స్టీవ్ బికో

బంటూ స్టీఫెన్ బికో (1946 డిసెంబరు 18-1977 సెప్టెంబరు 12) దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు.

సిద్ధాంతరీత్యా, ఆఫ్రికన్ జాతీయవాది, ఆఫ్రికన్ సామ్యవాది. 1960లు, 1970ల్లో నల్లజాతి చైతన్య ఉద్యమం నాయకుడు. ఫ్రాంక్ టాక్ అన్న మారుపేరుతో ప్రచురించిన వ్యాసాల్లో అతను తన ఆలోచనలు పొందుపరిచాడు.

తొలినాళ్ళ జీవితం

ఖోసా జాతికి చెందిన పేద కుటుంబంలో జన్మించిన బికో తూర్పు కేప్ ప్రాంతంలోని గిన్స్‌బర్గ్ టౌన్‌షిప్‌లో పెరిగాడు. 1966లో నాటాల్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసిస్తూండగా నేషనల్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ స్టూడెంట్స్‌లో చేరాడు. దక్షిణాఫ్రికాలో తెల్లజాతి మైనారిటీ వర్గం పరిపాలించడాన్నీ, వారి పరిపాలనలో జాతిపరంగా పౌరులను విడదీసే జాతి వివక్ష పద్ధతులనూ తీవ్రంగా వ్యతిరేకించాడు. నేషనల్ యూనియన్ ఆఫ్ సౌతాఫ్రికన్ స్టూడెంట్స్ సహా అన్ని జాతి వివక్ష వ్యతరేక గ్రూపులూ ఉదారవాదులైన తెల్లవారితో నిండిపోయివుండడం, అత్యంత దారుణమైన జాతి వివక్షా ప్రభావం చవిచూస్తున్న నల్లజాతి వారు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం బికోకి చాలా బాధ కలిగించేది. సదుద్దేశాలున్న వారైనా, ఉదారవాదులైన తెల్లవారు నల్లవారు ఎదుర్కొంటున్న జాతివివక్షను పూర్తిగా అర్థంచేసుకోలేరనీ, చాలాసార్లు ఉద్యమంలోని నల్లవారిపై ఒకవిధమైన పెద్దరికం చెలాయిస్తూంటారని అతను నమ్మేవాడు. తెల్లవారి ఆధిపత్యం నుంచి బయటకి రావాలంటే నల్లవారు స్వతంత్రంగా, విడిగా వ్యవస్థీకృతం కావాలని భావించి, 1968లో సౌత్ ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఎ‌ఎస్‌ఒ) స్థాపనలో ప్రధాన వ్యక్తిగా నిలిచాడు. దీనిలో సభ్యత్వం కేవలం నల్లవారికే పరిమితం చేశారు. ఇక్కడ నల్లవారన్న పదాన్ని కేవలం బంటు-భాష మాట్లాడే ఆఫ్రికన్లకు మాత్రమే కాక ఇతర నల్లవారికి, భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికా వారికీ కూడా విస్తరించేవాడు. ఉద్యమాన్ని ఉదారవాద తెల్లజాతీయుల ప్రభావానికి వెలుపల ఉంచేందుకు చాలా జాగ్రత్తపడేవాడు. అయితే అదే సమయంలో తెల్లవారిపై తిరుగుబాటుదారులు జాతివివక్ష ప్రదర్శించడాన్ని కూడా వ్యతిరేకించేవాడు. అతనికి పలువురు తెల్లజాతి స్నేహితులు, ప్రేమికులు ఉండేవారు. నల్లజాతి వారికే ప్రత్యేకించి ఎస్.ఎ.ఎస్.ఓ. సంస్థాపించడం జాతి విభజన స్ఫూర్తికి, జాతి వివక్షతకు మౌలికంగా సిద్ధాంత స్థాయిలో విజయమేనని భావించిన నేషనల్ పార్టీ ప్రభుత్వం ఈ చర్యను మొదట్లో ప్రోత్సహించింది.

తర్వాతి కాలం

ప్రాంజ్ ఫానన్ నుంచి, ఆఫ్రికన్-అమెరికన్ బ్లాక్ పవర్ ఉద్యమం నుంచీ స్ఫూర్తి పొందిన బికో, అతని సహచరులు ఎస్.ఎ.ఎస్.ఓ. అధికారిక సిద్ధాంతంగా నల్లవారి చైతన్యం స్వీకరించారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్ష నశించాలనీ, ప్రపంచంతో పాటుగా ముందడుగు వేయాలని, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను స్వీకరించాలనీ ఎస్.ఎ.ఎస్.ఓ. వారు తమ ఉద్యమ లక్ష్యంగా ఏర్పరుచుకున్నారు. ఉద్యమం నల్లవారికి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి, నల్లవారు మానసికంగా శక్తియుతులు కావడంపై దృష్టిసారించింది. నల్లజాతి ప్రజలు తమలో ఏ మాత్రం జాతిపరంగా కించభావన ఉన్నా దాన్ని వదిలించుకోవాలని బికో ఆశించాడు. "నలుపు అందమైనది" (బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్) అన్న అతని ప్రఖ్యాత నినాదం దీన్నే ప్రతిఫలిస్తోంది. నల్లజాతి చైతన్యం, సంబంధిత ఆలోచనలను ప్రచారం చేసేందుకు నల్లజాతి ప్రజల సమావేశం (బ్లాక్ పీపుల్స్ కన్వెన్షన్- బీసీపీ) స్థాపించడంలో అతను భాగమయ్యాడు. ప్రభుత్వం బికోను విద్రోహకరమైన, ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించి అతని కార్యకలాపాలను తీవ్రంగా నిర్బంధిస్తూ 1973లో నిషేధాజ్ఞలు విధించింది. ఆరోగ్యకేంద్రాలు, శిశుసంరక్షణ కేంద్రాల వంటివి బీసీపీల కింద నిర్వహిస్తూ రాజకీయంగా చైతన్యవంతంగా వ్యవహరించాడు. నిషేధాజ్ఞల సమయంలో పలుమార్లు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు, ప్రభుత్వ భద్రతా దళాలు చాలామార్లు అతణ్ణి నిర్బంధంలోకి తీసుకున్నాయి. 1977 ఆగస్టులో అతని అరెస్టు తర్వాత, బికోను ప్రభుత్వ భద్రతా దళ అధికారులు తీవ్రంగా కొట్టి చంపారు. 20 వేలమంది అతని అంత్యక్రియలకు హాజరయ్యారు.

