బెల్లంకొండ రామదాసు

బెల్లంకొండ రామదాసు (1923-1969) పేరు పొందిన కవి, నాటక రచయిత, అనువాదకుడు.

బెల్లంకొండ రామదాసు
జననంబెల్లంకొండ రామదాసు
(1923-08-23)1923 ఆగస్టు 23
India
మరణం1969 సెప్టెంబరు 19
ప్రసిద్ధికవి, నాటక రచయిత, అనువాదకుడు
మతంహిందూ
బెల్లంకొండ రామదాసు

రచనా ప్రస్థానం

1940లో శ్మశానం అనే పేరుతో కవితా సంపుటిని వెలువరించాడు. 1944లో ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు. 1953లో అతిథి అనే పేరుతో తన తొలి నాటకాన్ని రాశాడు. ఇతర సాంఘిక నాటకాలు, పునర్జన్మ, పంజరం, రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నాయి. చిలక చదువు (1953) పేరుతో కొన్ని రవీంద్రనాధ్ ఠాగూర్ కథలను అనువదించాడు.

రచనలు

  1. డోరియన్ గ్రే (ఆస్కార్ వైల్డ్)- అనువాద నవల
  2. భయస్థుడు (గొర్కి) - అనువాద నవల
  3. ఇవాన్‌ ఇలిచ్‌ మృతి మరికొన్ని కథలు (టాల్ స్టాయ్)- అనువాద నవల
  4. నీలికళ్లు (బాల్జాక్- అనువాద నవల: 1958)
  5. కన్నీరు (మపాసా)- అనువాద నవల
  6. నానా (ఎమిలి జోలా) - అనువాద నవల
  7. గీతాంజలి (ఠాగూర్)-అనువాదం
  8. జీవితము-మతము (టాల్ స్టాయ్ వ్యాసావళి -అనువాదం: 1959)
  9. కలికాలం (చార్లెస్ డికెన్స్) - అనువాదం
  10. రెబెకా- అనువాదం
  11. పరిత్యాగము (ఠాగూర్) -అనువాద కథలు - నన్నపనేని సుబ్బారావుతో కలిసి
  12. మాస్టర్జీ - నాటకం
  13. యుద్ధము- శాంతి (3 భాగాలు) [టాల్ స్టాయ్] - రెంటాల గోపాలకృష్ణతో కలిసి
  14. చందమామ (కథ),
  15. చతురస్రం (గొలుసు -అనువాదంకథ).
  16. పిచ్చివాని జ్ఞాపకాలు - టాల్ స్టాయ్ కథలు (పిచ్చివాని జ్ఞాపకాలు, యజమాని-మనిషి, నెగడి) - -అనువాదం.
  17. పునర్జన్మ - నాటకం
  18. అతిథి - నాటకం
  19. పంజరం - నాటకం
  20. శ్మశానం - కవితా సంపుటి
  21. ఈ రోజున నా గీతం - నాటకం
  22. గిలక కడవ - బెంగాళి అనువాద కథలు
  23. మన కాలం వీరుడు (లెర్మంతోవ్‌) - నవల

