ప్రపంచ కళా దినోత్సవం

ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.

సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది.

ప్రపంచ కళా దినోత్సవం
ప్రపంచ కళా దినోత్సవం
లియొనార్డో డావిన్సి
జరుపుకొనే రోజుఏప్రిల్ 15
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభం

గ్వాడలజరాలో జరిగిన ప్రపంచ కళల అసోసియేషన్ యొక్క 17వ సమావేశంలో ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రతిపాదన పంపడంతోపాటూ 2012లో మొదటిసారిగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. టర్కీ దేశపు బెడ్రీ బయకమ్ ఈ ప్రతిపాదనకు సహాయం అందించగా, రోసా మరియా బురిల్లో వెలస్కో (మెక్సికో), అన్నే పుర్నీ (ఫ్రాన్స్), లియు డావీ (చైనా), క్రిస్టోస్ సైమోనైడ్స్ (సైప్రస్), అండర్స్ లిడెన్ (స్వీడన్), కాన్ ఐరీ (జపాన్), పావెల్ క్రాల్ (స్లొవేకియా), దేవ్ చౌరామున్ (మారిషస్), హిల్డే రాంగ్స్కోగ్ (నార్వే) తదితరులు సంతకాలు చేశారు. దాంతో ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించబడింది.

ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ఈ దినోత్సవం నిర్ణయించబడింది. కళా, ప్రపంచ శాంతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సహనం, సోదర, బహుళ సాంస్కృతికత, ఇతర రంగాలకు డావిన్సి ప్రతీకగా నిలిచాడు.

కార్యక్రమాలు

2012, ఏప్రిల్ 15న జరిగిన తొలి ప్రపంచ కళా దినోత్సవంకు టర్కీ, మెక్సికో, ఫ్రాన్స్, చైనా, సైప్రస్, స్వీడన్, జపాన్, స్లొవేకియా, మారిషస్, నార్వే దేశాలలోని ప్రపంచ కళల అసోసియేషన్ కు చెందిన అన్ని జాతీయ కమిటీలు, 150మంది కళాకారులు మద్దతు లభించింది. వెనుజులా దేశం డావిన్సీ గౌరవార్ధంగా పెయింటింగ్స్, శిల్పాలు, ప్రింట్లు, వీడియో, ఫోటోలతో చిత్ర ప్రదర్శనలను నిర్వహించింది. 2013లో దక్షిణాఫ్రికాలోని మోబోంబెలా మున్సిపల్ ఆర్ట్ మ్యూజియంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. గూగుల్ సంస్థ గూగుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ కళా దినోత్సవంకు తన మద్దతును అందించింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

అండాశయముసోమనాథ్అనసూయ భరధ్వాజ్ట్విట్టర్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానామనక్షత్రముద్వాదశ జ్యోతిర్లింగాలువై.యస్.రాజారెడ్డిపాండవులుభారత జాతీయపతాకంపచ్చకామెర్లునవరత్నాలుఉపనిషత్తుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుదేవులపల్లి కృష్ణశాస్త్రిఅనిల్ అంబానీఅనుపమ పరమేశ్వరన్జీమెయిల్ఉగాదినంద్యాల వరదరాజులరెడ్డిరజాకార్లుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాజాతీయములుకాలేయంనయన తారజీలకర్రఎస్. ఎస్. రాజమౌళిగాయత్రీ మంత్రంసత్యదీప్ మిశ్రాద్వారకా తిరుమలఆరూరి రమేష్ఉస్మానియా విశ్వవిద్యాలయంముదిరాజ్ (కులం)పరిటాల రవిరామావతారంముంతాజ్ మహల్గుండెతాజ్ మహల్గోకర్ణసాహిత్యంరామోజీరావుపెరుగుతెలుగు సంవత్సరాలుదగ్గుబాటి పురంధేశ్వరిజ్యేష్ట నక్షత్రంభారతీయ రైల్వేలువిజయశాంతిప్రభాస్హైన్రిక్ క్లాసెన్భారతరత్నభారత జాతీయ కాంగ్రెస్చేతబడిఅంటరాని వసంతంటైఫాయిడ్అంగుళంఅనపర్తిసెక్స్ (అయోమయ నివృత్తి)సీతాదేవిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిక్రైస్తవ మతంకేంద్రపాలిత ప్రాంతంక్రిస్టమస్శ్రీశైల క్షేత్రంమంగళసూత్రంగుణింతంరూప మాగంటిమార్చి 29హృదయం (2022 సినిమా)మృణాల్ ఠాకూర్నవధాన్యాలుగుడ్ ఫ్రైడేశివలింగంరైతుబంధు పథకంసమంతPHకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు🡆 More