లిండ్సే లోహాన్

లిండ్సే డీ లోహన్ (జననం 1986 జూలై 2 ) ఒక అమెరికన్ నటి, గాయని, గీతరచయిత, నిర్మాత, వ్యాపారవేత్త.

న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన లోహన్ చిన్నతనంలో ఫోర్డ్ కార్లకు మోడలింగ్ చేసింది. టెలివిజన్ సోప్ ఒపెరా అనదర్ వరల్డ్‌లో 10 సంవత్సరాల వయస్సులో రెగ్యులర్‌గా కనిపించింది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ చిత్రం ది పేరెంట్ ట్రాప్ (1998) లో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. ఈ చిత్రం విజయంతొ టెలివిజన్ చలనచిత్రాలైన లైఫ్-సైజ్ (2000), గెట్ ఎ క్లూ (2002) ల్లోను, ఫ్రీకీ ఫ్రైడే (2003), కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టీనేజ్ డ్రామా క్వీన్ (2004) సినిమాలలోనూ కనిపించింది.

లిండ్సే లోహాన్
కెల్విన్ క్లేన్ 2007 ఫాషన్ షో పార్టీ తర్వాత లోహాన్
కెల్విన్ క్లేన్ 2007 ఫాషన్ షో పార్టీ తర్వాత లోహాన్
వ్యక్తిగత సమాచారం
జన్మనామం లిండ్సే డీ లోహన్
ఇతర పేర్లు లిలో
జననం (1986-07-02) 1986 జూలై 2 (వయసు 37)
న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సంగీత రీతి Pop, pop rock, R&B, dance-pop, teen pop
వృత్తి నటి, గాయని, fashion designer, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు 1996 — ప్రస్తుతము
Label(s) Casablanca (2004—2007)
Motown (2008—)
Website అధికార వెబ్సైట్

జీవిత విశేషాలు

లిండ్సే లోహన్ 1986 జూలై 2 న, న్యూయార్క్ నగరంలోని ది బ్రోంక్స్ బరోలో జన్మించింది. న్యూయార్క్‌, లాంగ్ ఐలాండ్‌లోని మెరిక్, కోల్డ్ స్ప్రింగ్ హార్బర్‌లో పెరిగింది. ఆమె దినా, మైఖేల్ లోహన్ ల పెద్ద సంతానం. మాజీ వాల్ స్ట్రీట్ వ్యాపారి అయిన ఆమె తండ్రి అనేక సందర్భాల్లో చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డాడు, ఆమె తల్లి మాజీ గాయని, నర్తకి. లోహన్‌కు ముగ్గురు చిన్న తోబుట్టువులు ఉన్నారు. వీరంతా మోడల్స్ లేదా నటులు. మైఖేల్ జూనియర్ (ది పేరెంట్ ట్రాప్ లో నటించాడు) అలియానా ("అలీ"), డకోటా "కోడి" లోహన్. లోహన్ ఐరిష్, ఇటాలియన్ వారసత్వానికి చెందినది. ఆమె కాథలిక్ గా పెరిగింది. లోహన్ కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ హై స్కూల్, శాన్ఫోర్డ్ హెచ్ కాలౌన్ హైస్కూలు లలో చదివింది.  

లోహన్ తల్లిదండ్రులు 1985 లో వివాహం చేసుకున్నారు, లిండ్సే మూడు సంవత్సరాల వయసులో వళ్ళు విడిపోయారు, తరువాత తిరిగి కలుసుకున్నారు. మళ్ళీ 2005 లో విడిపోయారు. 2007 లో వారి విడాకులు తీసుకున్నారు.

