజే టిల్లుకంచురాశిబి.ఆర్. అంబేద్కర్కొణతాల రామకృష్ణగీతాంజలి (1989 సినిమా)పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్చిత్త నక్షత్రముకిలారి ఆనంద్ పాల్సచిన్ టెండుల్కర్ఉపమాలంకారంతెలుగు పద్యముభారత రాష్ట్రపతిజయం రవియానిమల్ (2023 సినిమా)విజయనగరంమధుమేహంకరోనా వైరస్ 2019జమ్మి చెట్టుకస్తూరి రంగ రంగా (పాట)వసంత వెంకట కృష్ణ ప్రసాద్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాజూనియర్ ఎన్.టి.ఆర్తోటపల్లి మధుడెక్కన్ చార్జర్స్బొత్స సత్యనారాయణసౌర కుటుంబంపంచభూతలింగ క్షేత్రాలుతిక్కనవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వింధ్య విశాఖ మేడపాటితెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపరిపూర్ణానంద స్వామిరావి చెట్టుకాకతీయులుపక్షవాతంనానార్థాలువెల్లలచెరువు రజినీకాంత్చిరంజీవులువిజయనగర సామ్రాజ్యంఅంగారకుడు (జ్యోతిషం)హైదరాబాదుసెక్స్ (అయోమయ నివృత్తి)బర్రెలక్కఇండియన్ ప్రీమియర్ లీగ్గరుత్మంతుడుసంస్కృతంటమాటోదాశరథి కృష్ణమాచార్యవై.యస్.అవినాష్‌రెడ్డిపౌర్ణమితిరుమల చరిత్రరెడ్డిఅనుష్క శెట్టికేతిక శర్మతాటి ముంజలుఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలుగు పత్రికలుసోంపు🡆 More