కల్యంపూడి రాధాకృష్ణ రావు

సి.ఆర్.రావుగా పేరొందిన కల్యంపూడి రాధాకృష్ణారావు (1920 సెప్టెంబరు 10 - 2023 ఆగస్టు 22) గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు.

ఆయన అమెరికన్ భారతీయుడు. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్ గా చేసాడు. అతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ , మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు.

కల్యంపూడి రాధాకృష్ణారావు
కల్యంపూడి రాధాకృష్ణ రావు
ఏప్రిల్ 2012లో చెన్నైలోని ఐఎస్సై-భారత గణాంకశాస్త్ర సంస్థ వద్ద కల్యంపూడి రాధాకృష్ణారావు
జననం1920 సెప్టెంబరు 10
హదగళి, మైసూరు రాజ్యం,
బ్రిటీషు ఇండియా
మరణం2023 ఆగస్టు 22(2023-08-22) (వయసు 102)
బఫెలో, న్యూయార్క్, యు.ఎస్.
నివాసంభారతదేశం,
యునైటెడ్ కింగ్డమ్,
అమెరికా
పౌరసత్వంఅమెరికా
రంగములుగణితశాస్త్రం , గణాంకశాస్త్రం
వృత్తిసంస్థలుభారత గణాంకశాస్త్ర సంస్థ
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
పెన్న్ స్టేట్ విశ్వవిద్యాలయం
స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో
చదువుకున్న సంస్థలుఆంధ్ర విశ్వవిద్యాలయం
కలకత్తా విశ్వవిద్యాలయం
కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జి
పరిశోధనా సలహాదారుడు(లు)రోనాల్డ్ ఫిషర్
డాక్టొరల్ విద్యార్థులుRadha Laha
V. S. Varadarajan
S. R. Srinivasa Varadhan
ప్రసిద్ధిక్రేమర్–రావు పరిమితి
రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం
Orthogonal arrays
Score test
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్
National Medal of Science
S. S. Bhatnagar Prize
Guy Medal (Silver 1965, Gold 2011)

ప్రారంభ జీవితం

రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న బళ్ళారి జిల్లాలోని హదగళిలో తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవాడు. నూజివీడు, నందిగామ గ్రామాల్లో ఆయన చదివాడు. విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసాడు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) పూర్తి చేసాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందాడు. విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.[ఆధారం చూపాలి]ఆయన ఆ విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకును సాధించాడు. ఆ సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగం చేసాడు. ఆ సమయంలో ఎన్నో పరిశోధనలు చేసాడు. ఆ పరిశోధనలతో భాగంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నాడు. ఆయన పరిశోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రెస్ ఒక గ్రంథ రచనను వెలువరించింది. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.

మరణం

ఆయన 2023 ఆగస్టు 22న న్యూయార్క్‌లోని బఫెలోలో 102 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

మూలాలు

Tags:

అమెరికన్జెనెటిక్స్టైమ్స్ ఆఫ్ ఇండియా

🔥 Trending searches on Wiki తెలుగు:

చిరుధాన్యంకేంద్రపాలిత ప్రాంతంసాక్షి (దినపత్రిక)వర్షంఅమ్మల గన్నయమ్మ (పద్యం)కుమ్ర ఈశ్వరీబాయికానుగఅ ఆసజ్జల రామకృష్ణా రెడ్డిశ్రవణ కుమారుడుమానవ హక్కులుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నాయకత్వంజైన మతంపొగడఅల్లు అరవింద్వెంట్రుకడీజే టిల్లుబొత్స సత్యనారాయణద్విగు సమాసమునయన తారచిరంజీవి నటించిన సినిమాల జాబితాసిద్ధార్థ్కల్వకుంట్ల కవితఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్పెరిక క్షత్రియులుజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరఓ మై గాడ్ 2శ్రీముఖిఏప్రిల్ 27పల్లెల్లో కులవృత్తులుఉపద్రష్ట సునీతఉష్ణోగ్రతపాండవులువడ్రంగిభారత జాతీయగీతంభారతదేశ ప్రధానమంత్రిచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంకంప్యూటరు2014 భారత సార్వత్రిక ఎన్నికలుప్రబంధమురైలుమహేంద్రగిరిఅనుష్క శెట్టిగౌడపూజ భట్ఉత్తరాషాఢ నక్షత్రముప్లాస్టిక్ తో ప్రమాదాలురాజమండ్రికొండా సురేఖయువరాజ్ సింగ్సౌందర్యకాలుష్యంషర్మిలారెడ్డిఆహారంఐక్యరాజ్య సమితివిశాఖ నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డినాయీ బ్రాహ్మణులుమొహమ్మద్ రఫీ ( ప్రొఫెసర్ )శ్రీశైలం (శ్రీశైలం మండలం)గుంటూరు జిల్లాఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్వాయు కాలుష్యంజ్యేష్ట నక్షత్రంఅమెరికా సంయుక్త రాష్ట్రాలురాజస్తాన్ రాయల్స్భారతదేశంలో విద్యరామ్ చ​రణ్ తేజరతన్ టాటాసమాసంకీర్తి సురేష్బైబిల్ద్వాదశ జ్యోతిర్లింగాలుదాశరథి కృష్ణమాచార్యవిష్ణువువిజయనగర సామ్రాజ్యం🡆 More