లోహన్ తొలుత నటించిన పాత్రల వలన ఆమెకు చిన్ననాడే స్టార్డమ్ వచ్చింది.స్లీపర్ హిట్, మీన్ గర్ల్స్ (2004) లు టీనేజ్ ఐడల్‌గా ఆమె స్థితిని ధ్రువీకరించాయి.. హెర్బీ: ఫుల్లీ లోడెడ్ (2005) లో నటించిన తరువాత, లోహన్ వ్యక్తిగత సమస్యలు, చట్టపరమైన ఇబ్బందుల కారణంగా తీవ్రమైన మీడియా కవరేజీకి వచ్చింది. అలాగే మాదకద్రవ్య దుర్వినియోగం కారణంగా అనేక సార్లు పునరావాస కేంద్రాల్లో ఉంది. ఈ కాలంలో ఆమె అనేక పాత్రలను కోల్పోయింది. ఆమె కెరీర్, పబ్లిక్ ఇమేజ్‌ దెబ్బతిన్నాయి. ఆ తరువాత, ఆమె ఎ ప్రైరీ హోమ్ కంపానియన్ (2006), జస్ట్ మై లక్ (2006), బాబీ (2006), చాప్టర్ 27 (2007) చిత్రాలలో నటించింది. 2010 లలో, ఆమె కొన్ని చిత్రాలలో నటించింది. వాటిలో ముఖ్యమైనవి మాచేట్ (2010), లిజ్ & డిక్ (2012), ది కాన్యన్స్ (2013). లోహన్ అప్పుడు డాక్యుమెంట్-సిరీస్ లిండ్సే (2014), బ్రిటిష్ సిరీస్ సిక్ నోట్ (2018), MTV రియాలిటీ షో లిండ్సే లోహన్స్ బీచ్ క్లబ్ (2019), ది మాస్క్డ్ సింగర్ ఆస్ట్రేలియా (2019-ప్రస్తుతం). లండన్ వెస్ట్ ఎండ్ ప్రొడక్షన్ ఆఫ్ స్పీడ్-ది-ప్లోవ్ (2014–15) లో కూడా ఆమె నాటక రంగ ప్రవేశం చేసింది.

లోహన్ కాసాబ్లాంకా రికార్డ్స్ క్రింద సంగీత పరిశ్రమలో పేరు తెచ్చుకుంది, రెండు స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేసింది. అవి, ప్లాటినం-సర్టిఫైడ్ స్పీక్ (2004), బంగారు-సర్టిఫికెట్ తెచ్చుకున్న ఎ లిటిల్ మోర్ పర్సనల్ (రా) (2005). లోహన్ ఫ్యాషన్‌లో దూసుకెళ్లి, 6126 అనే పేరుతో తనదైన శ్రేణిని ప్రారంభించింది. 2009 లో ఇమ్మాన్యుయేల్ ఉంగారోకు కళాత్మక సలహాదారుగా కొంతకాలం పనిచేసింది. 2016 నుండి, ఆమె గ్రీస్‌లో వరుస నైట్‌క్లబ్‌లు, రిసార్ట్‌లను అభివృద్ధి చేసింది.

మూలాలు

Tags:

న్యూయార్క్ రాష్ట్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాకాళేశ్వర జ్యోతిర్లింగంఇన్‌స్టాగ్రామ్దేవీ ప్రసాద్ఓం భీమ్ బుష్గుంటూరు కారంనరసింహ శతకమువ్యతిరేక పదాల జాబితాకింజరాపు అచ్చెన్నాయుడుగ్రామ పంచాయతీఉపనిషత్తుఅంగచూషణమహాభాగవతంరాధ (నటి)హిందూధర్మంమీనాజాతీయములుతెలంగాణా సాయుధ పోరాటంకరక్కాయషడ్రుచులుఈనాడుకిరణజన్య సంయోగ క్రియహస్త నక్షత్రమునాయీ బ్రాహ్మణులుసవర్ణదీర్ఘ సంధిఇందిరా గాంధీసమ్మక్క సారక్క జాతరఎస్. శంకర్తెలంగాణ ఉద్యమంవిశ్వనాథ సత్యనారాయణపార్లమెంట్ సభ్యుడుదశదిశలుసెక్స్ (అయోమయ నివృత్తి)అగ్నికులక్షత్రియులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుసర్దార్ వల్లభభాయి పటేల్షాజహాన్చేతబడిఇస్లాం మతంసతీ సావిత్రిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామార్చి2024 భారత సార్వత్రిక ఎన్నికలువిశ్వబ్రాహ్మణఅనపర్తి శాసనసభ నియోజకవర్గంజవాహర్ లాల్ నెహ్రూచెల్లమెల్ల సుగుణ కుమారిఅక్కినేని నాగ చైతన్యఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుపరశురాముడుకామసూత్రఅమృతా రావుదావీదుటాన్సిల్స్రాధసావిత్రి (నటి)రక్త పింజరిభారతీయ సంస్కృతిమూత్రపిండముసద్గురుసూర్యుడు (జ్యోతిషం)గజేంద్ర మోక్షంబారసాలభారతీయ రిజర్వ్ బ్యాంక్తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్నువ్వు నాకు నచ్చావ్రైతుబంధు పథకంతెలంగాణ జిల్లాల జాబితాపృథ్వీరాజ్ సుకుమారన్రాగులుపౌరుష గ్రంథిరచిన్ రవీంద్రనందమూరి తారక రామారావుLభారతదేశ చరిత్రఅల్లూరి సీతారామరాజురంగస్థలం (సినిమా)గీతా కృష్ణలోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More