ఆల్బర్ట్ స్విట్జర్

ఆల్బర్ట్ స్విట్జర్ (Albert Schweitzer) (జ: జనవరి 14, 1875 - మ: సెప్టెంబరు 4, 1965) ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత, లాంబరీని లోని ఆల్బర్ట్ స్విట్జర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు.

ఇతడు 1952 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని 1953 సంవత్సరంలో అందుకున్నాడు. ఇతడు లాంబరీనిలో (ప్రస్తుతం గాబన్ దేశంలో) ఆల్బర్ట్ స్విట్చర్ హాస్పిటల్ ను స్థాపించి అభివృద్ధి చేసి, పశ్చిమ ఆఫ్రికా ప్రజలకు మరువలేని సేవచేశాడు.

Albert Schweitzer
ఆల్బర్ట్ స్విట్జర్
Etching by Arthur William Heintzelman
జననం(1875-01-14)1875 జనవరి 14
Kaysersberg, Alsace-Lorraine
మరణం1965 సెప్టెంబరు 4(1965-09-04) (వయసు 90)
లాంబరీని, గాబన్
జాతీయతజర్మనీ / ఫ్రాన్స్
రంగములువైద్యం, సంగీతం, తత్వశాస్త్రం, theology
ముఖ్యమైన పురస్కారాలుగోతె బహుమతి (1928)
నోబెల్ శాంతి బహుమతి (1952)
ఆల్బర్ట్ స్విట్జర్

వైద్యం

1912 సంవత్సరంలో స్విట్జర్ తన స్వంత ఖర్చులతో ఆఫ్రికాలోని లాంబరీనిలో నున్న పారిస్ మిషనరీ సొసైటీలో వైద్యునిగా పనిచేయడానికి నిర్ణయించుకొన్నాడు. అప్పుడు అదొక ఫ్రెంచి కాలనీ. సంగీత కార్యక్రమాలు నిర్వహించి నిధులు పోగుచేశాడు. అందుకు ప్రముఖ సంగీతకారుడు బాచ్ (Bach) కూడా చాలా సహాయం చేశాడు. 1913 సంవత్సరంలో భార్యతో సహా సుమారు 200 మైళ్ళ దూరం చిన్న తెప్పలో ప్రయాణించి హాస్పిటల్ నెలకొల్పడానికి ప్రయాణమయ్యాడు. మొదటి తొమ్మిది నెలలు భార్యాభర్తలు సుమారు 2,000 మంది వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు. గాయాలనే కాకుండా గుండె సంబంధ వ్యాధుల్ని, అతిసారం, మలేరియా, అనేక రకాలైన జ్వరాలు, లెప్రసీ, మొదలైన చాలా రకాల వ్యాధులకు వైద్యం చేశారు.

భార్య ఫ్రా స్విట్జర్ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్ లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్ అనే ఫ్రెంచి మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు.

ఆల్బర్ట్ స్విట్జర్ 
The watershed of the Ogooé occupies most of Gabon. లాంబరీని గుర్తించబడింది.

మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగిన తర్వాత 1914లో స్విట్జర్లు ఇద్దర్నీ లాంబరీనిలోనే నిర్బంధించారు. 1917లో విశ్రాంతి లేని పనిమూలంగా రక్తహీనతతో బాధపడ్డాడు. జూలై 1918లో స్విట్జర్లాండ్ లోని స్వస్థలానికి వెళ్ళిన తరువాత స్వతంత్రుడయ్యాడు. జర్మనీలో జన్మించిన ఇతడు ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. స్ట్రాస్ బర్గ్ లో మతబోధకుడిగా పనిచేస్తున్నప్పుడు he advanced his project on The Philosophy of Civilization, ఆరోగ్యం మెరుగైన తరువాత 1920 నుండి తిరిగి లాంబరీని వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి మరల సంగీత కార్యక్రమాలు కొనసాగించాడు. 1922 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన డేల్ స్మారక ఉపన్యాసాలు చాలా పేరుపొందాయి. వీనిలో The Decay and Restoration of Civilization, Civilization and Ethics రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి.

