నంది: శివుని వాహనం

నంది (నందీశ్వరుడు) శివుని వాహనం.

శివుని సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు. శైవ సిద్ధాంత సంప్రదాయం ప్రకారం, శైవమత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఎనిమిది వేర్వేరు దిశల్లో పంపబడిన నంది ఎనిమిది మంది శిష్యులైన సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుములర్, వ్యాగ్రాపాడ, పతంజలి, శివయోగ మొదలైన మునులకు ఈయనే ప్రధాన గురువు. వియత్నాం హిందువులు చనిపోయినప్పుడు, నంది వచ్చి వారి ఆత్మను వియత్నాం నుండి భారత పవిత్ర భూమికి తీసుకువెళతారని అక్కడి వారు నమ్ముతారు.

నంది
నంది: పద చరిత్ర, చరిత్ర - ఇతిహాసాలు, నంది జెండా
నంది
దేవనాగరిनन्दि
అనుబంధంశివుని వాహనం
నివాసంకైలాసం
భర్త / భార్యసుయాస

పద చరిత్ర

నంది అనే పదం తమిళ మూల పదం అయినలో (తమిళం: నన్) నుండి వచ్చింది. దీని అర్థం పెరగడం, వృద్ధి చెందడం లేదా కనిపించడం. ఇది తెల్ల ఎద్దుల పెరుగుదల లేదా వృద్ధిని సూచించడానికి ఉపయోగించబడింది. అదేవిధంగా దైవత్వం కలిగిన ఎద్దును నందిగా భావిస్తారు. సంస్కృతంలో నంది అన్న పదానికి సంతోషం, ఆనందం, సంతృప్తి అనే అర్ధం ఉంది. శివుడి నంది దైవత్వ లక్షణాలతో కూడి ఉంటుంది. దాదాపు అన్ని శివాలయాలలో కూర్చున్న నంది విగ్రహాలు ఉంటాయి. అవి సాధారణంగా ప్రధాన మందిరానికి ఎదురుగానే ఉంటాయి.

నంది అనే పేరును ఎద్దుకు ఉపయోగించడమనేది ఇటీవలే డాక్యుమెంట్ చేయబడింది. సంస్కృత, తమిళం, ఇతర భారతీయ భాషలలోని పురాతన శైవ గ్రంథాలలో నంది శివుని వాహనంగానే కాకుండా కైలాసం ద్వార పాలకుడిగా ప్రస్తావించబడింది. సిద్ధాంత గ్రంథాలు ఎద్దు నుండి నందిని స్పష్టంగా వేరు చేస్తున్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం దేవి, చండేశ, మహాకాల, వాభ, నంది, గణేశ, భృంగి, మురుగన్ అనే ఎనిమిదిమంది శివుని గణాధిపతులు.

చరిత్ర - ఇతిహాసాలు

శివుడు, నందిల ఆరాధన సింధు లోయ నాగరికత కాలానికి చెందినది. 'పసుపతి ముద్ర' కూర్చున్న బొమ్మను వర్ణిస్తుంది. దీనిని సాధారణంగా శివుడిగా గుర్తిస్తారు. మొహెంజో-దారో, హరప్పాలలో అనేక ఎద్దు ముద్రలు ఉన్నాయి. నంది ఆరాధన సంప్రదాయం అనేక వేల సంవత్సరాలుగా ఉన్నదని వీటిని బట్టి తెలుస్తోంది.

నందిని శిరాదుడు అనే రుషి కుమారుడిగా అభివర్ణించారు. శిరాదుడు చేసిన యజ్ఞం నుండి వజ్రాలతో తయారు చేసిన కవచంతో నంది జన్మించాడని చెబుతారు. నందీశ్వరుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూ ఉండగా, ఒకరోజు నారదుడు వచ్చి ఈ బాలుడు అల్పాయుష్కుడు అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో శివుని కోసం ఘోర తపస్సు చేసిన నంది, ఎల్లప్పుడు శివున్ని చూస్తూ, సేవిస్తూ ఉండాలనే వరం కోరాడు. అలా నందీశ్వరుడు పూర్ణాయిష్కుడయ్యాడు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో నర్మదా నది ఒడ్డున ఉన్న ప్రస్తుత నందికేశ్వర్ ఆలయంలం.. త్రిపూర్ తీర్థ క్షేత్ర సమీపంలో ఒక పర్వతం పై ఉంది.

