కాల్షియం హైపోక్లోరైట్

కాల్సియం హైపోక్లోరైట్ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.కాల్సియం, క్లోరిన్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళనపదార్థం ఏర్పడినది.

కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళన పదార్థం యొక్క రసాయన సంకేతపదం Ca (ClO) 2. సున్నం, కాల్సియం క్లోరైడ్ లమిశ్ర మైన ఈ రసాయన సంయోగ పదార్థాన్ని విపణి వీధిలో క్లోరిన్ పొడి లేదా విరంజన చూర్ణం (bleaching powder) అను పేరున అమ్మబడుచున్నది. దీనిని నీటిని శుద్ధికరణప్లాంటు లలో బ్లీచింగ్ కారకంగా ఉపయోగిస్తారు. సోడియం హైపోక్లోరైట్ కన్న కాల్సియం హైపోక్లోరైట్ ఎక్కువ స్థిరమైనది, ఎక్కువ ప్రమాణంలో క్లోరిన్ ను కలిగి ఉంది.

కాల్సియం హైపోక్లోరైట్ లేదా కాల్సియం ఆక్సీక్లోరైడ్
Calcium hypochlorite
పేర్లు
ఇతర పేర్లు
Hypochlorous acid, calcium salt
Bleaching powder, Calcium oxychloride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7778-54-3]
పబ్ కెమ్ 24504
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-908-7
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య NH3485000
SMILES [Ca+2].[O-]Cl.[O-]Cl
ధర్మములు
Ca(ClO)2
మోలార్ ద్రవ్యరాశి 142.98 g/mol
స్వరూపం white/gray powder
సాంద్రత 2.35 g/cm3 (20 °C)
ద్రవీభవన స్థానం 100 °C (212 °F; 373 K)
బాష్పీభవన స్థానం 175 °C (347 °F; 448 K) decomposes
నీటిలో ద్రావణీయత
21 g/100 mL, reacts
ద్రావణీయత reacts in alcohol
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము ICSC 0638
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R8, R22, మూస:R31, R34, R50
S-పదబంధాలు (S1/2), S26, S36/37/39, S45, S61
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
850 mg/kg (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium hypochlorite
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం హైపోక్లోరైట్ ఇతర పేర్లు

కాల్సియం హైపోక్లోరైట్ ను ఇంకా హైపోక్లోరస్ ఆమ్లం, కాల్సియం లవణం, బ్లీచింగ్ పౌడర్/విరంజన చూర్ణం, కాల్సియం అక్సిక్లోరైడ్ అనికూడా పిలుస్తారు.

భౌతిక లక్షణాలు/ధర్మాలు

సోడియం హైపోక్లోరైట్ తెల్లని ఘన పదార్థం.వ్యాపారస్థాయిలో ఉత్పత్తి చేసిన సోడియం హైపోక్లోరైట్ పసుపు రంగులో ఉండును.తేమ గలిగిన గాలిలో సోడియం హైపోక్లోరైట్ నెమ్మదిగా వియోగం చెందటం వలన ఘాటైన క్లోరిన్ వాసన కల్గి ఉన్నది. నీటిలో ద్రావణీయత మధ్యస్తంగా ఉండును.సాధు/మృదు జలంతో, మద్యస్థంగా కరినత కలిగిన నీటిలో దీనిని ఉపయోగిస్తారు. ఇదిపొడి (Dry), తడి (hydrated) రూపాలలో లభించును.

సోడియం హైపోక్లోరైట్ అణుభారం 142.98 గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత (20 °C) వద్ద సోడియం హైపోక్లోరైట్ సాంద్రత 2.35 గ్రాములు/సెం.మీ3.సోడియం హైపోక్లోరైట్ ద్రవీభవన స్థానం 100 °C (212 °F; 373K). సోడియం హైపోక్లోరైట్ బాష్పీభవన స్థానం 175 °C (347 °F; 448K), ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన పదార్థం విఘటన చెందును.

