కొన్ని సందర్భాల్లో పేజీలలో మార్పులు జరగకుండా సంరక్షించాల్సి ఉంటుంది.
తెలుగు వికీపీడియా విధానాల్లో ఒకదాన్ని ఈ పేజీ అక్షరబద్ధం చేస్తోంది. వాడుకరులందరూ అనుసరించి తీరాల్సిన విధానాన్ని ఇది వివరిస్తుంది. దీనిలో మార్పులేమైనా చెయ్యాలంటే, వాటికి విస్తృత ఆమోదం (కన్సెన్సస్) ఆవశ్యకం. |
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: అందరూ సవరించేందుకు వీలయ్యేలా ఉండడం వికీపీడియా సూత్రమైనప్పటికీ కొన్నిసార్లు దుశ్చర్యలనూ, సవరణల పోరాటాలనూ, మరికొన్ని అనవసరపు సవరణలనూ ఆపడానికి కొన్ని పేజీలలో జరగగల దిద్దుబాట్లపై పరిమితులు విధించాల్సి ఉంటుంది. |
వికీపీడియా సూత్రమేమిటంటే ఎవరైనా ఏ విషయం గురించైనా మార్పులూ, చేర్పులూ చేసే అవకాశాన్ని కల్పించడం. దానికనుగుణంగా వీలైనన్ని పేజీలను వాడుకరులందరికీ దిద్దుబాట్లు చేసే అవకాశాన్నివ్వడం వికీ లక్ష్యం. ఐతే కొన్నిసార్లు పేజీలు చెడగొట్టబడుతూ ఉండి, నిరోధం వంటి చర్యలతో కూడా వాటిని సంతృప్తికరంగా నిర్వహించడం కుదరకుంటే, వాటిని సంరక్షించవలసి ఉంటుంది. ఈ విధాన వ్యాసంలో వివిధ సంరక్షణా స్థాయులూ, పద్ధతులూ, ఎప్పుడు సంరక్షించాలనే విషయాలూ వివరించడమైనది.
పేజీలో దిద్దుబాట్లు చెయ్యకుండా, బొమ్మలను మార్చకుండా, లేదా తరలించకుండా సంరక్షించే అధికారం నిర్వాహకులకు ఉంది. ఈ అధికారాలను పరిమితంగా వాడాలి; ఎందుకంటే సంరక్షిత పేజీలు హానికారకము కనుక.
సంరక్షణ సంబంధిత పరిమితులను శాశ్వతంగా అమలుచేయవచ్చు లేదా పరిమిత కాలం పాటు అమలు చేయవచ్చు. ఒక పేజీ సంరక్షించబడుతున్నప్పటికీ, దాని సోర్సు కోడ్ను ఎవరైనా చూడొచ్చూ, వాడుకోవచ్చూ.
సంరక్షించబడ్డ పేజీ పైన కుడి పక్కన ఒక చిన్న తాళంకప్ప కనిపిస్తుంది. దీన్ని {{pp-protected}}
మూస వాడి చేర్చవచ్చు.
నిర్వాహకులు కానివారు సంరక్షిత పేజీలలో మార్పులు చెయ్యదలిస్తే, ఆ మార్పులను సంబంధిత చర్చ పేజీలో ప్రతిపాదించాలి.
సెమి-శాశ్వత సంరక్షణ ను కింది సందర్భాలలో వాడతాము:
తాత్కాలిక సంరక్షణ కింది వాటికి వాడతాము:
పేజీ ఫలానా కూర్పు వద్ద సంరక్షించబడితే దానర్ధం - ఆ ఫలానా కూర్పుకు మా మద్దతు ఉన్నదని అర్ధం కాదు. కాబట్టి, సంరక్షణ వేరే కూర్పు వద్ద చెయ్యమని అడగవద్దు. చర్చా పేజీలు, సభ్యుని చర్చా పేజీలు మరీ తీవ్రమైన పరిస్థితులలో తప్ప సంరక్షించబడవు.
ఏదైనా పేజీ మొదటి పేజీ నుండి ఉన్న లింకు వలన గానీ, వేరే ఇతర కారణాల వలన గానీ బాగా వెలుగులో ఉంటే, సాధారణంగా అది దుశ్చర్యలకు గురవుతుంది. అటువంటపుడు దానిని సంరక్షించే బదులు, మీ వీక్షణ జాబితాకు చేర్చి, ఎప్పటికప్పుడు దుశ్చర్యలను పునస్థాపించండి.
నిర్వాహకులు తాము సంబంధం కలిగి ఉన్న పేజీలను (పేజీలో దిద్దుబాట్లు - మరీఓ చిన్నవి కాకుండా- చేసినా, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు రాసినా సంబంధం కలిగి ఉన్నట్లే ) సంరక్షించ రాదు. నిర్వాహకత్వం ఒక ప్రత్యేక హోదాగా కాక, నిర్వాహక విషయాలలో సభ్యులకు సేవకుడుగా భావించాలి. మీరు మీకు సంబంధం ఉన్న పేజీని సంరక్షించాలని భావిస్తే, మరో నిర్వాహకుడి సహాయం తీసుకోండి.
నిర్వాహకులు ఏదో ఒక పక్షపు అభిప్రాయాలకు అనుకూలంగా ఉండరాదు. దుశ్చర్యకు సంబంధించిన వివాదంలో దుశ్చర్యకు వ్యతిరేకంగా రెండో పక్షపు వాదనను బలపరచవచ్చు. అటువంటి వివాదాల్లో నిర్వాహకుడు దుశ్చర్యకు ముందటి కూర్పును సంరక్షించవచ్చు.
తాత్కాలికంగా సంరక్షించిన పేజీలను మరీ ఎక్కువ కాలం సంరక్షణలో ఉంచరాదు. మరియు వాటి చర్చా పేజీలను దిద్దుబట్లకు అనుమతించాలి. css, js వంటి పేజీలను సంరక్షించనవసరం లేదు.
సంరక్షిత పేజీలో మార్పులు చెయ్యకూడదనే విధానం సెమి-సంరక్షిత పేజీకి సంబంధించిన విధానం వంటిది కాదు. ఈ పేజీల విషయంలో నిర్వాహకులు సంబంధిత పేజీ విషయానికి సంబంధించిన మార్గదర్శకాలను, ఆ విషయంపై ఏకాభిప్రాయాన్నీ పాటిస్తూ దిద్దుబాట్లు చెయ్యాలి. మీరు చెయ్యదలచిన దిద్దుబాటు ముఖ్యమైనది అయ్యీ, అలా చెయ్యడం వివాదాస్పదం అయ్యేలా ఉంటే, ముందు దాన్ని చర్చా పేజీలో లేవనెత్తి చర్చించడం మంచిది.
తాత్కాలిక సంరక్షణ విషయంలో నిర్వాహకులు దిద్దుబాట్లు చెయ్యరాదు. అయితే కింది సందర్భాలలో నిర్వాహకులు దిద్దుబాటు నిర్ణయం తీసుకోవచ్చు:
మీరేదైనా పేజీని సంరక్షించినా, లేక ఏదైన సంరక్షించబడిన పేజీ రక్షిత పేజీల జాబితాలో లేనట్లు గమనించినా, సదరు పేజీని జాబితా లో చేర్చండి. ఎందుకు సంరక్షించారో ఒక చిన్న వివరణను — 10 పదాలకు మించకుండా — చేర్చండి. దాని గురించి ఇంకా చెప్పాలనుకుంటే, ఆ పేజీ యొక్క చర్చా పేజీ లో రాయండి.
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:సంరక్షణ విధానం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.