బస్టర్ కీటన్

జోసెఫ్ ఫ్రాంక్ బస్టర్ కీటన్ (1895 అక్టోబర్ 4 - 1966 ఫిబ్రవరి 1) అమెరికన్ నటుడు, హాస్యనటుడు, చిత్రనిర్మాత.

ఇతను మూకీ సినిమాల్లో తన కృషికి గాను ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా తన ట్రేడ్‌మార్క్ శారీరక హాస్యంతో (ఫిజికల్ కామెడీ) పాటుగా చలనం లేనట్టుగా ఉండే రాతిలాంటి హావభావాల వల్ల "ద గ్రేట్ స్టోన్ ఫేస్" (గొప్ప రాతి ముఖం) అన్న మారుపేరు పొందాడు. విమర్శకుడు రోజర్ ఎబర్ట్ 1920 నుంచి 1929 మధ్యకాలాన్ని కీటన్ కెరీర్లో అసాధారణమైన కాలం అని అభివర్ణించాడు. అతని ప్రకారం ఆ కాలంలో కీటన్ ఏ అంతరాయం లేకుండా తీస్తూ పోయిన సినిమాలు అతన్ని "సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నట దర్శకుడిగా" నిలబెట్టాయి. 1996లో ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ కీటన్‌ను గురించి "చాప్లిన్ కన్నా కీటన్ సినిమాలను ఎక్కువ అర్థం చేసుకున్నాడు" అని వ్యాఖ్యానిస్తూ అతిగొప్ప సినీ దర్శకుల జాబితాలో ఏడవ స్థానంలో నిలిపింది. 1999లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అతనికి క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లో అతిగొప్ప మేల్ స్టార్స్‌లో 21వ స్థానం ఇచ్చింది.

బస్టర్ కీటన్
బస్టర్ కీటన్
1925లో కీటన్
జననం
జోసెఫ్ ఫ్రాంక్ కీటన్

(1895-10-04)1895 అక్టోబరు 4
మరణం1966 ఫిబ్రవరి 1(1966-02-01) (వయసు 70)
లాస్ ఏంజెలస్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సమాధి స్థలంఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, హాలీవుడ్ హిల్స్, కాలిఫోర్నియా
వృత్తి
  • నటుడు
  • కమెడియన్
  • ఫిల్మ్ మేకర్
  • స్టంట్ మేన్
క్రియాశీల సంవత్సరాలు1899–1966
Works
అవర్ హాస్పిటాలిటీ, షెర్లాక్ జూనియర్, ద నేవిగేటర్, సెవెన్ ఛాన్సెస్, ద జనరల్, స్టీమ్‌బోట్ బిల్ జూనియర్
జీవిత భాగస్వామి
నటాలీ టాల్మడ్జ్
(m. 1921; div. 1932)
మే స్క్రివెన్
(m. 1933; div. 1936)
ఎలేనార్ కీటన్
(m. 1940)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • జో కీటన్ (తండ్రి)
  • మైరా కట్లర్ (తల్లి)

స్టూడియోతో సంబంధం లేని స్వతంత్ర నిర్మాతగా పనిచేస్తున్న జోసెఫ్ ఎం. షెంక్, ఫిల్మ్ మేకర్ ఎడ్వర్డ్ ఎఫ్, క్లైన్‌లతో కలసి కీటన్ విజయవంతమైన పలు రెండు-రీళ్ళ కామెడీలు తీశాడు. వాటిలో వన్ వీక్ (1920), ద ప్లేహౌస్ (1921), కాప్స్ (1922), ది ఎలక్ట్రిక్ హౌస్ వంటి సినిమాలు ఉన్నాయి. తరువాతి దశలో పూర్తి నిడివి సినిమాలు తీయడం ప్రారంభించాడు; వీటిలో షెర్లాక్ జూనియర్ (1924), ద జనరల్ (1926), స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ (1928), ద కెమెరామాన్ (1928) వంటివి గొప్ప పేరు సంపాదించుకున్నాయి. ద జనరల్ సినిమాని కీటన్ సినిమాల్లో మాస్టర్‌పీస్‌గా పరిగణిస్తారు. తర్వాతి తరం సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు ఆర్సన్ వెల్స్ ఈ సినిమాని "అతిగొప్ప కామెడీ, బహుశా అతిగొప్ప సినిమా కూడా" అని అభివర్ణించాడు. కీటన్ గురించి వెల్స్ మాట్లాడుతూ "అతను అన్ని ప్రశంసలకన్నా మించినవాడు... చాలా గొప్ప కళాకారుడు, తెరమీద నేను చూసిన అత్యంత అందమైన మగవాళ్ళలో అతనొకడు. అతను గొప్ప దర్శకుడు కూడా. చివరగా ఎవరూ అతన్ని సమీపించను కూడా లేరు" అన్నాడు. 2018లో బస్టర్ కీటన్ జీవితాన్ని, కెరీర్‌ని వివరిస్తూ పీటర్ బగ్దనోవిచ్ తీసిన ద గ్రేట్ బస్టర్: ఎ సెలబ్రేషన్ పేరిట డాక్యుమెంటరీ సినిమా విడుదలైంది. ఇందులో కీటన్ సినిమా కృషి, దాని ప్రభావంపై మెల్ బ్రూక్స్, కార్ల్ రీనర్, వెర్నర్ హెర్జోగ్, క్వెంటిన్ టరంటినో వంటి హాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. సైట్ & సౌండ్ వారి పోల్‌లో ద జనరల్ సినిమాని ప్రముఖమైన స్థానం దక్కింది.

మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ కంపెనీకి పనిచేయడం మొదలుపెట్టడం అతని కెరీర్‌లో క్షీణదశ ప్రారంభమైంది. స్టూడియోకి పనిచేసే క్రమంలో తన సృజనాత్మక స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం ఇందుకు ముఖ్యకారణం. ఈ దశలో కీటన్‌కి తన భార్య విడాకులు ఇచ్చింది. మద్యానికి బానిసయ్యాడు. 1940లో ఎలీనార్ నారిస్ ను పెళ్ళిచేసుకున్నాకా క్రమేపీ ఈ దశ నుంచి కోలుకున్నాడు. హాస్యనటునిగా తనకున్న ఇమేజ్‌ని తిరిగి ఉపయోగించుకుని కెరీర్ తిరిగి ప్రారంభించి మిగిలిన జీవితమంతా కొనసాగించాడు.1959లో అకాడమీ గౌరవ పురస్కారాన్ని పొందాడు. కెరీర్ చివరి దశలో వైల్డర్స్ సన్‌సెట్ బౌలేవార్డ్, చాప్లిన్ లైమ్‌లైట్, శామ్యూల్ బెకెట్ ఫిల్మ్, ట్విలైట్ జోన్ ఎపిసోడ్ " వన్స్ అపాన్ ఎ టైమ్"లో కీటన్ అతిధి పాత్రలు చేసాడు.

కీటన్ గురించి తరచుగా వినిపించే మాట ఏమిటంటే - "అతను తన కాలం కన్నా ముందున్నాడు" అని (ఎహెడ్ ఆఫ్ హిజ్ టైమ్). ఆంథోనీ లేన్ తన విశ్లేషణలో సినిమాలో సినిమా (షెర్లాక్ జూనియర్) వంటి సినిమాటిక్ టెక్నిక్స్ 1920ల్లోనే ఎలా కీటన్ ఉపయోగించుకున్నాడో రాశాడు.

మూలాలు

Tags:

రోజెర్ ఎబెర్ట్ (సినీ విమర్శకుడు)

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటకలగరశుక్రాచార్యుడుఅనసూయ భరధ్వాజ్శ్రీశైలం (శ్రీశైలం మండలం)తాజ్ మహల్యాదవదాశరథి కృష్ణమాచార్యబర్రెలక్కశ్రీకాంత్ (నటుడు)చిరుధాన్యంతిరుమలవీరేంద్ర సెహ్వాగ్వర్షం (సినిమా)తెలంగాణ రాష్ట్ర సమితితెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశ్రీనాథుడుపుష్యమి నక్షత్రముశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఇంద్రుడువడదెబ్బపొట్టి శ్రీరాములుతెలంగాణబోగీబీల్ వంతెనఅవకాడోపక్షవాతంనన్నయ్యనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంకనకదుర్గ ఆలయంవిడదల రజినిగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంవ్యవసాయంసంక్రాంతియేసుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కడియం శ్రీహరివసంత ఋతువునవలా సాహిత్యముఆంధ్రజ్యోతిపాముగాయత్రీ మంత్రంమదర్ థెరీసాపుచ్చసమాచార హక్కునయన తారకొమురం భీమ్బతుకమ్మఆరుద్ర నక్షత్రముబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిహస్త నక్షత్రముపేర్ని వెంకటరామయ్యవిద్యదేవుడుబి.ఆర్. అంబేద్కర్కర్ణుడుఆవువిశాఖపట్నంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థబొత్స సత్యనారాయణఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్భారతదేశ చరిత్రఉస్మానియా విశ్వవిద్యాలయంఅష్టదిగ్గజములురావణుడువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)కృత్తిక నక్షత్రముధనూరాశిభారత రాజ్యాంగ ఆధికరణలుప్రపంచ మలేరియా దినోత్సవంవిశ్వబ్రాహ్మణరాహువు జ్యోతిషంనితిన్ గడ్కరిసెక్స్ (అయోమయ నివృత్తి)గూగుల్సామజవరగమనకృపాచార్యుడువంతెనపూర్వాభాద్ర నక్షత్రముపేరు🡆 More