తెలంగాణ రైతు వేదిక

రైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు.

తెలంగాణ రైతు వేదిక
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రైతు వేదిక భవనం.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకుగాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ, టిఫిన్లను సైతం అందిస్తున్నారు.

ఏర్పాటు

తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఈ రైతు వేదిక ద్వారా సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్‌ గానూ ఈ వేదికలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను నియమించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం, భూమి లభ్యత ఉన్న చోట ఎకరం ప్రభుత్వం కేటాయించింది. రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.

తెలంగాణలో రైతు వేదికలున్న గ్రామాలు

ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యాలు, నిర్వహణ

  • ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక రైతు వేదిక ఉంటుంది. దానికి వ్యవసాయ మండల విస్తరణ అధికారి (ఏఈవో) బాధ్యులుగా ఉంటారు.
  • రైతువేదికల్లో రైతు సమన్వయ సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి.
  • ఖరీఫ్, రబీల్లో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందో వ్యవసాయశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి.
  • పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, రసాయనాల వాడకం గురించి వివరించాలి.
  • పొలాలకు సంబంధించిన భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించాలి.
  • భసార ఫలితాలకనుగుణంగా రైతులు పంటలు సాగుచేసుకునేలా వ్యవసాయాధికారులు చొరవ చూపాలి.

నిధులు

రైతు వేదికల్లో శిక్షణ ద్వారా రైతులను మరింత సుశిక్షితులను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రైతు వేదికల నిర్వహణ, వాటి ద్వారా కర్షకులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఒక్కో రైతు వేదిక నిర్వహణకు 2022 ఏప్రిల్ నెల నుండి నెలకు 9 వేల రూపాయల చొప్పున అందజేసేందుకు నిర్ణయించింది. ఈ నిధులతో రైతు వేదికల కరెంట్‌ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. గతంలోనే ఈ రైతు వేదికల నిర్వహణ కోసం ప్రతినెలా 3 వేల రూపాయలను ఇవ్వడంతోపాటు రైతుల సమావేశాల నిమిత్తం కుర్చీలు, టేబుళ్ళను అందజేసింది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

తెలంగాణ రైతు వేదిక ఏర్పాటుతెలంగాణ రైతు వేదిక తెలంగాణలో రైతు వేదికలున్న గ్రామాలుతెలంగాణ రైతు వేదిక ప్రారంభోత్సవంతెలంగాణ రైతు వేదిక లక్ష్యాలు, నిర్వహణతెలంగాణ రైతు వేదిక నిధులుతెలంగాణ రైతు వేదిక మూలాలుతెలంగాణ రైతు వేదిక వెలుపలి లంకెలుతెలంగాణ రైతు వేదికకల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)

🔥 Trending searches on Wiki తెలుగు:

వరిబీజంసచిన్ టెండుల్కర్ఐక్యరాజ్య సమితిసునీత మహేందర్ రెడ్డిభారతదేశ జిల్లాల జాబితారాకేష్ మాస్టర్గురజాడ అప్పారావుపర్యావరణంవృషభరాశిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్నామినేషన్శుక్రుడు జ్యోతిషంకరోనా వైరస్ 2019దొంగ మొగుడువై.యస్. రాజశేఖరరెడ్డిLదీపావళిఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంపురాణాలుఆరూరి రమేష్నాగ్ అశ్విన్బైండ్లభారతీయ తపాలా వ్యవస్థబాదామిపచ్చకామెర్లుచిరంజీవులుగజేంద్ర మోక్షంఛందస్సునవరసాలుతెలుగు వికీపీడియారామరాజభూషణుడుశింగనమల శాసనసభ నియోజకవర్గంశ్రీలీల (నటి)కస్తూరి రంగ రంగా (పాట)శుక్రుడుబతుకమ్మనవరత్నాలుటిల్లు స్క్వేర్ఛత్రపతి శివాజీజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)తెలంగాణ చరిత్రభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థవడ్డీసెక్యులరిజంసిద్ధు జొన్నలగడ్డఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సాలార్ ‌జంగ్ మ్యూజియంనక్షత్రం (జ్యోతిషం)చిరుధాన్యంవిరాట పర్వము ప్రథమాశ్వాసమువేమన శతకముఅనసూయ భరధ్వాజ్పెంటాడెకేన్అమెరికా రాజ్యాంగంథామస్ జెఫర్సన్సింహంరోనాల్డ్ రాస్గూగ్లి ఎల్మో మార్కోనిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఇజ్రాయిల్వంకాయజోల పాటలులలితా సహస్రనామ స్తోత్రంఋగ్వేదంఅక్కినేని నాగ చైతన్యశాసనసభ సభ్యుడులావు శ్రీకృష్ణ దేవరాయలుతెలుగు సినిమాలు 2024కృష్ణా నదికోవూరు శాసనసభ నియోజకవర్గంపరిపూర్ణానంద స్వామిబంగారంనందిగం సురేష్ బాబుపి.సుశీలమెదడుసాయిపల్లవిబోడె రామచంద్ర యాదవ్🡆 More