చొక్కాపు వెంకటరమణ

చొక్కాపు వెంకటరమణ మెజీషియన్, రచయిత.

ఆయన బాల సాహితీకారుడు. ఆయన బాల‌సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు అందుకున్నారు.

జీవిత విశేషాలు

ఆయన విజయవాడలో శ్రీమతి సావిత్రమ్మ, దానయ్య దంపతులకు ఏప్రిల్ 1 1948 న జన్మించారు. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులైనారు. జయస్రీ, జనత వంటి పత్రిలలో ఉద్యోగం చేసారు. తరువాత ఈనాడు సంస్థ వారి పత్రికలైన విపుల, చతుర లలో సహ సంపాదకునిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురణల విభాగానికి ప్రొడక్షన్ ఎడిటరుగా పనిచేసారు. ఆయన పనిచేసిన 18 యేండ్ల కాలంలో సుమారు 100 పుస్తకాలను ముద్రించారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ (జవహర్‌ బాలభవన్‌)లో 18 ఏళ్లు పనిచేసిప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. వ్యక్తిగతంగా మేజిక్‌షో, మిమిక్రీ, టాకింగ్‌డాల్‌ (వెంట్రిలాక్విజం), మైమ్‌, ఫైర్‌డాన్స్‌, పపెట్‌షో, షాడోప్లే, జుగ్లింగ్‌, స్టిక్‌వాకింగ్‌, క్లొన్స్‌, కార్టూనిస్టుగా, జర్నలిస్ట్‌గా, ఎడిటర్‌గా, వ్యక్తిత్వ వికాస, బాలసాహిత్య శిక్షణా శిబిరాల డైరక్టర్‌గా, బాలసాహిత్య రచయితగా అనేక కళా ప్రక్రియలలో ప్రవేశం ఉన్న కళాకారుడు ఈయన.

బాలల తొలి వ్యక్తిత్వ వికాస మాసపత్రిక అయిన "ఊయల" కు సంపాదకునిగా పనిచేసారు. ఆయన పిల్లల కోసం కథారచన శిక్షణ శిబిరాలు, బాల సాహిత్య రచయితల సదస్సులు నిర్వహించారు. నర్సరీ విద్యార్థుల కోసం అనేక బాల గేయాలు రాసారు.

రచనలు

ఆయన సుమారు 60 కి పైగా బాల సాహిత్య గ్రంథాలను వ్రాసారు. అందులో ఎన్నో పుస్తకాలు ఆయనకు కీర్తిని తెచ్చిపెట్టాయి. అవి బాల సాహిత్యంలో మంచి పుస్తకాలుగా నిలిచిపోయాయి.

  • అల్లరి సూర్యం
  • చెట్టుమీద పిట్ట
  • కాకి కడవ
  • కొతి చదువు
  • సింహం - గాడిద
  • బాతు - బంగారుగుడ్డు
  • గాడిద తెలివి
  • తేలు చేసిిన మేలు
  • ఏడు చేపలు
  • పిల్లలు పాడుకునే చిట్టిపొట్టి పాటలు
  • ఏది బరువు
  • మంచికోసం
  • నెలలు వాటి కతథలు
  • అక్షరాలతో ఆటలు
  • పిల్లలకోసం ఇంద్రజాలం
  • గోరింక గొప్ప
  • గుర్రం గాడిద
  • నాన్నాపులి
  • పట్నం ఎలుక
  • పొగరుబోతు కుక్క

జర్నలిస్టుగా

ఆయన బాల చంద్రిక పిల్లల మాసపత్రికకు సంపాదకుడిగా, బాల చెలిమి, చెకుముకి మాసపత్రికలకు గౌరవ సలహాదారునిగా వ్యవహరించారు. వీరు వివిధ దిన, వార, మాస పత్రికల్లో శీర్షికలూ నిర్వహించారు. సుమారు 500 లకు పైగా వ్యాసాలు, కథలు, గేయాలు, శీర్షికలు రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలో బాలభూమి వంటి ప్రత్యేక కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వీరు నిర్వహించిన ఊయలకు మంచిపేరు వచ్చింది. వీరి చెట్టుమీద పిట్ట కథా సంపుటి పర్యావరణం గురించి చిన్నారుల్లో చైతన్యాన్ని నింపుతుంది. దీనికి పలు అవార్డులు కూడా వచ్చాయి.

ఇంద్రజాలికునిగా

ఆయన ఇంద్రజాలికునిగా వేలాదిగా ప్రదర్శనలు ఇస్తూ భారతదేశం అంతా తిరిగారు. మేజిక్ చాప్లిన్ గా పేరు తెచ్చుకున్నారు. బాలసాహిత్యం, విద్యా విషయక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక పదవులు, హోదాలలో పనిచేశారు. బాలసాహిత్యానికి సంబంధించి అనేక సభలలో ప్రసంగాలు చేశారు. వీటితోపాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. వికలాంగులకు ప్రోత్సాహాన్నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. కృత్రిమ కాళ్ల పంపిణీ, అనాథలకు మానసిక సంతోషాన్నిచ్చే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లాంటివి స్వచ్ఛందంగా చేస్తున్నారు.

