ఇబ్రహీం జద్రాన్

జద్రాన్ (జననం 2001 డిసెంబరు 12) ఆఫ్ఘన్ క్రికెటరు.

అతను 2019 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం టెస్టుల్లో అడుగుపెట్టాడు.

ఇబ్రహీం జద్రాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-12-12) 2001 డిసెంబరు 12 (వయసు 22)
ఖోస్త్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
బంధువులు
  • Noor Ali Zadran (uncle)
  • Mujeeb Ur Rahman (cousin)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 15)2019 సెప్టెంబరు 5 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 48)2019 నవంబరు 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 5 September 2023 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 41)2019 నవంబరు 14 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 మార్చి 27 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–presentMis Ainak నైట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 5 18 24 19
చేసిన పరుగులు 362 904 530 1162
బ్యాటింగు సగటు 36.20 56.5 26.50 38.73
100లు/50లు 0/3 4/4 0/2 2/7
అత్యుత్తమ స్కోరు 87 162 64* 105
వేసిన బంతులు 12 150
వికెట్లు 1 3
బౌలింగు సగటు 13.00 24.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 3/– 6/– 25/–
మూలం: Cricinfo, 7 June 2023

దేశీయ కెరీర్

అతను 2017 ఆగస్టు 11న 2017 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం లిస్టు ఎ క్రికెట్‌లో ప్రవేశించాడు. 2017 సెప్టెంబరు 12న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు

2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు.

2021లో ఇబ్రహీం, బెర్క్‌షైర్‌లోని బోయిన్ హిల్ తరపున ఆడాడు. ఓపెనర్‌గా ఆడుతూ, 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ కెరీర్

డిసెంబరు 2018లో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అండర్-23 జట్టులో ఎంపికయ్యాడు.

డిసెంబరు 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. అతను 186 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

2019 ఆగష్టులో ఇబ్రహీం, బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. 2019 సెప్టెంబరు 5న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన రంగప్రవేశం చేశాడు మరుసటి నెలలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను 2019 నవంబరు 11న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ఆడాడు. 2019 నవంబరు 14న వెస్టిండీస్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున T20I ల్లో రంగప్రవేశం చేసాడు.

2019 డిసెంబరులో, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను ఐదు మ్యాచ్‌ల్లో 240 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2022 జూన్‌లో, జింబాబ్వేతో జరిగిన రెండవ మ్యాచ్‌లో జద్రాన్, 120 పరుగులతో అజేయంగా వన్‌డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. 2022 నవంబరులో, అతను తన రెండవ వన్‌డే సెంచరీ (106), శ్రీలంకపై పల్లెకెల్లెలో చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో, 162 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో తన దేశానికి చెందిన ఆటగాడి అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అతను 92.66 సగటుతో 278 పరుగులతో సిరీస్‌ను ముగించి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

ఆరు నెలల తర్వాత, 2023 జూన్‌లో ఇబ్రహీం, 2023 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై 98 పరుగులు చేసి, హంబన్‌తోటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను 106, 10, 162, 98 పరుగులు చేశాడు.

మూలాలు

Tags:

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుక్రికెట్టెస్ట్ క్రికెట్

🔥 Trending searches on Wiki తెలుగు:

కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భారత రాజ్యాంగ ఆధికరణలుయూకలిప్టస్సత్య సాయి బాబాగుణింతంరాహువు జ్యోతిషంబ్రహ్మంగారి కాలజ్ఞానందుర్యోధనుడురమ్యకృష్ణగ్యాస్ ట్రబుల్ప్రకృతి - వికృతిదగ్గుబాటి వెంకటేష్సాక్షి వైద్యరెవెన్యూ గ్రామంభారతీయ నాట్యంహర్షవర్థనుడుపావని గంగిరెడ్డిసర్వేపల్లి రాధాకృష్ణన్మిషన్ భగీరథచాకలి ఐలమ్మజయసుధనర్మదా నదిమకరరాశివిశ్వబ్రాహ్మణఅరుణాచలంతెలంగాణ ఆసరా పింఛను పథకంరావణుడుశేషాద్రి నాయుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమా ఊరి పొలిమేరభారత రాజ్యాంగ పరిషత్భారత స్వాతంత్ర్యోద్యమంశని (జ్యోతిషం)తిథివారసుడు (2023 సినిమా)నివేదా పేతురాజ్శక్తిపీఠాలుతిక్కనమూలా నక్షత్రంవాల్మీకితేలుభారత రాజ్యాంగ సవరణల జాబితాబ్రాహ్మణులునారా చంద్రబాబునాయుడుహనుమాన్ చాలీసాసంభోగంపల్లవులుచిరంజీవిప్లీహముఇండుపుప్రియురాలు పిలిచిందిభారత రాష్ట్రపతిజాతిరత్నాలు (2021 సినిమా)నిర్మలమ్మగిలక (హెర్నియా)రామేశ్వరం2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలురక్తపోటుఏజెంట్ఈనాడురామోజీరావుక్రికెట్బంగారంనరసింహ శతకముసంస్కృతంఋతువులు (భారతీయ కాలం)ఉప రాష్ట్రపతిసాలార్ ‌జంగ్ మ్యూజియంరామదాసుకుంభమేళాజాతీయములుసింధు లోయ నాగరికతగోత్రాలుగుత్తా రామినీడుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్భారత సైనిక దళంసావిత్రి (నటి)అమ్మ🡆 More