బింబిసారుడు

బింబిసారుడు (మ.క్రీ.పూ.

558 - సి. క్రీ.పూ.491 బిసి లేదా క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం చివరిలో ) జైన చరిత్రలలో సెనియా లేదా శ్రేనికా అని కూడా పిలుస్తారు మగధ రాజు (r క్రీ.పూ.543 - క్రీ.పూ.492(r. 543 – 492 BC లేదా c. క్రీ.పూ.400,) హర్యంక రాజవంశానికి చెందినవారు. ఆయన భట్టియా కుమారుడు. . ఆయన రాజ్యం విస్తరణ (ముఖ్యంగా తూర్పున అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం) తరువాత మౌర్య సామ్రాజ్యం విస్తరణకు పునాదులు వేసినట్లు భావిస్తారు.

బింబిసారుడు
బింబిసారుడు
Bimbisara welcomes the Buddha
Founder of Haryanka dynasty
Reignసుమారు 544 –  492 BC (52 years) or c. 400 BC
PredecessorBhattiya
SuccessorAjatashatru
జననం558 BC
మరణం491 BC
SpouseKosala Devī
Chellanā
Kṣemā / Khemā
Nandā
Padmāvatī / Padumavatī
Ambapālī
IssueAjatashatru
రాజవంశంHaryanka
తండ్రిBhattiya
మతంHinduism, Jainism and Buddhism

ఆయన సాంస్కృతిక విజయాలకు కూడా ప్రసిద్ది చెందాడు. బుద్ధుని గొప్ప స్నేహితుడు, రక్షకుడు. హింబిను త్సాంగు అభిప్రాయం ఆధారంగా బింబిసారుడు బౌద్ధ రచనలలో ప్రసిద్ధి చెందిన రాజ్గిరు (రాజగ్రిహా) నగరాన్ని నిర్మించాడు (ఇతరులు ఆయన వారసుడికి నగరం పునాది వేసారని ఆపాదించారు). ఆయన తరువాత ఆయన కుమారుడు అజాతశత్రువు సింహాసనం అధిష్టించాడు.

జీవితం

బింబిసారుడు 
King Bimbisara visits the Bamboo Garden (Venuvana) in Rajagriha; artwork from Sanchi

బింబిసారుడు భట్టియా అనే అధిపతి కుమారుడు. క్రీస్తుపూర్వం 543 లో ఆయన 15 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన హర్యంక రాజవంశం ఒక గ్రామాన్ని బలపరచడం ద్వారా మగధకు పునాదులు వేసింది. తరువాత ఇది పాటాలిపుత్ర నగరంగా మారింది. బింబిసారుడు మొదటి రాజధాని గిరివ్రజా (రాజగ్రీహగా గుర్తించబడింది) వద్ద ఉంది. ఆయన తన తండ్రి రాజు బ్రహ్మదత్త చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి బహుశా అంగకు వ్యతిరేకంగా సైనిక పోరాటానికి నాయకత్వం వహించాడు. పోరాటం విజయవంతమైంది. అంగారాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువరాజు కునికా (అజతాశత్రు) ను చంపాకు రాజప్రతినిధిగా నియమించారు. బింబిసారుడి తన వైద్యుడైన జీవకాను పసికర్ల వ్యాధి నయం చేయడానికి అవంతి రాజు ప్రద్యోతుడి ఉన్న ఉజ్జయినికి పంపాడు. గాంధార రాజు పుక్కుసతి, బింబిసారుడిని ఒక రాయబార కార్యాలయాన్ని పంపాడు.

వివాహ సంబంధాలు

బింబిసార తన స్థానాన్ని బలోపేతం చేయడానికి వివాహ సంబంధాలను ఉపయోగించారు. ఆయన మొదటి భార్య కోసల దేవి, కోసల రాజు మహా కోసల కుమార్తె, ప్రసేనజితు సోదరి. ఆయన వధువు ఆయనకు కాశీని (అప్పటికి అది ఒక గ్రామంగా మాత్రమే ఉంది) కట్నం తీసుకుని వచ్చింది. ఈ వివాహం మగధ, కోసల రాజ్యాల మద్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపివేసి ఇతర రాజ్యాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చింది. తరువాత ఆయన లిచ్చావి రాజకుమారి " చెల్లన " ను వివాహం చేసుకున్నాడు. ఆమె రాజు కేతక కుమార్తె. ఆయన మూడవ భార్య " క్షేమ " మద్రా (పంజాబు) వంశానికి చెందిన మహిళ. మహావగ్గ ఆయనకు 500 మంది భార్యలు ఉన్నారని వర్ణించాడు.

మరణం

బింబిసారుడు 
Bimbisara's jail, where King Bimbisara was imprisoned, in Rajgir

మగధ రాజ్యం సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేసాడు. అజతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తరువాత తండ్రిని విడుదల చేయాలని ఆదేశించాడు. కాని అప్పటికి చాలా ఆలస్యం అయింది. బింబిసారా అప్పటికే మరణించాడు. ఇది క్రీ.పూ 491 లో జరిగినట్లు నివేదించబడింది.[ఆధారం చూపాలి]

సంప్రదాయ కథనాలు

జైనము

బింబిసారుడు శ్రేనికాగా గుర్తించబడ్డాడు. యంబధరు (ఒక జైన ముని) ప్రశాంతతకు ఆకర్షితుడై జైనమత భక్తుడిగా మారిన బింబిసారుడిని జైన సాహిత్యం రాజగృహ శ్రేనికాగా పేర్కొన్నది. ఆయన తరచుగా జైనమత దైవం అయిన మహావీరుడి సామవసరణాను సందర్శించే వాడు. అతను రామాయణం నిజమైన మూలకథను గురించి, ప్రఖ్యాతి చెందిన రాజర్షి (రాజు ప్రసన) గురించి అడిగాడు. ఆయన తన మునుపటి జీవితంలో ఒక బలభద్ర అని చెబుతారు.