ద్రావణీయత

సోడియం హైపోక్లోరైట్ నీటిలో కరుగుతుంది. 100 మి.లీ.నీటిలో 21 గ్రాముల వరకు సోడియం హైపోక్లోరైట్‌ కరుగుతుంది. నీటితోచర్యజరుపును. అలాగే ఆల్కహాల్తో చర్యజరుపును.

ఉత్పత్తి

సోడియం హైపోక్లోరైట్ ను కాల్సియం హైడ్రాక్సైడ్/తడి సున్నంతో క్లోరిన్ వాయువు రసాయనచర్య వలన ఉత్పత్తి చేయుదురు.ఈ రసాయన చర్యలను దశలవారిగా/అంచెలంచెలుగావివిధ గాఢతలతో, వివిధ మేళనము (compositions) తో చేయుదురు.పూర్తి పరివర్తన ఈ దిగువ విధంగా ఉండును.

    2 Cl2 + 2 Ca(OH)2 → Ca(OCl)2 + CaCl2 + 2 H2O

బ్లీచింగ్ పౌడర్‌ను కొద్దిగా తడిగా ఉన్న సున్నంతో తయారు చేయుదురు.బ్లీచింగ్ పౌడర్ కేవలం కాల్సియం హైపోక్లోరైట్, కాల్సియం క్లోరైడ్, కాల్సియం హైడ్రాక్సైడ్‌ల మిశ్రమం మాత్రమే కాదు, ఈ మిశ్రమం ప్రధనంగా కాల్సియం హైపోక్లోరైట్ (Ca (OCl) 2), డైబేసిక్ కాల్సియం హైపోక్లోరైట్ (Ca3 (OCl) 2 (OH) 4), డైబేసిక్ కాల్సియం క్లోరైడ్ (Ca3Cl2 (OH) 4) లను కలిగి ఉంది.

రసాయన చర్యలు

సోడియం హైపోక్లోరైట్ కార్బన్ డయాక్సైడ్తో చర్యవలన కాల్సియం కార్బోనేట్ ఏర్పడి డైక్లోరిన్ మొనాక్సైడ్ విడుదల అగును.

    Ca(ClO)2 + CO2 → CaCO3 + Cl2O↑

కాల్సియం హైపోక్లోరైట్ ద్రవం ఒక క్షార ద్రావణం.కాల్సియం హైపోక్లోరైట్ అయాన్ జలవిశ్లేషణ కారణంగా ఏర్పడిన హైపోక్లోరస్ ఆమ్లం బలహీనమైన ఆమ్లం. కాని కాల్సియం హైడ్రాక్సైడ్ బలమైన క్షారము.అందుచేత కాల్సియం హైపోక్లోరైట్ అయాన్ బలమైన సందిగ్ద క్షారము, కాల్సియం అయాన్ (ion) బలహీనమైన సందిగ్ద ఆమ్లం (conjugate acid).

    ClO + H2O → HClO + OH

అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కాల్సియం హైపోక్లోరైట్ రసాయనచర్య వలన కాల్సియం క్లోరైడ్, నీరు, క్లోరిన్ ఏర్పడును.

    Ca(OCl)2 + 4 HCl → CaCl2 + 2 H2O + 2 Cl2

ఉపయోగాలు

పారిశుధ్యం

సాధారణంగా సోడియం హైపోక్లోరైట్‌ను పబ్లిక్ ఈతకొలనులను పారిశుధ్యం చేయుటకు,, త్రాగు నీటిలోని ప్రమాదకర సూక్ష్మజీవుల క్రిమిసంహారం (disinfect) చేయుటకు ఉపయోగిస్తారు.

సేంద్రియ రసాయన శాస్త్ర పరిధిలో వాడుక

సోడియం హైపోక్లోరైట్ సాధారణ ఆక్సీకరణ కారకం.అందువలన దీనిని సేంద్రియ రసాయన శాస్త్ర పరిధిలో ఉపయోగిస్తారు. ఉదాహారణకు గ్లైకోల్స్, α- హైడ్రాక్సీకార్బోక్సిలిక్ ఆమ్లాలను,, కేటోఆమ్లాలను విడగొట్టి ఖండిత అల్దిహైడులను, కార్బోక్సిలిక్ ఆమ్లాలను తయారు చేయుదురు. అలాగే సోడియం హైపోక్లోరైట్ ను హలోఫార్మ్‌రసాయన ప్రక్రియ (haloform reaction) లో క్లోరోఫారాన్ని ఉత్పత్తికావించుటలో ఉపయోగిస్తారు.