స్పందన, ప్రభావం

మరణానంతరం బికో మరింత ప్రాచుర్యం పొందాడు. అతని గురించి అనేక పాటలు రాశారు, కళాకృతులు రూపొందించారు. 1978 లో డొనాల్డ్ వుడ్స్ రాసిన బికో జీవిత చరిత్ర ఆధారంగా 1987లో అతని స్నేహితుడు క్రై ఫ్రీడమ్ సినిమా తీశాడు. బికో జీవించివుండగా, తెల్లవారిని ద్వేషించాడని ప్రభుత్వం అతనిపై ఆరోపణలు చేసింది. పలువురు జాతి వివక్ష వ్యతిరేకోద్యమ కారులు, అతను లింగ వివక్ష చూపుతాడని విమర్శించారు. భారతీయులు, ఇతర శ్వేతేతర జాతుల వారితో ఐక్యసంఘటన నిర్మించడాన్ని నల్ల జాతి జాతీయవాదులు వ్యతిరేకించారు. ఏదేమైనా, బికో జాతివివక్షకు వ్యతిరేకోద్యమాలకు సంకేతంగా మారాడు. రాజకీయ మృతవీరునిగా, "నల్లజాతి చైతన్య పితామహుని"గా (ఫాదర్ ఆఫ్ బ్లాక్ కాన్షియస్‌నెస్) పేరొందాడు. రాజకీయంగా అతని వారసత్వం, అతని ఘనత ఇప్పటికీ వివాదాస్పదమే.

మూలాలు, ఆధారాలు

పాదసూచికలు

మూలాలు

Tags:

స్టీవ్ బికో తొలినాళ్ళ జీవితంస్టీవ్ బికో తర్వాతి కాలంస్టీవ్ బికో స్పందన, ప్రభావంస్టీవ్ బికో మూలాలు, ఆధారాలుస్టీవ్ బికోదక్షిణ ఆఫ్రికా

🔥 Trending searches on Wiki తెలుగు:

చిరంజీవిహైదరాబాదుసౌర కుటుంబంశివుడునవరసాలుతెలుగు నెలలుతెలుగు అక్షరాలుతెలుగు శాసనాలువై.యస్. రాజశేఖరరెడ్డిఆరెంజ్ (సినిమా)జాషువాబరాక్ ఒబామారాహువు జ్యోతిషంఆటవెలదిఆనం వివేకానంద రెడ్డిశ్రవణ నక్షత్రముఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభారత జాతీయపతాకంకులంతెలంగాణ జిల్లాలులక్ష్మితెలుగు పత్రికలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థస్వలింగ సంపర్కంతిరుపతిఅండాశయముచిరంజీవి నటించిన సినిమాల జాబితాఆది శంకరాచార్యులుకాకతీయుల శాసనాలుకాన్సర్బొల్లిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారోజా సెల్వమణిశక్తిపీఠాలుభారత ఎన్నికల కమిషనుపంచ లింగాలుభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాభగవద్గీతభూమి యాజమాన్యంతెలుగునాట ఇంటిపేర్ల జాబితాభద్రాచలంవినాయక్ దామోదర్ సావర్కర్కాకునూరి అప్పకవిభారతదేశ చరిత్రపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత జాతీయ కాంగ్రెస్మద్దాల గిరిపద్మశాలీలుఇస్లాం మతంరామోజీరావుజాతీయములుమహేంద్రసింగ్ ధోనిఅంగచూషణఅరుణాచలంఆవువడ్రంగిహోమియోపతీ వైద్య విధానంసెక్యులరిజంపంచతంత్రంఅరిస్టాటిల్వచన కవితహలో గురు ప్రేమకోసమేద్వాదశ జ్యోతిర్లింగాలుజిల్లెళ్ళమూడి అమ్మపురాణాలుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంపూర్వాషాఢ నక్షత్రముఆకు కూరలువేయి స్తంభాల గుడితెలంగాణ మండలాలుపెళ్ళి చూపులు (2016 సినిమా)వాస్తు శాస్త్రంవిన్నకోట పెద్దననాని (నటుడు)స్మృతి ఇరానిపంచారామాలుజంద్యముసంయుక్త మీనన్వసంత ఋతువు🡆 More