ఇంప్రెషనిజం: 19వ శతాబ్దపు చిత్రకళా ఉద్యమం

ఇంప్రెషనిజం (ఆంగ్లం: Impressionism) 1870 లో ఫ్రాన్సులో చిత్రలేఖనానికి సంబంధించి ఉద్భవించిన ఒక కళా ఉద్యమం.

సాంప్రదాయిక చిత్రలేఖనానికి భిన్నంగా ఇంప్రెషనిజంలో రంగులు (ఒకదానితో మరొకటి గానీ, ఒక రంగును వేరే మాధ్యమంలో గానీ) కలపకుండా ఉపరితలం పై నేరుగా చుక్కలుగా అద్దుతూ గానీ, లేదా కుంచెతో ఘతాలుగా వేయబడుతూ గానీ, కాంతి పరావర్తనాన్ని (reflected light) చిత్రీకరించటం జరుగుతుంది. కాంతి, రంగు ల తాత్కాలిత ప్రభావాలతో దృశ్య వాస్తవికత (visual reality) ని కచ్చితంగా, నిష్పాక్షికంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఇంప్రెషనిజం యొక్క ప్రస్ఫుటమైన లక్షణం. ఒక వస్తువు పై గానీ, వ్యక్తి పై గానీ, గ్రామ సన్నివేశంలో గానీ కాంతి యొక్క ప్రభావాల చిత్రీకరణను ఇంప్రెషనిజంలో చూడవచ్చు. ఇంప్రెషనిజంలో సునిశితమైన వివరాల కంటే చిత్రీకరించబడే దృశ్యం యొక్క చుట్టుప్రక్కల వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అప్పటికి వేళ్ళూనుకొని పోయిన చిత్రలేఖన శైలులను సవాలు చేసినందుకు, ఆధునికతకు, నూతన సాంకేతికతలను, భావాలను పుణికిపుచ్చుకొన్నందుకు, ఆధునిక జీవన విధానాన్ని చిత్రీకరించినందుకు, చిత్రలేఖన చరిత్రను కీలక మలుపు తిప్పినందుకు ఇంప్రెషనిజం కొనియాడబడుతుంది. చిత్రకళలో మాడర్న్ ఆర్ట్ సిద్ధించటానికి కూడా ఇంప్రెషనిజం ఉత్ప్రేరకంగా ఉపయోగపడింది.

ఇంప్రెషనిజం: వ్యుత్పత్తి, చరిత్ర, శైలి
క్లౌడే మోనెట్ చిత్రీకరించిన Impression, Sunrise. ఈ చిత్రలేఖనంలో తన స్వస్థలమైన పోర్ట్ లే హావ్రే సముద్రపు నీటిపై సూర్యోదయం యొక్క ప్రభావాన్ని చిత్రీకరించాడు

వ్యుత్పత్తి

1874 లో క్లౌడే మోనెట్ తన స్వస్థలం అయిన పోర్ట్ లే హావ్రేలో సూర్యోదయాన్ని చిత్రీకరించి, ఈ చిత్రలేఖనానికి Impression, Sunrise అనే పేరు పెట్టాడు. లూయిస్ లెరాయ్ అనే కళావిమర్శకుడు ఇది Impression ను కలుగజేసే ఒక అసంపూర్తి స్కెచ్ వలె ఉంది అనటంతో ఈ కళా ఉద్యమానికి ఇంప్రెషనిజం అనే పేరు సార్థకం అయ్యింది. ఇంప్రెషన్ అనేది దేని గురించైనా ఒక ఆలోచన, భావన. దైనందిన జీవితం లోని సన్నివేశాలను ఇంప్రెషనిస్టులు తమ చిత్రలేఖనాలలో బంధించేవారు.

చరిత్ర

ఇంప్రెషనిజం: వ్యుత్పత్తి, చరిత్ర, శైలి 
1874 లో ఎడోవార్డ్ మానెట్ చే చిత్రీకరించబడిన Boating. అప్పటి వరకూ వాడని కృత్రిమ రంగులు మానెట్ ఈ చిత్రలేఖనంలో వాడాడు. ఇందులో జపనీస్ కూర్పు ఉన్నట్లు కళావిశ్లేషకులు గమనించారు. చిత్రీకరించబడిన వారి ఆకారాలు, స్వభావం, చిత్రీకరణకు వాడబడిన పదార్థాలు అన్నీ అప్పటికి ఆధునికమే.