తొలి బాల సాహిత్య సదస్సు

50 ఏళ్ల సాహిత్య అకాడమీ చరిత్రలో నిర్వహించిన తొలి బాల సాహిత్య సదస్సు 12 మార్చి 2011న తెనాలిలో జరిగింది. ఆ సదస్సుకు వీరికి సాహిత్య అకాడమీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. బాలలకు తనదైన శైలిలో మిమిక్రీ, మ్యాజిక్‌లు చేస్తూ కథను పిల్లలకు ఎంత సరళంగా చెప్పవచ్చో రకరకాల ప్రయోగాలు ఎలా చేయవచ్చో వినిపించి పలువురిని ఆకర్షించారు.

అవార్డులు - పురస్కారాలు

వెంకటరమణ వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘మిస్టర్‌ చొ’, ‘సేవాచక్ర’, ‘బాలసాహితీ భూషణ’, ‘మాస్టర్‌ మోటివేటర్‌’, ‘మేజిక్‌ చాప్లిన్‌’, ‘డా.ఎన్‌.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం వంటి అనేక పురస్కారాలు పొందరు. 2008లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్యమంత్రి ద్వారా అందుకున్నారు. ఆయన చైతన్య ఆర్ట్ థియేటర్స్ వారి సేవాభూషణ సత్కారం సత్కారం పొందారు. లిమ్కాబుక్ రికార్డులలో స్థానం సంపాదించారు. కేంద్ర బాలల సాహిత్య అకాడమి పురస్కారం పొందారు.

  1. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (చెట్టు చెప్పిన కథలు పుస్తకానికి)

మూలాలు

ఇతర లింకులు

Tags:

చొక్కాపు వెంకటరమణ జీవిత విశేషాలుచొక్కాపు వెంకటరమణ రచనలుచొక్కాపు వెంకటరమణ జర్నలిస్టుగాచొక్కాపు వెంకటరమణ ఇంద్రజాలికునిగాచొక్కాపు వెంకటరమణ తొలి బాల సాహిత్య సదస్సుచొక్కాపు వెంకటరమణ అవార్డులు - పురస్కారాలుచొక్కాపు వెంకటరమణ మూలాలుచొక్కాపు వెంకటరమణ ఇతర లింకులుచొక్కాపు వెంకటరమణ

🔥 Trending searches on Wiki తెలుగు:

పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభరతుడుసోరియాసిస్రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తెలుగు సంవత్సరాలుఅనంగరంగమహాత్మా గాంధీమహారాష్ట్రసీతారామ కళ్యాణం (1961 సినిమా)ఉత్పలమాలవచన కవితభూమి యాజమాన్యంఇస్లాం మతంమార్చి 27వాయు కాలుష్యంఆవుఆది పర్వముకలబందపెళ్ళి చూపులు (2016 సినిమా)ఆంధ్ర మహాసభ (తెలంగాణ)సల్మాన్ ఖాన్మంగ్లీ (సత్యవతి)నందమూరి తారక రామారావుఖలిస్తాన్ ఉద్యమంగిరిజనులుఆయుష్మాన్ భారత్దసరాపొడపత్రిఘంటసాల వెంకటేశ్వరరావుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాదిల్ రాజుపునర్వసు నక్షత్రముభగవద్గీతఛత్రపతి శివాజీఉండవల్లి శ్రీదేవిరావు గోపాలరావుపల్నాటి యుద్ధంఉబ్బసముకాశీహైదరాబాదుఆవర్తన పట్టికభారతీయ రైల్వేలుసంస్కృతంఛందస్సునాగార్జునసాగర్క్షత్రియులుచతుర్వేదాలుపాల కూరఆటలమ్మసరోజినీ నాయుడుపేరురామ్ మిరియాలభారత రాజ్యాంగ సవరణల జాబితాఅబ్యూజాభారతదేశ అత్యున్నత న్యాయస్థానంచిరంజీవిప్రియదర్శి పులికొండజీమెయిల్ఘట్టమనేని కృష్ణనివేదా పేతురాజ్సంక్రాంతిసర్పంచిఆరెంజ్ (సినిమా)ద్వాదశ జ్యోతిర్లింగాలుబంగారం (సినిమా)రక్తంఐక్యరాజ్య సమితిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుచెట్టుయాదవతెలంగాణ ఉద్యమంనోటి పుండులైంగిక విద్యఅర్జున్ దాస్శివాత్మిక🡆 More