పార్వతి, శివుడికి బోధించిన అగామిక్, తాంత్రిక జ్ఞానం నుండి నందికి దైవిక జ్ఞానం లభించింది. నంది తన ఎనిమిది మంది శిష్యులైన సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుములర్, వ్యాగ్రాపాడ, పతంజలి, శివయోగలకు ఆ జ్ఞానాన్ని బోధించాడు. ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ఎనిమిది మంది శిష్యులను ప్రపంచంలోని ఎనిమిది వేర్వేరు దిశలలో పంపాడు.

నంది గురించి మరెన్నో పురాణ కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. లంక రాజ్యం ఒక కోతి (వనారా) చేత దహనం చేయబడుతుందని నంది రావణుడిని (లంక రాక్షసుడు) శపించగా, అశోక వాటికలో రావణుడు బంధించిన సీతను వెతుక్కుంటూ వెళ్ళిన హనుమంతుడు లంకను తగలబెట్టాడు.

తమిళ తిరువిలయదల్ పురాణంలో నంది తిమింగలం అవతారమెత్తిన మరో కథ ఉంది. శివుడు వేదాల అర్ధాన్ని పార్వతికి వివరించేటప్పుడు పార్వతి తన ఏకాగ్రతను కోల్పోగా, అప్పుడు ప్రాయశ్చిత్తం కోసం ఒక మత్స్యకారురాలుగా అవతరించింది. శివుడిని, పార్వతిని కలపడానికి నంది ఒక తిమింగలం రూపాన్ని ధరించి ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దాంతో ఆ మత్స్యకారురాలు (పార్వతి) తండ్రి, తిమింగలాన్ని చంపినవాడిని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. తరువాత, శివుడు ఒక మత్స్యకారుని అవతారం ధరించి తిమింగలాన్ని చంపి, పార్వతిని వివాహం చేసుకుంటాడు.

అగామాస్ నందిని జూ-ఆంత్రోపోమోర్ఫిక్ రూపంలో ఎద్దుల తల, నాలుగు చేతులతో జింక, గొడ్డలి, జాపత్రి, అభయముద్రతో వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలలో నంది శివుని వాహనంగా చిత్రీకరించబడింది. కాంబోడియాతో సహా ఆగ్నేయాసియా దేశాలలో కూడా ఈ రూపంలోనే ఉంటుంది.

ఎద్దుకున్న తెలుపు రంగు స్వచ్ఛత, న్యాయాన్ని సూచించగా... శివాలయాలలో గర్భగుడి వైపు కూర్చున్న నంది వ్యక్తి జీవాత్మను, మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని సూచిస్తుంది. నంది సంపూర్ణంగా తన మనస్సును శివుడిని అంకితం చేసింది.

నంది జెండా

నంది: పద చరిత్ర, చరిత్ర - ఇతిహాసాలు, నంది జెండా 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ శైవుల అధికారిక నంది జెండా