అప్పట్లో ఫ్రాన్స్ లో ఒక చిత్రలేఖనం ప్రదర్శితమవ్వాలన్నా, బహుమతి గెలుపొందాలన్నా Académie des Beaux-Arts (Academy of Fine Arts) యొక్క సభ్యులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే Salon సమీక్ష అవసరం. అయితే చిత్రలేఖనం అనేది పౌరాణిక సన్నివేశాలకు, యుద్ధ సన్నివేశాలకు సంబంధించినది అయ్యి ఉండాలి, తప్పితే ప్రముఖుల ముఖ చిత్రం అయ్యి ఉండాలి అనేది సెలూన్ నియమం.

1874 లో క్లౌడే మోనెట్, ఎద్గార్ డిగాస్, కమిల్లే పిస్సారో వంటి వారు సభ్యులుగా Société Anonyme Coopérative des Artistes Peintres, Sculpteurs, Graveurs (Cooperative and Anonymous Association of Painters, Sculptors, and Engravers) అనే ఒక కళాకారుల సమూహం ఏర్పడి పారిస్లో ఒక కళా ప్రదర్శన నిర్వహించింది. ఈ కళాకారుల సమూహం యొక్క ఏకైక లక్ష్యం, కళలపై సెలూన్ విధించిన కఠినమైన నియమనిబంధనల నుండి స్వాతంత్ర్యం. ఈ సమూహంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన శైలి అయిననూ సమూహంగా వీరి శైలి సమకాలీకంగా పరిగణించబడింది. వీరి కళాఖండాలు అసంపూర్ణమైనవిగా, స్కెచ్ ల వలె అనిపిస్తూనే, ఆధునిక జీవనశైలిని స్పృశించాయి.

శైలి

ఇంప్రెషనిజం ప్రధానంగా ఆరుబయటి సన్నివేశాలు చిత్రీకరించేది. ముందుగా స్కెచ్ లు వేసుకొని స్టూడియోలలో ఈ స్కెచ్ లను పూర్తి స్థాయి చిత్రలేఖనాలుగా అభివృద్ధి చేసుకొనే పురాతన శైలికి ఇంప్రెషనిజం స్వస్తి పలికింది. స్కెచ్ లు వేయకుండా అక్కడికక్కడే పూర్తి స్థాయి చిత్రలేఖనాలు వేయబడటం, ఇంప్రెషనిజంతో మొదలైంది.

పారిస్ నగర శివారు ప్రాంతాల, ఫ్రాన్స్ దేశపు గ్రామీణ సన్నివేశాలకు ఇంప్రెషనిజం పెద్దపీట వేసింది. వారాంతాలలో పారిస్ నగర వాసులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సెలవులను ఆనందమయం చేసుకొనేవారు. వీరి చిత్రలేఖనాలను, గ్రామీణ ప్రాంతాల ఆటవిడుపు కార్యక్రమాలను ఇంప్రెషనిస్టులు చిత్రీకరించారు. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం వలన ప్యారిస్ లో విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఇంప్రెషనిస్టులు నగర సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం కూడా ఇచ్చింది. నర్తకులు, గాయకులు, నాటకరంగం, కేఫేలు వంటివి చిత్రీకరించబడ్డాయి.

నైపుణ్యం

ఇంప్రెషనిజం శైలి చిత్రలేఖనానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది. కాంతి, రంగుల పై అధికమైన అవగాహన, సమయం గడిచే కొద్దీ (చిత్రలేఖనం ప్రారంభించినప్పటి నుండి పూర్తి చేసే వరకు) సూర్యుని చలనం వలన దృశ్యం లో, అందులోని రంగులల వచ్చే తాత్కాలిత మార్పులను జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు మారే కాంతిని చిత్రీకరించటానికి కుంచె వేగంగా కదలవలసి వస్తుంది, అనగా పొడవాటి ఘతాలు కాకుండా చిన్న చిన్న ఘతాలతోనే కాంతి యొక్క ప్రభావాలు చిత్రీకరించవలసి వస్తుంది.

లక్షణాలు

ఇంప్రెషనిజం: వ్యుత్పత్తి, చరిత్ర, శైలి 
1878 లో ఆల్ఫ్రెడ్ సిస్లీ చే చిత్రీకరించబడ్డ Allée of Chestnut Trees సాంప్రదాయ చిత్రలేఖనంలో వ్యయప్రయాసలకు ఓర్చి చేయబడే కూర్పును ఇంప్రెషనిస్టులు వారి సులభతరమైన కూర్పుతో సవాలు విసిరారు

