నింబార్కుడు

బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన మహామహులలో మరొక ప్రముఖుడు నింబార్కుడు.

నింబార్కాచార్య, నింబార్క, నింబాదిత్య లేదా నియమానంద అని కూడా పిలుస్తారు, ఇతను ఒక హిందూ తత్వవేత్త, వేదాంతవేత్త, ద్వైతాద్వైత (ద్వైత-అద్వైత) లేదా ద్వంద్వ-ద్వైతం యొక్క వేదాంతానికి ప్రధాన ప్రతిపాదకుడు. అతను దైవ జంట రాధ, కృష్ణుల ఆరాధనను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు, హిందూ శాఖ వైష్ణవ మతం యొక్క నాలుగు ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన నింబర్క సంప్రదాయాన్ని స్థాపించాడు.

నింబార్కుడు
ఉఖ్ర మహంత ఆస్థల్ (పశ్చిమ బెంగాల్) లోని ఆచార్య సన్నిధిలో నింబార్కాచార్య

కాలం, జన్మస్థలం

ఇతని జన్మస్థానం ఇథమిత్తంగా తెలియకపోయినా బళ్ళారిలోని నింబ గ్రామమనీ అందుకే ఇతనికి నింబార్కుడని పేరు వచ్చిందనీ అంటారు. మరొక ఊహ ప్రకారం ఇతనిది గోదావరీ తీరప్రాంతం. ఇతని జనన కాలంకూడా కచ్చితంగా తెలియదు. 11వ శతాబ్దం వాడని ఒక వాదమైతే 13వ శతాబ్దమని మరికొందరి లెక్క. ఇతడి తల్లిదండ్రులు జగన్నాథుడు, సరస్వతి.నింబార్క దాదాపు 11వ, 12వ శతాబ్దాల కాలంలో జీవించాడని నమ్ముతారు, అయితే మరికొందరు అతను 6వ లేదా 7వ శతాబ్దం CEలో శంకరాచార్య కంటే కొంత ముందు జీవించాడని సూచిస్తున్నారు. ఇతను దక్షిణ భారతదేశంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, అతను తన జీవితంలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గడిపాడు.

'నింబార్క' (निंबार्क) అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది నింబ (निम्ब), అర్క (అర్క). నింబార్కకు అతని పుట్టినప్పుడు 'నియమానంద' అనే పేరు పెట్టబడిందని నమ్ముతారు. ఒక జానపద కథ ప్రకారం, నియమానందకు నింబార్క అనే పేరు వచ్చింది, ఎందుకంటే అతను వేప (నింబా) ఆకులలో సూర్యరశ్మి (అర్కా) యొక్క కొన్ని కిరణాలను బంధించాడు. అతని అనుచరులు అతన్ని నింబాదిత్య అని కూడా పిలుస్తారు. నింబార్కను తత్వవేత్త భాస్కరతో గుర్తించడం వల్ల కొన్నిసార్లు భాస్కరుడు అతని సారాంశంగా కూడా పరిగణించబడ్డాడు. అతను స్థాపించిన సంప్రదాయానికి అతని పేరు పెట్టారు.

వీరిది వైష్ణవసాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా సనక మహర్షి నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది ద్వైతాద్వైతం. దీనినే భేదాభేదవాదం అని కూడా అంటారు.

రచనలు

బ్రహ్మసూత్రాలకు నింబార్కుడు వ్రాసిన భాష్యం పేరు "వేదాంత పారిజాత సౌరభం". దీనిని అర్థం చేసుకోవటానికి ఆయన శిష్యుడైన శ్రీనివాసాచార్యుడు "వేదాంత కౌస్తుభం" అనే వ్యాఖ్యానం వ్రాయవలసి వచ్చింది. దీనిని మరింత సుబోధకం చేయటానికి కేశవ కాశ్మీరీభట్టు "వేదాంత కౌస్తుభ ప్రభ" అనే మరొక వ్యాఖ్యాన గ్రంథం వ్రాసాడు.

