దసరా పద్యాలు

దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు.

పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు..

దసరా పద్యాలు
దుర్గాదేవి - దేవీ నవరాత్రులు (దసరా)

పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూడండి

పద్యం 1

ఏ దయా మీ దయా మా మీద లేదు,

ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,

దసరాకు వస్తిమనీ విసవిసలు పడక

చేతిలో లేదనక అప్పివ్వరనక

పావలా.. .ఐతే ...పట్టేది లేదు,

అర్ధ రూపాయైతె అంటేది లేదు,

ముప్పావలా అయితే ముట్టేది లేదు,

అచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,

అయ్య వారికి చాలు ఐదు వరహాలు

పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు

జయీభవా...దిగ్విజయీభవా

పద్యం 2

రాజాధిరాజ శ్రీ రాజ మహరాజ

రాజ తేజోనిధీ రాజ కందర్ప

రాజకంఠీరావా రాజ మార్తాండ

రాజ రత్నాకరా రాజకుల తిలక

రాజ విద్య్త్సభా రంజన మనోజ

రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస

సుజన మనోధీశ సూర్య ప్రకాశ

నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ

ప్రకటిత రిపు భంగ పరమాత్మ రంగ

వర శిరో మాణిక్య వాణి సద్వాక్య

పరహిత మది చిత్ర పావన చరిత్ర

ఉభయ విద్యా ధుర్య ఉద్యోగ ధుర్య

వివిధ సద్గుణ ధామ విభవాభిరామ

జయీభవా...దిగ్విజయీభవా

ఛందస్సు: మత్తేభవిక్రీడితము

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇంటి పేర్లుతామర పువ్వుభారతదేశ రాజకీయ పార్టీల జాబితామిషన్ ఇంపాజిబుల్శ్రీ కృష్ణుడుఐశ్వర్య రాయ్వెల్లుల్లిశ్రీశైల క్షేత్రంపంచతంత్రంభారతదేశంలో మహిళలుచోళ సామ్రాజ్యంగర్భాశయముస్వలింగ సంపర్కంగ్యాస్ ట్రబుల్హస్తప్రయోగంబద్రీనాథ్ దేవస్థానంచాట్‌జిపిటిభూమిశ్రీశైలం (శ్రీశైలం మండలం)బ్రహ్మంగారి కాలజ్ఞానంవావిలినీతి ఆయోగ్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగూగుల్సోరియాసిస్కర్మ సిద్ధాంతంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనర్మదా నదిఅండాశయముపట్టుదలఅంతర్జాతీయ నృత్య దినోత్సవంఫ్లిప్‌కార్ట్క్షయకామశాస్త్రంఉమ్మెత్తప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావేయి స్తంభాల గుడికాకతీయులుకొండగట్టుబి.ఆర్. అంబేడ్కర్భారత రాజ్యాంగ ఆధికరణలుహనుమంతుడుస్వామితెలుగు వికీపీడియాభారత జాతీయ చిహ్నంరాజ్యసంక్రమణ సిద్ధాంతంసముద్రఖనివినాయకుడుతెలుగు భాష చరిత్రసురేందర్ రెడ్డిగ్రామంరామోజీరావుభారతదేశంలో జాతీయ వనాలుగౌతమ బుద్ధుడుకీర్తి సురేష్లక్ష్మీనరసింహాజగ్జీవన్ రాంతెలంగాణ జిల్లాలురామావతారముమేషరాశిఈశాన్యంభారత రాష్ట్రపతులు - జాబితాధర్మవరపు సుబ్రహ్మణ్యంగ్రామ రెవిన్యూ అధికారిబాబర్అనుపమ పరమేశ్వరన్దేవులపల్లి కృష్ణశాస్త్రిపూర్వ ఫల్గుణి నక్షత్రముసర్కారు వారి పాటదక్షిణ భారతదేశంపసుపు గణపతి పూజశ్రీరామనవమిరాశికరికాల చోళుడుబోనాలుబిచ్చగాడు 2జాతీయ విద్యా విధానం 2020శివుడు🡆 More