ఈ కళాకారుల సమూహం తమ చిత్రలేఖనాలలో ప్రధానంగా ఈ క్రింది లక్షణాలు కనబడేలా చూసేవారు

  • ఎటువంటి ఆకారం లేని చిన్న చిన్న కుంచె ఘతాలు. అవి కూడా ఎక్కువ పనితనం లేకుండా ఉండటం
  • పరిపూరకమైన రంగులు (complementary colors) ఒకదానిలో మరొకటి కలపకుండా, ఒకదాని ప్రక్కన మరొక రంగును ఉపయోగించటం
  • కాంతి యొక్క ప్రభావం పై ప్రత్యేక శ్రద్ధ
  • నీడలకు సైతం (కేవలం నలుపు, తెలుపు, ఆ రెండింటి కలయికలు కాకుండా ఇతర) రంగులు అద్దబడి ఉండటం. మంచు వంటి వాటిని చిత్రీకరించటంలో కేవలం నలుపు, తలుపు వాటి మిశ్రమాలే కాక ఇతర రంగులను కూడా ప్రయోగించవలసిన అవసరం గుర్తించబడటం
  • ఫోటోగ్రఫీని తలపింప జేసే కూర్పు

విమర్శ

ఇంప్రెషనిజం పై చిత్రకళకు పట్టిన శనిగ్రహం (Pure Evil), భయానకం (A chamber of Horrors), కోతి చేతికి రంగులు ఇచ్చినట్లు ఉంది వంటి విమర్శలు వెల్లువెత్తాయి

ప్రభావాలు

ఇంప్రెషనిజం క్రొత్త కళా ఉద్యమాలకు తెర తీసింది. నియో-ఇంప్రెషనిజం, పోస్ట్-ఇంప్రెషనిజం, ఎక్స్ప్రెషనిజం, ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటివి ఇంప్రెషనిజం నుండే ఉద్భవించాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఇంప్రెషనిజం వ్యుత్పత్తిఇంప్రెషనిజం చరిత్రఇంప్రెషనిజం శైలిఇంప్రెషనిజం నైపుణ్యంఇంప్రెషనిజం లక్షణాలుఇంప్రెషనిజం విమర్శఇంప్రెషనిజం ప్రభావాలుఇంప్రెషనిజం ఇవి కూడా చూడండిఇంప్రెషనిజం మూలాలుఇంప్రెషనిజంen:Impressionismకళా ఉద్యమంకాంతిచిత్రలేఖన చరిత్రచిత్రలేఖనంఫ్రాన్సుమాడర్న్ ఆర్ట్రంగు

🔥 Trending searches on Wiki తెలుగు:

దగ్గుబాటి పురంధేశ్వరినరేంద్ర మోదీబ్రహ్మంగారి కాలజ్ఞానంప్రభాస్శుభాకాంక్షలు (సినిమా)పెరిక క్షత్రియులుబైబిల్శ్రీరామనవమిఅష్ట దిక్కులుశివ కార్తీకేయన్టంగుటూరి సూర్యకుమారిఛందస్సుపాముపూర్వాభాద్ర నక్షత్రమువిరాట్ కోహ్లిహనుమజ్జయంతిగుణింతంసామజవరగమనగజేంద్ర మోక్షంఆరుద్ర నక్షత్రముపరశురాముడుకూరభారత జాతీయ చిహ్నంఉండి శాసనసభ నియోజకవర్గంట్రావిస్ హెడ్హనుమాన్ చాలీసాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఉపమాలంకారంటిల్లు స్క్వేర్గోత్రాలు జాబితాపూర్వాషాఢ నక్షత్రముప్రకాష్ రాజ్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుజే.సీ. ప్రభాకర రెడ్డిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్అమెరికా రాజ్యాంగంవందే భారత్ ఎక్స్‌ప్రెస్ఉష్ణోగ్రతమహామృత్యుంజయ మంత్రంకృష్ణా నదికడప లోక్‌సభ నియోజకవర్గంరైలుసమ్మక్క సారక్క జాతరకాశీమెదక్ లోక్‌సభ నియోజకవర్గంకిలారి ఆనంద్ పాల్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాదగ్గుబాటి వెంకటేష్సర్వే సత్యనారాయణపెద్దమనుషుల ఒప్పందంభారతదేశ సరిహద్దులుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిద్విగు సమాసమువిజయసాయి రెడ్డిచాణక్యుడుపిఠాపురంతోటపల్లి మధుజాతీయ ప్రజాస్వామ్య కూటమిసత్యమేవ జయతే (సినిమా)పటికమొదటి పేజీవిష్ణువువృశ్చిక రాశిశింగనమల శాసనసభ నియోజకవర్గంవిశాఖపట్నంగురజాడ అప్పారావుచే గువేరాథామస్ జెఫర్సన్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసజ్జలురమ్య పసుపులేటిఅచ్చులుగైనకాలజీరాబర్ట్ ఓపెన్‌హైమర్అన్నమయ్య జిల్లాభద్రాచలంఆంధ్రప్రదేశ్🡆 More