1924 సంవత్సరంలో ఒంటరిగా తిరిగి గాబన్ చేరాడు. కొందరు వైద్యుల సహాయంతో వైద్యసేవలు కొనసాగించాడు. వారిలో డా.విక్టర్ నెస్మాన్ ముఖ్యుడు. ఆతని తరువాత డా.ట్రెంజ్ వీనితో చేరాడు. ముందుకాలంలో పనిచేసిన జోసెఫ్ తిరిగి కలిసాడు. 1925-6 లో కొత్త హాస్పిటల్ నిర్మించాడు, తెల్లవారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డుతో సహా. కరువు, అతిసారం ప్రబలడంతో అక్కడి పనివారితోనే హాస్పిటల్ నిర్మాణం కొనసాగించాడు. డా.ట్రెంజ్ సహాయంతో ప్రయోగాలు చేయడం కూడా మొదలుపెట్టారు. హాస్పిటల్ నడుస్తుండగా 1927లో స్విట్జర్ ఐరోపా తిరిగి వచ్చాడు.

స్విట్జర్ మళ్ళీ 1929-1932 మధ్యకాలంలో గాబన్ వెళ్ళి సేవచేశాడు. ఈతని పేరుప్రఖ్యాతులు ఐరోపా అంతా వ్యాపించాయి. మళ్ళీ 1937 లో వచ్చి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు అక్కడే ఉన్నాడు.

మూలాలు

Tags:

18751965ఆఫ్రికాజనవరి 14నోబెల్ బహుమతినోబెల్ శాంతి బహుమతిసెప్టెంబరు 4

🔥 Trending searches on Wiki తెలుగు:

నన్నయ్యకిరణ్ అబ్బవరంఫ్లిప్‌కార్ట్నిర్వహణఅంబ (మహాభారతం)అయ్యలరాజు రామభద్రుడుగూండాచిత్త నక్షత్రముచంద్రగుప్త మౌర్యుడుజాతీయ రహదారి 44 (భారతదేశం)ఉండవల్లి శ్రీదేవిభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుస్మృతి ఇరానిబ్రహ్మంగారి కాలజ్ఞానంక్షయవ్యాధి చికిత్సపరాగసంపర్కముకాన్సర్ఉస్మానియా విశ్వవిద్యాలయంనామనక్షత్రముకాలేయంఅలంకారముకలబందజ్యేష్ట నక్షత్రంఎకరంకందుకూరి వీరేశలింగం పంతులుభారతీయ రైల్వేలుహలో గురు ప్రేమకోసమేఇజ్రాయిల్అనంగరంగమల్లియ రేచనభీష్ముడుఅకాడమీ పురస్కారాలురామేశ్వరంతోలుబొమ్మలాటతెలుగు వికీపీడియాఆరుద్ర నక్షత్రమువృషణంపర్యావరణంతెలంగాణ జాతరలుమర్రిరాజశేఖర చరిత్రముగజము (పొడవు)తులారాశిఖమ్మంబాల కార్మికులుమహాభాగవతంభారతదేశంలో మహిళలునివేదా పేతురాజ్సిరివెన్నెల సీతారామశాస్త్రిసవర్ణదీర్ఘ సంధికర్కాటకరాశిఅశ్వని నక్షత్రముఛందస్సుఆనం వివేకానంద రెడ్డివిజయశాంతిఇందుకూరి సునీల్ వర్మధూర్జటివినాయక్ దామోదర్ సావర్కర్రామప్ప దేవాలయంశతక సాహిత్యముకల్పనా చావ్లాకుబేరుడుస్త్రీఆయుష్మాన్ భారత్సంఖ్యక్విట్ ఇండియా ఉద్యమంసమాసంగర్భంమహాభారతంనాగార్జునసాగర్మశూచికాలుష్యంవినాయకుడురాధ (నటి)భారత ఎన్నికల కమిషనుపాండవులు🡆 More