రచనల నుండి ఉదాహరణ

చెరసాల

ఇన్నాళ్ళూ
సమాజం ఒక సంకెళ్ల చెరసాల!
హత్యలు జరిగిన చెరసాల!
నెత్తురు పారిన చెరసాల!
దుర్మార్గులు కట్టిన చెరసాల!
ఒక పెద్ద చెరసాల!
బానిసత్వ శాస్త్రం
శాసించిన పూజారులు
నెత్తుటి కత్తులు
ఝళిపించిన సామ్రాట్టులు
హత్యా మంత్రాంగం
పన్నిన అమాత్యులు
దుర్మార్గులు మఠాధిపతులు
నరహన్తలు మతాధినేతలు
ఒకటై
జరిపించిన ఘోరహత్య
తగిలించిన అనల శృంఖల
కట్టిన బానిసత్వ కారాగృహమది
గత కాలపు సమాజ పద్ధతి!
పుణ్యం పేరిట
యజ్ఞంలో నరికిన
పసి మేకల శిరస్సులూ
ఉరి బండల
ఆహుతైన
పతిత ప్రజా శిరస్సులూ
పూజారీ కర్మల్లో
రాజన్యుల కత్తుల్లో
నలిగిన అనాథుల ఆక్రందన
ఇదేనా
పూర్వపు సమాజ నిర్మాణం?
పర పీడనకై
పరిపాలనకై
స్వార్థ పరులు
తమ అధికారం నిలుపుకోను
మతాధి నేతలు
వ్రాసిన దుర్మార్గపు శాస్త్రశాసనం
తగిలించిన నియమ శృంఖల
రాజులు
ఏకచ్ఛత్రంగా
ఏలిన శవ సామ్రాజ్యం
ఇదే కదా గతకాలపు
సమాజ పద్ధతి!
పూజారుల అధికారం
రాజన్యుల నియంతృత్వం
కట్టిన పెద్ద జైలు కొట్టు
చేసిన మహాహత్య
ఇదే కదా పూర్వపు
సమాజ చరిత్రమంతా!
గుండెలు మంటలుగా
కన్నులు కాలువగా
మారుతాయి
ఈ సమాజ హత్యా చరిత్ర చూస్తే!
రాజన్యుల
రథ చక్రపు
ఘట్టనలో
పడి నలిగే
దీనులార!
మతాధి నేతల
శాస్త్రాల చెప్పుల క్రింద
నలిగి నలిగి రోదించే
పసితనంలో పతి పోయిన
అమాయక కన్యలార!
స్వేచ్ఛ లేక
సమ్రాట్టుల
నేత్రాగ్నుల
దగ్ధమైన
జాతులార!
మరలో
మరగా
అరిగిపోవు
కార్మికులారా!
జమీందార్ల
పొట్టలు నింపను
ధాన్యం పండించే
కర్షకులారా!
ఓహో!
ఓహో!
అణగారిన
ప్రపంచ దీనులారా!
మీకై
ఈనాడొక
అగ్ని పర్వతం
పగులుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
అరుణ పతాకం
ఎగురుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
నవజగత్తు
ప్రభవిస్తున్నది చూచారా!
మీకై
ఈనాడొక
నందనవన వసంత మందారం
కుసుమించెను చూచారా!
మీకై ఈనాడొక
రణభేరి
పగిలింది విన్నారా!
( నయాగరా ఖండకావ్య సంపుటి నుండి)

మూలాలు

Tags:

బెల్లంకొండ రామదాసు రచనా ప్రస్థానంబెల్లంకొండ రామదాసు రచనలుబెల్లంకొండ రామదాసు రచనల నుండి ఉదాహరణబెల్లంకొండ రామదాసు మూలాలుబెల్లంకొండ రామదాసు

🔥 Trending searches on Wiki తెలుగు:

అనుష్క శర్మశ్రవణ నక్షత్రముభీమసేనుడుఉపమాలంకారంజగ్జీవన్ రాంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఅనుష్క శెట్టివిజయవాడరాష్ట్రపతి పాలనఅనసూయ భరధ్వాజ్డేటింగ్అమ్మనజ్రియా నజీమ్శ్రీముఖిపులివెందుల శాసనసభ నియోజకవర్గంసీ.ఎం.రమేష్నాయీ బ్రాహ్మణులువృశ్చిక రాశివసంత వెంకట కృష్ణ ప్రసాద్రజత్ పాటిదార్శ్రీశైల క్షేత్రంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుప్రకృతి - వికృతిభారతీయ రైల్వేలుదొంగ మొగుడునందిగం సురేష్ బాబుపి.సుశీలకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఫిరోజ్ గాంధీభారతీయ స్టేట్ బ్యాంకునువ్వు నాకు నచ్చావ్భారతదేశ సరిహద్దులుసమంతమిథాలి రాజ్జవాహర్ లాల్ నెహ్రూశాసనసభ సభ్యుడుఆంధ్ర విశ్వవిద్యాలయంవరలక్ష్మి శరత్ కుమార్అలంకారం2019 భారత సార్వత్రిక ఎన్నికలుసూర్య నమస్కారాలుగర్భాశయముసూర్యుడుతమన్నా భాటియాక్రిమినల్ (సినిమా)మంగళవారం (2023 సినిమా)రామప్ప దేవాలయంవై.యస్. రాజశేఖరరెడ్డిఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలువాస్తు శాస్త్రంజాతీయములుడి. కె. అరుణమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపెంటాడెకేన్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుద్రౌపది ముర్ముతులారాశిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)భారతీయ శిక్షాస్మృతిపెద్దమనుషుల ఒప్పందంఉమ్మెత్తకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతెలుగు సినిమాలు 2022క్రిక్‌బజ్శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంభువనేశ్వర్ కుమార్గౌతమ బుద్ధుడుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసత్య సాయి బాబాఅయోధ్యబాదామిస్త్రీతిరుమలశతభిష నక్షత్రముప్రకాష్ రాజ్సాహిత్యం🡆 More