పరాశరుడు

పరాశరుడు వసిష్టుని మనుమడు,శక్తి మహర్షి పుత్రుడు.

ఇతని తల్లి అదృశ్యంతి. జోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు, పరాశరహోర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు.

పరాశరుడు
పరాశరుడు
పరాశరుడి చిత్రపటం
సమాచారం
కుటుంబంశక్తి మహర్షి (తండ్రి)
అదృశ్యంతి (తల్లి)
పిల్లలువ్యాసుడు (సత్యవతి వల్ల) జైమిని

జీవిత విషయాలు

సప్తర్షులలో ఒకరైన వశిష్టుడికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు. పరాశరుడు పుట్టే నాటికే శక్తిని రాక్షసుడు మింగేసాడు. పరాశరుడు పుట్టిన తరువాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్టుడి సలహాతో పరాశరుడు శివుడికి పూజలు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు. తన తండ్రి మరణానికి కారణమైన రాక్షసజాతి మొత్తాన్ని సంహరిస్తానని పరాశరుడు పగపట్టి, అందుకోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం వల్ల వందలాది రాక్షసులు మరణించారు. అయినా శాంతించని పరాశరున్ని శాంతింపచేసేందుకు వశిష్టుడు వచ్చి నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు. ఆ తరువాత యజ్ఞంలోని అగ్నిని హిమాలయాలకు ఉత్తరంగా విడిచిపెట్టి, తీర్థయాత్రలకు బయల్దేరాడు.

పరాశరుడు తీర్థయాత్రలకు వెళ్తూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధి అనే మత్స్యకార యువతిని చూచి మోహిస్తాడు. ఆమె కన్యత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోయేటట్లు వరం ప్రసాదించి, యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించగా, వారికి వేద వ్యాసుడు జన్మించాడు.

రచనలు

వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తోంది. రుగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్టుగా పేర్కొనబడ్డాయి.

గ్రంథాలు

  1. పరాశర స్మృతిశాస్త్రం
  2. పరాశర హోరశాస్త్రం
  3. కృషి పరాశర (వ్యవసాయం)
  4. వృక్షాయుర్వేద (వృక్షాలు)

మూలాలు


Tags:

వశిష్ఠుడుశక్తి మహర్షి

🔥 Trending searches on Wiki తెలుగు:

సంధ్యావందనంమియా ఖలీఫామాగంటి గోపీనాథ్తెలంగాణ ప్రభుత్వ పథకాలుప్రేమలుప్రతాప్ సి. రెడ్డిమొదటి ప్రపంచ యుద్ధంపరిటాల శ్రీరాములుతెనాలి రామకృష్ణుడుభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాచిత్త నక్షత్రముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాదశదిశలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిటబుడీజే టిల్లువాల్మీకినన్నయ్యమర్రి రాజశేఖర్‌రెడ్డిచరవాణి (సెల్ ఫోన్)మాగుంట శ్రీనివాసులురెడ్డివై. ఎస్. విజయమ్మగురజాడ అప్పారావుఉగాదినవధాన్యాలుత్రిఫల చూర్ణంనేదురుమల్లి జనార్ధనరెడ్డిమాదిగగర్భాశయముమంచు మనోజ్ కుమార్ఉప్పెన (సినిమా)పిఠాపురంఅంగారకుడు (జ్యోతిషం)కోజికోడ్కర్ణుడుదానం నాగేందర్తెలంగాణపిచ్చిమారాజుఅభినవ్ గోమఠంపునర్వసు నక్షత్రముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతెలుగు భాష చరిత్రనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిగుడ్ ఫ్రైడేశ్రీలీల (నటి)కసిరెడ్డి నారాయణ రెడ్డినెమలివిద్యుత్తుతెలంగాణ గవర్నర్ల జాబితారుక్మిణీ కళ్యాణంగూగుల్భారత రాష్ట్రపతివిశాఖపట్నంచైనాదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోకామినేని శ్రీనివాసరావుదక్షిణామూర్తి ఆలయంనవీన్ పొలిశెట్టిరాశిటంగుటూరి ప్రకాశంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజెర్రి కాటుసమాసంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిబి.ఆర్. అంబేద్కర్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసౌదీ అరేబియాభారతీయ సంస్కృతివై.యస్.అవినాష్‌రెడ్డి2024 భారత సార్వత్రిక ఎన్నికలుపసుపు గణపతి పూజరాజస్తాన్ రాయల్స్విజయ్ (నటుడు)వికీపీడియాజీలకర్రభారతదేశంలో కోడి పందాలుఇంద్రజ🡆 More