నటరత్న యన్.టి.రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చలనచిత్ర రంగం నుండి నిష్క్రమించారు.
ఈ సంవత్సరం 104 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సురేశ్ ప్రొడక్షన్స్ 'ముందడుగు' అత్యధిక వసూళ్ళు సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈతరం పిక్చర్స్ 'నేటి భారతం' కూడా సూపర్ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకొని, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం చేసుకుని టి.కృష్ణ శైలి సామాజిక చిత్రాలకు, విజయశాంతి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు నాంది పలికింది. 'ఖైదీ' సంచలన విజయం సాధించి, అప్పటి యంగ్ హీరో చిరంజీవిని స్టార్‌గా నిలిపి, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇంకా "అభిలాష, ఎమ్.ఎల్.ఎ. ఏడుకొండలు, కిరాయి కోటిగాడు, ధర్మాత్ముడు, పోరాటం, ప్రజారాజ్యం, బహుదూరపు బాటసారి, మగమహారాజు, మనిషికోచరిత్ర, రాముడు కాదు కృష్ణుడు, శక్తి, శ్రీరంగనీతులు, సాగరసంగమం, అడవి సింహాలు" శతదినోత్సవాలు జరుపుకోగా,"గూఢచారి నంబర్ వన్, చండశాసనుడు, మంత్రిగారి వియ్యంకుడు, పండంటి కాపురానికి 12 సూత్రాలు, పిచ్చిపంతులు, పెళ్ళిచూపులు, ముక్కుపుడక, మూడుముళ్ళు, రామరాజ్యంలో భీమరాజు, సంఘర్షణ" కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి. 'చండశాసనుడు'తో శారద ట్రాజెడీ బ్రాండ్ నుండి బయటకు వచ్చి దశాబ్దంపైగా సీరియస్ కేరెక్టర్స్ పోషించగలిగారు. 'ప్రేమసాగరం' డబ్బింగ్ సినిమా సంచలన విజయం సాధించి, ఉదయం ఆటలతో 450 రోజులు అనేక కేంద్రాలలో రిలీజ్ అయిన థియేటర్లలోనే ప్రదర్శితమైంది. అక్కడ నుండి తెలుగులోకి డబ్బింగ్ సినిమాల వెల్లువ ఆరంభమైంది. 'సాగరసంగమం' బెంగుళూరులో 511 రోజులు ఉదయం ఆటలతో ప్రదర్శితమైంది. ఈ యేడాది ఐదు డైరెక్టు శతదినోత్సవాలతో కృష్ణ కెరీర్లో రికార్డు నమోదు చేసింది.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |
This article uses material from the Wikipedia తెలుగు article తెలుగు సినిమాలు 1983, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.