మొలత్రాడు

హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు.

మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.

మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం . ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు. పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అన్న (మూఢ) నమ్మకం ఇప్పటికీ ఉంది.

మొలత్రాడులు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం. లుంగీ, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడుకి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉంది.

స్నానాల వలన నీళ్ళని పీల్చటం వలన మొలత్రాడు మెత్తబడి, లేక ఉదరభాగం పెరిగి మరీ బిగుతుగా ఉండటం మూలాన కొంత కాలానికి అది తెగిపోతుంది. అప్పుడు మరల క్రొత్తది కొనాలి.

సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా ఉంది. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యంలో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.

ఇవి కూడా చూడండి

Tags:

బంగారం

🔥 Trending searches on Wiki తెలుగు:

జంద్యమురవి కిషన్వృక్షశాస్త్రంయోనిమేకపాటి చంద్రశేఖర్ రెడ్డిసరస్వతిరవితేజసర్దార్ వల్లభభాయి పటేల్గుణింతంహీమోగ్లోబిన్భారత ఎన్నికల కమిషనుముహమ్మద్ ప్రవక్తకామసూత్రపెద్దమనుషుల ఒప్పందంజయలలిత (నటి)మానవ హక్కులుమౌర్య సామ్రాజ్యంమంద కృష్ణ మాదిగడేటింగ్ఖమ్మంతెలంగాణ రాష్ట్ర సమితిఘంటసాల వెంకటేశ్వరరావుఉపాధ్యాయుడుభలే రంగడునవగ్రహాలు జ్యోతిషంపోషణకంటి వెలుగుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశుక్రుడుకాకతీయులుఆనందరాజ్గ్రీన్‌హౌస్ ప్రభావంసుందర కాండజనాభాతెనాలి రామకృష్ణుడుచెట్టుఅంగుళంతెలుగు నాటకంరష్యాబారసాలపోలవరం ప్రాజెక్టుచంపకమాలశ్రీనాథుడుభారతదేశ ప్రధానమంత్రిసమతామూర్తిఅజర్‌బైజాన్మార్చి 28కావ్య ప్రయోజనాలుపార్శ్వపు తలనొప్పివేయి శుభములు కలుగు నీకుశివాత్మికప్రజాస్వామ్యంఅష్టదిగ్గజములుప్రియురాలు పిలిచిందిబగళాముఖీ దేవిగోధుమబలగంబ్రహ్మజ్యోతీరావ్ ఫులేవృషణంభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుశతభిష నక్షత్రముహలో గురు ప్రేమకోసమేమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంగుండెభారతదేశంలో బ్రిటిషు పాలననిఖత్ జరీన్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థమిషన్ భగీరథతాడికొండ శాసనసభ నియోజకవర్గంనువ్వు లేక నేను లేనుదళితులుకుష్టు వ్యాధిబరాక్ ఒబామాకళలుహిమాలయాలుతిక్కన🡆 More