దృష్టాంతాలంకారము

అలంకారము : రెండు వాక్యముల యందు ఉపమానోపమేయముల యొక్క వేరు వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించుట దృష్టాంతాలంకారము.

అనగా రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించి చెబితే దానిని దృష్టాంతాలంకారము అని అంటారు.

దృష్టాంతాలంకారం కేవలం కవిత్వప్రయోజనాలకే కాక, తర్కానికి కూడా మన దేశంలో ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు వివేక చూడామణిలో దృష్టాంత పద్ధతి ద్వారా చాలా విషయాలను బోధపరిచారు.

ఉదాహరణలు

ఉదా:1 : త్వమేవ కీర్తిమాన్ రాజన్! విధురేవ కాంతిమాన్.దీని అర్థము: ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు; చంద్రుడే కాంతిమంతుడు.

వివరణ: ఉపమాలంకరాములో ఉపమేయము, ఉపమానము, సమానధర్మము చూస్తాము. కానీ దృష్టాంతాలంకారంలో సమానధర్మం ఉండదు. కాకపోతే ధర్మాలకు మధ్యన పోలిక ఉంటుంది. ఉదాహరణ కీర్తికి, కాంతికి కొంత పోలిక ఉంది. రెండూ అన్నివైపులా ప్రాకుతాయి. అందుచేత వీటికి పొసిగింది. సూటిగా రాజుని చంద్రుడు అని కానీ, కీర్తి కాంతి వంటిది అని కానీ అనకపోయినా, రెండు వాక్యాల నిర్మాణం దాదాపు ఒకేలాగ ఉండటం వలన ఇది అర్థమౌతోంది.

శంకరాచార్యుని వివేక చూడామణిలో ఉదాహరణలు

  1. శత్రువులను జయించకుండా "నేను రాజుని" అన్నంత మాత్రాన రాజువు కావు. మాయని నశింపజేసి ఆత్మ తత్త్వం తెలుసుకోకుండా "బ్రహ్మం" అన్నంత మాత్రాన ముక్తి రాదు.
  2. దాచిపెట్టి ఉన్న నిధి "నువ్వు రా" అన్నంత మాత్రాన వచ్చిపడదు. మాయ అడ్డుగా నిలబడిన ఆత్మతత్త్వం  వాదనల వలన తెలియదు.
  3. చూస్తున్నది పాము కాదు, తాడు అని తెలిస్తే భయం పోతుంది. ఎదుటనున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది, మోక్షం కలుగుతుంది.
  4. ఈశ్వరుడి ఉపాధి మహత్, జీవుడి ఉపాధి పంచకోశం -- ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే -- అది బ్రహ్మం. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, డాలు పట్టుకున్నవాడు భటుడు. సింహాసనం, డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే.

సినిమాలలో

  1. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.
  2. కన్నీటికి కలువలు పూచేనా? కాలానికి ఋతువులు మారేనా?
  3. మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా? మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?

మూలాలు

Tags:

దృష్టాంతాలంకారము ఉదాహరణలుదృష్టాంతాలంకారము సినిమాలలోదృష్టాంతాలంకారము మూలాలుదృష్టాంతాలంకారముఅలంకారము

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వులువావిలాల గోపాలకృష్ణయ్యహస్త నక్షత్రముకల్వకుంట్ల చంద్రశేఖరరావుకర్ణాటకఅనసూయ భరధ్వాజ్బంతిపువ్వుతెనాలి రామకృష్ణుడువేయి స్తంభాల గుడిఆంధ్రప్రదేశ్సమాచార హక్కుఅండాశయముభారతీయ నాట్యంకుబేరుడుమా ఊరి పొలిమేరగుంటకలగరఅల్లు అర్జున్తెలంగాణ రాష్ట్ర సమితిసింధూ నదిపంచారామాలుశ్రీ కృష్ణదేవ రాయలుతెలుగు నాటకంవిశ్వనాథ సత్యనారాయణగిడుగు వెంకట రామమూర్తిబోనాలువృశ్చిక రాశిఆది శంకరాచార్యులుభారతదేశంలో జాతీయ వనాలుశ్రీ కృష్ణ కమిటీ నివేదికకేదార్‌నాథ్ ఆలయంబాబర్భారత ఎన్నికల కమిషనుద్రౌపదిసూర్యప్రభ (నటి)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంవిజయ్ (నటుడు)మాదిగఐశ్వర్య లక్ష్మిఎఱ్రాప్రగడఆంధ్రప్రదేశ్ జిల్లాలుతొట్టెంపూడి గోపీచంద్కాసర్ల శ్యామ్బసవేశ్వరుడుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోతిరుమలభారత రాష్ట్రపతిహృదయం (2022 సినిమా)వంగవీటి రంగాఅశ్వని నక్షత్రముకోటప్ప కొండబ్రహ్మంగారిమఠంకృష్ణ గాడి వీర ప్రేమ గాథచీకటి గదిలో చితక్కొట్టుడుపురుష లైంగికతయోగి ఆదిత్యనాథ్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశంలో విద్యతీన్మార్ మల్లన్నమరణానంతర కర్మలుబాలగంగాధర తిలక్దేవీ ప్రసాద్కృత్రిమ మేధస్సునరసింహ శతకముఏడుపాయల దుర్గమ్మ దేవాలయంపంచతంత్రంపరశురాముడుజ్యోతిషంపెరిక క్షత్రియులువారాహిఉసిరిస్వర్ణ దేవాలయం, శ్రీపురంరబీ పంటకుమ్మరి (కులం)మొలలుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంవిష్ణుకుండినులువై.ఎస్.వివేకానందరెడ్డిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅశ్వగంధ🡆 More