గర్భగుడి

దేవాలయములో 'మూలవిరాట్టు'గల ప్రదేశాన్ని'గర్భగుడి'అని అంటారు.

దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని ఉచ్ఛరించినపుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది.

గర్భగుడి
బేలూరు[permanent dead link] లోని చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో గర్భగుడి వద్ద ప్రార్థనలు చెస్తున్న భక్తులు. అందులో విష్ణువు మూలవిరాట్టు,
గర్భగుడి
తర్లుపాడు లో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గర్భగుడిలోని మూలవిరాట్టు

లోకం లోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భ పాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు.

విశేషాలు

శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూలవిరాట్టుగా మలిచి యంత్ర సహితంగా గర్భాలయములో ప్రతిష్ఠ చేస్తారు. ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా వుంటుంది. ఆలయం బయటంత శిల్ప సంపద, విద్యుత్ కాంతులు కనిపిస్తాయి. కానీ గర్భాలయంలో అలాంటివేమీ వుండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే 'దీపారాధన' వెలుగులో మాత్రమే కనిపిస్తుంటుంది.

గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రములనబడే రాగిరేకులకు చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుండి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్నిస్తుంది.

గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒక వైపుకు మాత్రమే వెళ్లాలని 'ఆగమ శాస్త్రం'చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా, ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతుంటారు.

తిరుమలలో గర్భగుడి

తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీ దేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్భుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించి ఆరాధింప బడుతున్నాడు.

వారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలసిన మహావిష్ణువును సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వారందరి మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన వలయంగా ఉంటుంది.

దేహంలో గర్భాలయం

దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి - ఈ గుడికి అదే తేడా ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ ' అన్నమాట. "దేహం దేవాలయం" అయితే, "హృదయం గర్భగుడి" అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

శిలాపద్మం

గర్భాలయం పై కప్పుమీద ఒక చక్రాన్ని చిత్రించడం కాకతీయుల ప్రత్యేకత. దేవాలయం పెద్దదయినా చిన్నదయినా గర్భాలయంలోని ఈశ్వరునికి పై భాగంలో అష్టకోణాలతో ఈ చక్రం కనిపిస్తుంది. గణపేశ్వరాలయపు గర్భాలయంలో అర్చామూర్తికి పైభాగంలో ఆలయపు పైకప్పుకు సౌష్టవాకారంలోని రాతి పద్మాలు వున్నాయి. దానిచుట్టూ ఒక క్రమపద్దతిలో చెక్కిన పద్మదళాలు కూడా వున్నాయి. ముక్కంటేశ్వర, వేణుగోపాల అంతరాలయ మంటపాలలోనూ, రంగమంటపంలో కూడా అందమైన పద్మనిర్మాణాలను గమనించవచ్చు.

ఇవి కూడా చూడండి

ఇతర విషయాలు

  • గర్భాలయం (నవల) - 2008 : ఇది ప్రాచీన భారతీయ ఇతిహాసాల్నీ, ఆధునిక సైకో అనాలసిస్ సిధ్ధాంతాల్నీ సహేతుకంగా సమన్వయించే, సస్పెన్స్ థ్రిల్లర్. దీనిని నండూరి శ్రీనివాస్ రాసాడు.

మూలాలు

బాహ్య లంకెలు

Tags:

గర్భగుడి విశేషాలుగర్భగుడి తిరుమలలో గర్భగుడి దేహంలో గర్భాలయంగర్భగుడి శిలాపద్మంగర్భగుడి ఇవి కూడా చూడండిగర్భగుడి ఇతర విషయాలుగర్భగుడి మూలాలుగర్భగుడి బాహ్య లంకెలుగర్భగుడిదేవాలయము

🔥 Trending searches on Wiki తెలుగు:

నోబెల్ బహుమతిహైదరాబాదుజే.సీ. ప్రభాకర రెడ్డియుద్ధంమాక్సిం గోర్కీతెలుగు పత్రికలుతాజ్ మహల్అల్యూమినియంవనపర్తివరలక్ష్మి శరత్ కుమార్దత్తాత్రేయఅష్టవసువులుసర్వనామముదగ్గుబాటి పురంధేశ్వరివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుసదాసత్యదీప్ మిశ్రావిడదల రజినిగుంటకలగరఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాYవంగా గీతపుట్టపర్తి నారాయణాచార్యులుగద్వాల విజయలక్ష్మివింధ్య విశాఖ మేడపాటిశ్రీవిష్ణు (నటుడు)శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)నేదురుమల్లి జనార్ధనరెడ్డిహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుసంధ్యావందనంసోరియాసిస్గరుడ పురాణంబాజిరెడ్డి గోవర్దన్పరిటాల శ్రీరాములుపోసాని కృష్ణ మురళిశ్రీరామనవమిశివ ధనుస్సుకాజల్ అగర్వాల్చరవాణి (సెల్ ఫోన్)రాగంభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాకన్యాశుల్కం (నాటకం)ఫేస్‌బుక్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిభాషా భాగాలుజిల్లెళ్ళమూడి అమ్మనువ్వు నాకు నచ్చావ్జనసేన పార్టీగర్భాశయముపిచ్చిమారాజువందే భారత్ ఎక్స్‌ప్రెస్రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్గుంటూరుకులంశతక సాహిత్యముశ్రవణ నక్షత్రమురక్షకుడుఉగాదితెలుగు వికీపీడియావ్యవసాయంఉలవలుయవలుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపూర్వాషాఢ నక్షత్రముAఅలసందఆక్యుపంక్చర్ఫిదాతెలుగు సినిమాలు 2024జమలాపురం కేశవరావుమధుమేహంఎన్నికలుఅధిక ఉమ్మనీరుసవర్ణదీర్ఘ సంధిభారత రాజ్యాంగంఅరవింద్ కేజ్రివాల్కరోనా వైరస్ 2019🡆 More