భద్రత

పొడిగా ఉన్న చల్లని స్థితిలో, సేంద్రియ రసాయనపదార్థాలకు దూరంగా కాల్సియం హైపోక్లోరైట్ భద్ర పరచెదరు.నిర్జల స్థితిలోకంటే జలయోజిత/ఆర్ద్ర స్థితిలోసురక్షితగా ఉపయోగించవచ్చును.

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు

Tags:

కాల్షియం హైపోక్లోరైట్ కాల్సియం హైపోక్లోరైట్ ఇతర పేర్లుకాల్షియం హైపోక్లోరైట్ భౌతిక లక్షణాలుధర్మాలుకాల్షియం హైపోక్లోరైట్ ఉత్పత్తికాల్షియం హైపోక్లోరైట్ రసాయన చర్యలుకాల్షియం హైపోక్లోరైట్ ఉపయోగాలుకాల్షియం హైపోక్లోరైట్ భద్రతకాల్షియం హైపోక్లోరైట్ ఇవికూడా చూడండికాల్షియం హైపోక్లోరైట్ మూలాలుఆధారాలుకాల్షియం హైపోక్లోరైట్ఆక్సిజన్కాల్సియంక్లోరిన్పరమాణువు

🔥 Trending searches on Wiki తెలుగు:

విశాల్ కృష్ణఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపెద్దమనుషుల ఒప్పందంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంకామసూత్రటీవీ9 - తెలుగుఘట్టమనేని మహేశ్ ‌బాబుసూర్యుడుభారత రాజ్యాంగ పీఠికభగవద్గీతఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్దూదేకులపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమడకశిర శాసనసభ నియోజకవర్గంతెలుగు ప్రజలుసిద్ధార్థ్పూర్వాభాద్ర నక్షత్రముజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంబాజిరెడ్డి గోవర్దన్దాశరథి కృష్ణమాచార్యపిఠాపురంకలబందతెనాలి రామకృష్ణుడుఆర్తీ అగర్వాల్భారత రాజ్యాంగ సవరణల జాబితాఉత్తరాషాఢ నక్షత్రముఅష్ట దిక్కులుహైదరాబాదునమితపర్యాయపదంశాసనసభ సభ్యుడుకొండా విశ్వేశ్వర్ రెడ్డిపేర్ని వెంకటరామయ్యఛత్రపతి శివాజీప్రభాస్రుద్రమ దేవితెలంగాణ ఉద్యమంపెమ్మసాని నాయకులువై.యస్.అవినాష్‌రెడ్డిఅన్నమయ్యవాట్స్‌యాప్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాశ్రీదేవి (నటి)ఇంటి పేర్లువేయి స్తంభాల గుడిజ్యేష్ట నక్షత్రంజోర్దార్ సుజాతగురజాడ అప్పారావుమల్లు రవివాయు కాలుష్యంఇందిరా గాంధీనవీన్ పట్నాయక్ఎయిడ్స్రెండవ ప్రపంచ యుద్ధందగ్గుబాటి పురంధేశ్వరిదివ్యవాణికృష్ణా నదికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సాహిత్యంవినాయక చవితిఅజిత్ అగార్కర్తమిళ అక్షరమాలఅల్లు అర్జున్అమర్ కంటక్చిరంజీవిత్రినాథ వ్రతకల్పంతోటపల్లి మధువై.యస్.రాజారెడ్డివై.ఎస్. జగన్మోహన్ రెడ్డికాశీకల్వకుంట్ల తారక రామారావుదక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గంశ్రీ రెడ్డిగరుత్మంతుడుసంస్కృతంభద్రాచలంగోవిందుడు అందరివాడేలేమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి🡆 More