భేదాభేదవాదం

బ్రహ్మము తాను సృజించిన జీవునికంటే వేరు కాడు. బ్రహ్మము అంశి. జీవుడు అంశం. అలాగే జగత్తు కూడా. అది బ్రహ్మం కంటే వేరు కాదు. సూర్యుని కాంతి కిరణాలు సూర్యుని కంటే ఎలా వేరు కావో అలాగే బ్రహ్మము కంటే జీవులు, జగత్తు వేరు కావు. బ్రహ్మానికి, వాటికి అభేదం ఉంది. అదే సమయంలో బ్రహ్మానికి, జీవజగత్తులకు భేదం కూడా ఉంది. సూర్యునికి, సూర్య కిరణాలకూ తేడా ఉంది. బ్రహ్మము స్వతంత్ర తత్త్వం. జీవజగత్తులు పరతంత్ర తత్త్వాలు. సూర్య కిరణాలమీద సూర్యుడు ఆధారపడి లేడు. సూర్యకిరణాలే సూర్యుడిమీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేకపోతే సూర్యకిరణాలు లేవు. అలాగే బ్రహ్మముమీద జీవజగత్తులు ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మము లేకపోతే అవి లేవు.

ఈవిధంగా ఒకే సమయంలో భేదం, అభేదం; ద్వైతం, అద్వైతం ఉండటంవలన ఈ సిద్ధాంతానికి భేదాభేదవాదమనీ, ద్వైతాద్వైతమని పేరు వచ్చింది.

బయటి లింకులు

Tags:

నింబార్కుడు కాలం, జన్మస్థలంనింబార్కుడు రచనలునింబార్కుడు భేదాభేదవాదంనింబార్కుడు బయటి లింకులునింబార్కుడుబ్రహ్మసూత్రాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాన్యుమోనియాస్టాక్ మార్కెట్చిరంజీవిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుగ్రామ పంచాయతీపెళ్ళిశ్రవణ నక్షత్రముఉత్తరాభాద్ర నక్షత్రమువిష్ణువు వేయి నామములు- 1-1000హను మాన్మూర్ఛలు (ఫిట్స్)రమ్య పసుపులేటితెలుగు సినిమాలు డ, ఢభీష్ముడుకల్క్యావతారముభారతదేశంలో విద్యతోటపల్లి మధుభారత ఆర్ధిక వ్యవస్థతెలంగాణ చరిత్రఅదితిరావు హైదరీవిశ్వబ్రాహ్మణపటిక బెల్లంసామెతల జాబితావర్షంభలే మంచి రోజుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీఘిల్లిసామెతలుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ఆంధ్రప్రదేశ్చిరంజీవులుజయలలిత (నటి)పంచారామాలుఉగాదిఆంధ్ర విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుటి. పద్మారావు గౌడ్దానం నాగేందర్విశ్వనాథ సత్యనారాయణరెడ్డిశ్రేయా ధన్వంతరిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశాసనసభఏప్రిల్ 27ఎన్నికలుఆవారాఅశోకుడుజైన మతంకామినేని శ్రీనివాసరావుఅమ్మ (1991 సినిమా)వసంత వెంకట కృష్ణ ప్రసాద్ఇజ్రాయిల్అమ్మఅరుణాచలంవై.యస్.రాజారెడ్డిపసుపు గణపతి పూజగంగా నదిమహేంద్రసింగ్ ధోనిభారతదేశ ప్రధానమంత్రిచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంబలగంసంస్కృతంవేమన శతకముఆర్టికల్ 370సాక్షి (దినపత్రిక)మానవ హక్కులువినాయకుడుఇతర వెనుకబడిన తరగతుల జాబితాజవాహర్ లాల్ నెహ్రూఉలవలువిద్యార్థిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకంప్యూటరుమానవ జీర్ణవ్యవస్థఆపిల్🡆 More