మాదాల నారాయణస్వామి

మాదాల నారాయణస్వామి (ఫిబ్రవరి 13, 1914 - డిసెంబర్ 9, 2013) సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు.

ఎంఎన్‌ఎస్‌గా ప్రసిద్ధిగాంచారు.

మాదాల నారాయణస్వామి
మాదాల నారాయణస్వామి

జననం

ఈయన ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో 1914, ఫిబ్రవరి 13 న జన్మించారు. తల్లిదండ్రులు: రాఘవులు, రాఘవమ్మ. 99ఏళ్ల వయస్సు గల ఎంఎన్‌ఎస్ ఉత్తమ కమ్యూనిస్టుగా, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ‘భారత- చైనా మిత్ర మండలి’ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ పనిచేశారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ డిగ్రీ తీసుకున్నారు. 1936లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 1946-1951 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో రహస్య జీవితం గడిపారు.ఆ సమయంలోనే తన సోదరుడు మాదాల కోటయ్య ఎన్‌కౌంటర్‌లో కోల్పోయారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా ఒంగోలు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుడిగానూ, పార్లమెంటు సభ్యుడిగానూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేశారు. రైతు కూలీల సమస్యలనూ, కార్మిక సమస్యలనూ చట్ట సభల్లో ప్రస్తావించి, వాటి సాధన కోసం పోరాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా కొల్లా వెంకయ్యతో కలిసి రాజీనామా చేశారు.

మరణం

2013, డిసెంబర్ 9 న గుంటూరులో మరణించారు., భార్య సులోచన కుమారుడు విద్యాసాగర్ కుమార్తె వీణ ఉన్నారు.

మూలాలు

Tags:

19142013డిసెంబర్ 9ఫిబ్రవరి 13

🔥 Trending searches on Wiki తెలుగు:

దత్తాత్రేయపిఠాపురంవై.యస్.అవినాష్‌రెడ్డిమరణానంతర కర్మలుయవలుఆర్యవైశ్య కుల జాబితాఇందిరా గాంధీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఇండోనేషియానాని (నటుడు)హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులురావణుడుతెలుగు సంవత్సరాలుభారతీయ శిక్షాస్మృతిఎస్. ఎస్. రాజమౌళిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావరిబీజంపచ్చకామెర్లుగుంటూరుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాతీహార్ జైలుసవర్ణదీర్ఘ సంధిహనుమాన్ చాలీసాతెలుగు పద్యముజోర్దార్ సుజాతచరవాణి (సెల్ ఫోన్)మానవ శరీరముపిచ్చుకుంటులవారుగజేంద్ర మోక్షంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅనిల్ అంబానీప్రేమలుసుందర కాండఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగోల్కొండఫ్లిప్‌కార్ట్స్వామి వివేకానందశివమ్ దూబేగుణింతంమధుమేహంమంతెన సత్యనారాయణ రాజుతెనాలి రామకృష్ణుడుతెలుగు సినిమాతెలంగాణ ప్రభుత్వ పథకాలుహనుమంతుడుఆశ్లేష నక్షత్రముహోళీపిత్తాశయమురుక్మిణీ కళ్యాణంహైన్రిక్ క్లాసెన్శ్రీముఖిభద్రాచలంతాజ్ మహల్స్వాతి నక్షత్రముప్రధాన సంఖ్యఎస్.వి. రంగారావుసత్యనారాయణ వ్రతందశదిశలుభారతదేశంఈస్టర్కల్పనా చావ్లారజాకార్లుఅంజలి (నటి)క్రికెట్మూత్రపిండముసామెతలుశాసనసభవందే భారత్ ఎక్స్‌ప్రెస్భరణి నక్షత్రముకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377గుండెజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరామాఫలంపూర్వాషాఢ నక్షత్రమురామోజీరావుహైదరాబాదుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ🡆 More