మొఘల్ గార్డెన్స్

మొఘల్ గార్డెన్స్ అనేవి పెర్షియన్ శైలిలో మొఘలులు నిర్మించిన తోటలు.

ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. ఈ గార్డెన్స్ చుట్టూ ప్రహారీ ఉంటుంది. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం.

మొఘల్ గార్డెన్స్
పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న షాలిమర్ గార్డెన్స్. మొఘల్  యుగపు గార్డెన్లలో సుప్రసిద్ధమైనది.

చరిత్ర

మొఘల్ గార్డెన్స్ 
తోట నిర్మాణాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ పర్యవేక్షిస్తున్నట్టు వేసిన బొమ్మ

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్ బాగ్ ను తనకు ఇష్టమైన తోటగా అభివర్ణించారు. తోటను బాగ్, బగీచా అని అంటారు పెర్షియన్లు. ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటి చార్ బాగ్ అని కొందరి అభిప్రాయం. భారత్, పాకిస్థాన్బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. ఈ తోటల ప్రస్థావన బాబర్హుమాయూన్అక్బర్ ల జీవిత చరిత్రలలోనూ ఉంది. అలాగే యూరప్ కు చెందిన పర్యాటకులు భారత్ గురించి రాసిన "ది ఎకౌంట్స్ ఆఫ్ ఇండియా" వంటి పుస్తకాల్లోనూ ఈ తోటల గురించి ఉంది. కాన్స్ టెన్స్ విల్లియర్స్-స్టార్ట్ రాసిన గార్డెన్స్ ఆఫ్ ది గ్రేట్ మొఘల్స్(1913) అనేది మొఘల్ గార్డెన్స్ పై వచ్చిన మొట్టమొదటి పరిశోధనా గ్రంధం. ఈ రచయిత భర్త బ్రిటన్ కు చెందిన భారత సైన్యంలో కల్నల్ గా పనిచేసేవారు. వారు పింజోర్ గార్డెన్స్ లో నివసించేటప్పుడు ఆ మొఘల్ గార్డెన్ బాగోగులు చూసుకునే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె పుస్తకంలో ఒక గార్డెన్ ను ప్రభుత్వ భవనంగా మార్చక ముందు దాని శైలి ఎలా ఉందో వివరించారు. అదే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్. మొఘల్ గార్డెన్స్ పై ప్రస్తుత పరిశోధనా విషయాలు డంబర్టన్ ఓక్స్, స్మిత్ సనియన్ ఇన్స్టిట్యూషన్ ల ఆధ్వర్యంలో బయటకు వచ్చాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని  షాలిమర్  గార్డెన్స్ వంటి పలు తోటలు మొఘల్ గార్డెన్స్ కావడం  విశేషం.

మొఘల్ గార్డెన్స్ 
తాజ్ మహల్ వద్ద ఉన్న మొఘల్  గార్డెన్స్

మొఘల్ సామ్రాజ్య తొలినాళ్ళ నుంచే తోటల నిర్మాణం జరిగేది.  మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ లాహోర్, ఢోలాపూర్ లలో గార్డెన్స్  ను నిర్మించారు. ఆయన కుమారుడు హుమాయూన్ కాలంలో  ఎక్కువగా  తోటల నిర్మాణాలు జరగలేదు. రాజ్యాన్ని విస్తరించడం,  నిలబెట్టుకోవడంలోనే ఎక్కువకాలం గడిచిపోయింది. అయితే తండ్రి నిర్మించిన తోటల్లో ఎక్కువ సమయం హుమాయూన్ గడిపివారని  చరిత్రకారుల నమ్మకం. మొదట్లో అక్బర్ ఢిల్లీలో చాలా తోటల  నిర్మాణం చేశారు. ఆ తరువాత అక్బర్ తన కొత్త రాజధాని అయిన ఆగ్రాలో కూడా తోటలు కట్టించారు. ఈ కాలంలో నిర్మించిన తోటలు ఎక్కువగా కోటలలో కాక, నదుల ముందు ఉంటాయి. అక్బర్ కు  ముందు రాజులు కోటల్లో తోటలు నిర్మించినా, ఆయన నదుల ముందు నిర్మించడంతో అదే శైలి స్థిరపడిపోయింది. ఆ తరువాత అది మొఘల్ నిర్మాణ శైలిలోకి ఇమిడిపోయింది.

మూలాలు

Tags:

కాలువలుతోటసరస్సులు

🔥 Trending searches on Wiki తెలుగు:

నోటి పుండునవీన శిలా యుగంఅలసందతెలంగాణకూచిపూడి నృత్యంశిల్పా షిండేడిస్నీ+ హాట్‌స్టార్విజయ్ (నటుడు)సజ్జల రామకృష్ణా రెడ్డిఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌వన్ ఇండియాబలగంవృశ్చిక రాశిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅమ్మత్రిఫల చూర్ణంధనిష్ఠ నక్షత్రముదక్షిణామూర్తి ఆలయంరాబర్ట్ ఓపెన్‌హైమర్ట్విట్టర్లెజెండ్ (సినిమా)విశాఖ నక్షత్రముఅమెజాన్ నదికోయంబత్తూరుసీతాదేవితిరువణ్ణామలైవినాయక చవితిప్రియురాలు పిలిచిందిరామదాసుతెలుగు పదాలురోహిణి నక్షత్రంఉస్మానియా విశ్వవిద్యాలయంసచిన్ టెండుల్కర్విద్యసంస్కృతంమాయాబజార్గజేంద్ర మోక్షంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిమంచు మనోజ్ కుమార్2024 భారత సార్వత్రిక ఎన్నికలుబేటి బచావో బేటి పడావోచెల్లమెల్ల సుగుణ కుమారిరోహిత్ శర్మఆశ్లేష నక్షత్రముశాసనసభనాని (నటుడు)గురువు (జ్యోతిషం)జలియన్ వాలాబాగ్ దురంతంతెలంగాణా సాయుధ పోరాటంరెడ్డిఅనుష్క శర్మపింఛనుపాట్ కమ్మిన్స్శిబి చక్రవర్తిఎనుముల రేవంత్ రెడ్డిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సన్ రైజర్స్ హైదరాబాద్కడియం కావ్యసౌర కుటుంబంతెలుగు సంవత్సరాలుఎల్లమ్మఇంగువహనుమంతుడువాల్మీకిరావి చెట్టుబాల్యవివాహాలుఢిల్లీ డేర్ డెవిల్స్ఆవర్తన పట్టిక20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిగోవిందుడు అందరివాడేలేతెలుగు నెలలుకీర్తి రెడ్డినామనక్షత్రమువిజయ్ దేవరకొండలంబాడిఅయోధ్యభారత రాజ్యాంగం🡆 More