నంది జెండా (వృషభ జెండా) కూర్చున్న ఎద్దు యొక్క చిహ్నంతో ఉన్న జెండా శైవ మతం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో ఉంటుంది. పల్లవ రాజవంశం, జాఫ్నా రాజ్యం వంటి చారిత్రక తమిళ శైవ చక్రవర్తులు నందిని చిహ్నంగా ఉపయోగించారు. శ్రీలంక, తమిళనాడు, ప్రవాసుల తమిళ సమాజంలోని శైవులు తమ నంది జెండా గురించి తెలుసుకోవటానికి శివరాత్రి సందర్భంగా ప్రచారాలు నిరంతరం జరుగుతాయి.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న నంది జెండాను 1990లలో శ్రీలంక శైవుడు ఎస్. దనపాల మార్గదర్శకత్వంలో తమిళనాడు మధురైకి చెందిన రవీంద్ర శాస్త్రి రూపొందించాడు. శ్రీలంకలోని రత్మలానాలోని కొలంబో హిందూ కళాశాలలో 1998లో మొదటిసారిగా ఈ నంది జెండాను ఎగురవేశారు. 2008లో జూరిచ్‌లో జరిగిన నాల్గవ అంతర్జాతీయ శైవ సిద్ధాంత సమావేశంలో దీనిని అధికారికంగా శైవ జెండాగా ప్రకటించారు. ప్రస్తుతం, తమిళ శైవులు, ముఖ్యంగా శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ దేశాలలో జరిగే అన్ని మత, సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ జెండాను ఎగురవేస్తారు. నంది జెండాను శ్రీలంక అధికారిక హిందూ జెండాగా ప్రకటించారు.

ప్రసిద్ధి చెందిన నందీశ్వర విగ్రహాలు

  • బెంగుళూరు పట్టణంలో పెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఉంది.
  • శ్రీశైలం మల్లికార్జునదేవాలయములో పెద్ద ఏకశిల నంది ఉంది.
  • లేపాక్షిలో కల నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినది

చిత్రమాలిక

మాలాలు

Tags:

నంది పద చరిత్రనంది చరిత్ర - ఇతిహాసాలునంది జెండానంది ప్రసిద్ధి చెందిన నందీశ్వర విగ్రహాలునంది చిత్రమాలికనంది మాలాలునందిఅధిపతికైలాస పర్వతంపతంజలివాహనంశివుడుసనత్కుమారులు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతామర పువ్వుగ్లోబల్ వార్మింగ్సంగీతంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)పిత్తాశయముయాదగిరిగుట్టసుందర కాండవెల్లుల్లిమౌర్య సామ్రాజ్యంగురువు (జ్యోతిషం)లైంగిక సంక్రమణ వ్యాధిచే గువేరాజ్ఞానపీఠ పురస్కారంఉమ్మెత్తమాదిగసమంతయూకలిప్టస్దేవులపల్లి కృష్ణశాస్త్రిమిషన్ ఇంపాజిబుల్విశాఖపట్నంకాకతీయులుదక్షిణామూర్తిఈత చెట్టురామదాసువిరూపాక్ష దేవాలయం, హంపిఛందస్సుదశరథుడురుద్రమ దేవినందమూరి తారక రామారావులావు శ్రీకృష్ణ దేవరాయలుఇంగువపూర్వ ఫల్గుణి నక్షత్రముకుతుబ్ మీనార్గంగా నదిఛత్రపతి శివాజీరాశిరుద్రుడుఅమ్మవేముల ప్ర‌శాంత్ రెడ్డిజయసుధమర్రిపెరిక క్షత్రియులుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారత ప్రధానమంత్రులుపల్లెల్లో కులవృత్తులుజ్వరంనయన తారభారత రాష్ట్రపతిరామాయణంసామెతల జాబితాభారత ఎన్నికల కమిషనుచాగంటి కోటేశ్వరరావుజోష్ (సినిమా)హనుమంతుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఈనాడుమారేడుశ్రీరామనవమిమహాప్రస్థానంగుప్త సామ్రాజ్యంసిల్క్ స్మితభద్రాచలంచిలుకూరు బాలాజీ దేవాలయంపాండవులుతామర వ్యాధివృషభరాశిఅశ్వని నక్షత్రముశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)చాకలితెలంగాణ నదులు, ఉపనదులుఇందిరా గాంధీగ్రామంసావిత్రి (నటి)కాజల్ అగర్వాల్దగ్గుతెలంగాణ జాతరలునరసింహ శతకము🡆 More