కృతవర్మ

కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు.

ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం, హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్మ ప్రసక్తి కనిపిస్తుంది.

కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శమంతకమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వత్థామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది. మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేతిలో మరణించాడు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

కృష్ణుడుభాగవతంమహాభారతంసంస్కృతము

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీనాథుడుదగ్గు మందుఇతిహాసములువాతావరణంవేపగౌతమ బుద్ధుడుభారతదేశంలో బ్రిటిషు పాలనగంగా నదికావ్యమురాజశేఖర చరిత్రముజొన్నబ్రాహ్మణులుకనకదుర్గ ఆలయంపది ఆజ్ఞలుధర్మపురి శ్రీనివాస్నవరత్నాలుసౌందర్యలహరితోలుబొమ్మలాటవిరాట్ కోహ్లిరామాయణంలో స్త్రీ పాత్రలుయాగంటితెలంగాణ ఆసరా పింఛను పథకంగూండాఆల్కహాలుబుధుడు (జ్యోతిషం)నామనక్షత్రముఉత్తరాషాఢ నక్షత్రముమధుమేహంఅంగుళంమంచు మోహన్ బాబుచాట్‌జిపిటిపద్మశాలీలుమర్రిశాసనసభకాళోజీ నారాయణరావుహోళీడేటింగ్త్రివిక్రమ్ శ్రీనివాస్రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్బ్రహ్మక్వినోవావడ్రంగివిష్ణువు వేయి నామములు- 1-1000రంజాన్యేసుతోట చంద్రశేఖర్కళ్యాణలక్ష్మి పథకంసలేశ్వరందేవదాసితాజ్ మహల్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగ్రీన్‌హౌస్ ప్రభావంఆల్బర్ట్ ఐన్‌స్టీన్కన్యారాశిరామాఫలంగురువు (జ్యోతిషం)అన్నపూర్ణ (నటి)జాషువాభారతదేశంమలబద్దకంనరసింహ శతకముదగ్గుబాటి వెంకటేష్పార్శ్వపు తలనొప్పిఎం. ఎం. కీరవాణికావ్య కళ్యాణ్ రామ్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపంచతంత్రంజాతీయ సమైక్యతరాజీవ్ గాంధీవిష్ణు సహస్రనామ స్తోత్రముచెరువుతెలంగాణ మండలాలుఅంగచూషణPHలలితా సహస్రనామ స్తోత్రంచేపయోగాఆనం వివేకానంద రెడ్డిగూగుల్🡆 More