కుతుబ్ షాహీ వంశం

కుతుబ్ షాహీ వంశం (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశం లోని గోల్కొండ రాజ్యం పాలించిన పాలక వంశం.

ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు.

కుతుబ్ షాహీ

1512–1687
Location of కుతుబ్ షాహీ
రాజధానిహైదరాబాద్
సామాన్య భాషలుదక్కని, తర్వాత ఉర్దూ
ప్రభుత్వంMonarchy
కుతుబ్ షాహీ 
• 1518-1748
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్
• 1672-1687
అబుల్ హసన్ కుతుబ్ షా
చరిత్ర 
• స్థాపన
1512
• పతనం
1687
విస్తీర్ణం
500,000 km2 (190,000 sq mi)
Preceded by
Succeeded by
కుతుబ్ షాహీ వంశం బహుమనీ సామ్రాజ్యం
బ్రిటీష్ ఇండియా కుతుబ్ షాహీ వంశం

స్థాపన

కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యం పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రం ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టం స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశం స్థాపించాడు.

పరిపాలన

ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 175 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యం, న్యూఢిల్లీ సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారతదేశంలో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.

కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యానికి రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరాలును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.

వంశ క్రమం

ఈ వంశానికి చెందిన ఎనిమిది రాజులు క్రమంగా:

  1. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1512-1543)
  2. జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550)
  3. సుభాన్ కులీ కుతుబ్ షా (1550)
  4. ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580)
  5. మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612)
  6. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626)
  7. అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672)
  8. అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687)

1.సుల్తాన్ కులీ కుతుబ్ షా: ఇతని కాలం లో ఇతనికి సమకాలికులు 1. శ్రీకృష్ణ దేవరాయలు 2. బాబర్, హుమాయూన్

ఇతని రాజ్య విస్తరణకు కారకులయిన సేనాధిపతులు 1. హైధర్ ఉల్ముల్క్ 2. మురారీరావ్. మురారి రావ్ అహోభిలమ్ దేవాలయం పై దండెత్తాడు

మూలాలు

బయటి లింకులు

Tags:

కుతుబ్ షాహీ వంశం స్థాపనకుతుబ్ షాహీ వంశం పరిపాలనకుతుబ్ షాహీ వంశం వంశ క్రమంకుతుబ్ షాహీ వంశం మూలాలుకుతుబ్ షాహీ వంశం బయటి లింకులుకుతుబ్ షాహీ వంశంఆర్మేనియాగోల్కొండతుర్కమేనిస్తాన్దక్షిణ భారతదేశంముస్లింషియా

🔥 Trending searches on Wiki తెలుగు:

చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంఅశ్వని నక్షత్రముమృగశిర నక్షత్రముహను మాన్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాసన్ రైజర్స్ హైదరాబాద్పురాణాలుసాక్షి (దినపత్రిక)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుముదిరాజ్ (కులం)కింజరాపు రామ్మోహన నాయుడుగుండెత్రిష కృష్ణన్వంగా గీతషిర్డీ సాయిబాబాపెమ్మసాని నాయకులుకాలేయంబుగ్గన రాజేంద్రనాథ్పర్యాయపదంఇత్తడిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)వంగవీటి రంగాతెలుగు సినిమాలు 2023రాజోలు శాసనసభ నియోజకవర్గంఅక్షయ తృతీయట్రూ లవర్చింతామణి (నాటకం)కాకతీయుల శాసనాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారతన్ టాటాకీర్తి రెడ్డిఎవడే సుబ్రహ్మణ్యంఅక్కినేని నాగేశ్వరరావుశ్రీశైలం (శ్రీశైలం మండలం)మొహమ్మద్ రఫీ ( ప్రొఫెసర్ )అంజలి (నటి)పౌర్ణమి (సినిమా)నారా లోకేశ్పక్షవాతంకాశీకర్ర పెండలంట్విట్టర్ఎనుముల రేవంత్ రెడ్డిస్వామి వివేకానందనర్మదా నదిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంపాల్కురికి సోమనాథుడుఅలంకారంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డివినుకొండసూర్య నమస్కారాలుఅక్షరమాలవెంకటేశ్ అయ్యర్హనుమాన్ చాలీసామెదక్ లోక్‌సభ నియోజకవర్గంరాహువు జ్యోతిషంలలితా సహస్ర నామములు- 1-100విశాఖ నక్షత్రముమౌర్య సామ్రాజ్యంపార్శ్వపు తలనొప్పిలలిత కళలువై. ఎస్. విజయమ్మపూర్వ ఫల్గుణి నక్షత్రమునీతి ఆయోగ్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవిటమిన్ బీ12ఊరు పేరు భైరవకోనఆంధ్రజ్యోతికృత్తిక నక్షత్రముకృతి శెట్టిమే దినోత్సవంసముద్రఖనిగాయత్రీ మంత్రంకులంపేర్ని వెంకటరామయ్యఅసమర్థుని జీవయాత్రప్రజా రాజ్యం పార్టీసమాసం🡆 More