జైన గ్రంథం ఆధారంగా బింబిసారుడు తన కొడుకు జైలు కైదు చేసిన తరువాత తనను తాను ఉద్రేకంతో చంపుకున్నాడు. పర్యవసానంగా ఆయన ప్రస్తుతం నివసిస్తున్న నరకంలో పునర్జన్మ పొందాడు. ఆయన పుట్టుకకు దారితీసిన కర్మలు ముగిసే వరకు ఆయన అక్కడ ఉంటాడు. భవిష్యత్తు తీర్థంకరుల గొలుసులో మొదటివాడు తరువాతి యుగం పైకి కదలిక (ఉత్సర్పిని) ప్రారంభంలో పెరగనున్న మహాపద్మ (కొన్నిసార్లు పద్మనాభ అని పిలుస్తారు) గా పునర్జన్మిస్తానని ఆయన వ్రాసుకున్నాడు.

బౌద్ధము

బౌద్ధ గ్రంథాల ఆధారంగా బింబిసారుడు రాజు బుద్ధుని జ్ఞానోదయానికి ముందు మొదటిసారి బుద్ధుడిని కలిశాడు. తరువాత కొన్ని ముఖ్యమైన బౌద్ధ సూత్రాలలో ప్రముఖంగా కనిపించే ఒక ముఖ్యమైన శిష్యుడు అయ్యాడు. ఆయన బౌద్ధమత బోధనలలో జ్ఞానోదయం పొందిన సోతాపన్న స్థితిని సాధించినట్లు నమోదు చేయబడింది. బింబిసారుడు స్త్రీలను బుద్ధుడిని ఆరాధించడానికి తన మందిరానికి రావడానికి సాయంకాల వేళలో అనుమతించాడు. స్త్రీలు ఎప్పుడైనా బుద్ధుడిని పూజించటానికి ఉపయోగించే జుట్టు, గోరు స్థూపాన్ని చూడాలని కోరుకున్నారు. వారి అభ్యర్థనను పాటించిన బింబిసారుడు బుద్ధుడితో మాట్లాడాడు.

ఇతరులు

పురాణాల ఆధారంగా బింబిసారుడు మగధను పాలించాడు. ఆయన పాలనా కాలం 28 – 38 సంవత్సరాలు ఉంటుంది. శ్రీలంక చారిత్రక రచనలు ఆయన 52 సంవత్సరాలు పాలించాడని పేర్కొన్నాయి.

మూలాలు

Tags:

బింబిసారుడు జీవితంబింబిసారుడు సంప్రదాయ కథనాలుబింబిసారుడు మూలాలుబింబిసారుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ మండలాలుపి.వెంక‌ట్రామి రెడ్డితెలంగాణ ఉద్యమందీపావళిభీమా (2024 సినిమా)శ్రీశైలం (శ్రీశైలం మండలం)భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాదసరారఘురామ కృష్ణంరాజురామ్ పోతినేనిమీనరాశికార్తెజవాహర్ లాల్ నెహ్రూజాతీయ విద్యా విధానం 2020రోహిత్ శర్మకమ్మఋగ్వేదంద్వాదశ జ్యోతిర్లింగాలుకొంపెల్ల మాధవీలతయూట్యూబ్బొత్స ఝాన్సీ లక్ష్మిప్రేమమ్సింహరాశిగూగుల్అక్కినేని నాగార్జునపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితీన్మార్ సావిత్రి (జ్యోతి)విశాల్ కృష్ణభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలువంగా గీతశ్రీలీల (నటి)రజాకార్ట్రైడెకేన్జోర్దార్ సుజాతమొదటి పేజీతెలుగునాట జానపద కళలుపాఠశాలవిద్యార్థిధనిష్ఠ నక్షత్రమురాజ్‌కుమార్పంచతంత్రంవ్యవస్థాపకతరామప్ప దేవాలయంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఆంధ్రప్రదేశ్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోడామన్పెళ్ళి (సినిమా)పసుపు గణపతి పూజసీతాదేవిసన్ రైజర్స్ హైదరాబాద్దేవినేని అవినాష్శ్రీ కృష్ణదేవ రాయలుతెలంగాణ శాసనసభఅమెజాన్ (కంపెనీ)తెలుగు సినిమాలు 2023రాహుల్ గాంధీరవితేజవ్యాసుడుమారేడుతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుమాధవీ లతఉమ్మెత్తఅతిసారంచార్మినార్పాములపర్తి వెంకట నరసింహారావుజయం రవితెలుగు వ్యాకరణంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవంతెనభూమిమంజుమ్మెల్ బాయ్స్ఇంద్రుడుబ్రాహ్మణ గోత్రాల జాబితాశ్రీనాథుడుచిరంజీవులుఉత్పలమాలగంటా శ్రీనివాసరావుభారతరత్న🡆 More