అమర్‌నాథ్

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని  జమ్మూ కాశ్మీర్ లో ఉంది.

హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.

అపురూపమైన మంచు శివలింగం

అమర్‌నాథ్ 
అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం

40మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం  వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి, సందర్శనకు వీలుగా ఉంటుంది.  ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ,  తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు.

హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవి కి ఈ గుహ  దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు.

ఈ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతీ సంవత్సరం  అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు.

చరిత్ర

300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.  ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.

అమర్నాథ్ గుహ ఆవిష్కరణ

మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టూ, తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దం లో తిరిగి కనుక్కున్నట్టు ఒక నమ్మకం.

ఇవీ చదవండి

References

Tags:

అమర్‌నాథ్ అపురూపమైన మంచు శివలింగంఅమర్‌నాథ్ చరిత్రఅమర్‌నాథ్ ఇవీ చదవండిఅమర్‌నాథ్జమ్మూ కాశ్మీర్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎల్లమ్మతెలుగు కథహనుమంతుడుమకరరాశిచోళ సామ్రాజ్యంకావ్య కళ్యాణ్ రామ్ఉలవలుఅథర్వణ వేదంబోనాలుబ్రహ్మంగారిమఠంమధుమేహంకుంభమేళాచాకలి ఐలమ్మకవిత్రయంగురువు (జ్యోతిషం)దాదాసాహెబ్ ఫాల్కేపోకిరిరాజాక్లోమముయక్షగానంజాతిరత్నాలు (2021 సినిమా)శేషాద్రి నాయుడుకిలారి ఆనంద్ పాల్వాల్మీకిచంపకమాలఇందిరా గాంధీవిడదల రజినిత్రిష కృష్ణన్తామర వ్యాధిభారతీయ జనతా పార్టీకామసూత్రక్షత్రియులురెడ్డిశ్రీనాథుడుగుప్త సామ్రాజ్యంఅష్ట దిక్కులుఅరటిద్రౌపది ముర్మురాశిభారతరత్నకారకత్వంరామబాణండొక్కా సీతమ్మశ్రీ కృష్ణదేవ రాయలుసిందూరం (2023 సినిమా)యుద్ధకాండసుభాష్ చంద్రబోస్భారతీయ రిజర్వ్ బ్యాంక్యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంభారతీయ సంస్కృతిబ్రాహ్మణ గోత్రాల జాబితావిజయ్ (నటుడు)భారత రాష్ట్రపతిశ్రీలీల (నటి)భారతీయ స్టేట్ బ్యాంకుబ్రహ్మంగారి కాలజ్ఞానంబంగారంమహాభారతంఈత చెట్టుపాండ్యులుజగ్జీవన్ రాంరాధఋగ్వేదంశ్రీశ్రీ రచనల జాబితాఆదిపురుష్విశాఖపట్నంతూర్పువిశాఖ నక్షత్రముసౌర కుటుంబందేవీ ప్రసాద్తెలంగాణ జాతరలుయేసుయూకలిప్టస్రెండవ ప్రపంచ యుద్ధంబంగారు బుల్లోడుగోపీచంద్ మలినేనిఆది పర్వముమానవ పరిణామంఎర్ర రక్త కణం🡆 More